సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు (Birthday wishes) తెలిపారు.
తన ప్రియ మిత్రుడికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. రజనీకాంత్ (Rajinikanth) వ్యక్తిత్వాన్ని, ఆయన ప్రయాణాన్ని చంద్రబాబు కొనియాడారు.
"నా ప్రియ మిత్రుడు, లెజెండరీ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. తెరపై, నిజ జీవితంలో హీరోలుగా ప్రకాశించే అతి కొద్ది మందిలో ఆయన ఒకరు. ఆయన వ్యక్తిగత ప్రయాణం కూడా అసాధారణమైన సినిమా ప్రయాణం అంతే స్ఫూర్తిదాయకం.
ఆయనకు ఈ రోజు మరెన్నో సంతోషాలను ఇవ్వాలని కోరుకుంటున్నాను. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షిస్తున్నాను!" అని చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు.
చంద్రబాబు, రజనీకాంత్ మధ్య దశాబ్దాలుగా బలమైన స్నేహబంధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. గతంలో అనేక బహిరంగ సభల్లో ఇరువురూ తమ స్నేహాన్ని, ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు.
చంద్రబాబు లాంటి రాజకీయ నాయకుడు చాలా అరుదని రజనీకాంత్ పలు సందర్భాల్లో ప్రశంసించగా, రజనీకాంత్ వ్యక్తిత్వాన్ని చంద్రబాబు కూడా ఎన్నోసార్లు కొనియాడారు. ఈ నేపథ్యంలో రజనీ పుట్టినరోజున చంద్రబాబు చేసిన పోస్ట్ వారి స్నేహానికి నిదర్శనంగా నిలిచింది.