AP CET : ఉన్నత విద్యకు వేళాయే.. ‘సెట్ల’కు సారథుల నియామకం! పరీక్షల షెడ్యూల్ విడుదల!

2026-01-15 11:00:00
AP Scholarship: ఒక్కొక్కరికి రూ.20,000... ఏపీ ప్రభుత్వ స్కాలర్ షిప్! పూర్తి వివరాలు!

ఆంధ్రప్రదేశ్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఉన్నత విద్య ప్రవేశ పరీక్షల ప్రక్రియకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్, ఎంబీఏ, ఎంసీఏ, లా, ఎడ్యుకేషన్, పీజీ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు (CET) అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు. ఏప్రిల్ 23 నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షల కోసం షెడ్యూల్ ఇప్పటికే విడుదల కాగా, నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Boarder: సరిహద్దుల్లో పాక్ డ్రోన్ల కలకలం..! కాల్పులతో తరిమికొట్టిన భారత సైన్యం!

ఈ ప్రవేశ పరీక్షల పర్యవేక్షణ కోసం వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన సీనియర్ ఆచార్యులను కన్వీనర్లుగా నియమిస్తూ, ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఆచార్య బి. తిరుపతిరావు ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్షల నిర్వహణ సజావుగా జరిగేలా అనుభవం ఉన్న విద్యావేత్తలను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి ప్రవేశ పరీక్షకు సంబంధించి ప్రత్యేక కన్వీనర్‌ను నియమించడం ద్వారా పారదర్శకత, సమర్థవంతమైన నిర్వహణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

Thailand: థాయ్‌లాండ్‌లో ఘోర రైలు ప్రమాదం..! రైలుపై కూలిన క్రేన్.. 22 మంది మృతి!

ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు కీలకమైన ఏపీ ఈఏపీసెట్‌కు జేఎన్‌టీయూ–కాకినాడకు చెందిన ప్రొ. మోహన్ రావును కన్వీనర్‌గా నియమించారు. డిప్లొమా పూర్తిచేసిన విద్యార్థుల కోసం నిర్వహించే ఏపీ ఈసెట్ బాధ్యతలను జేఎన్‌టీయూ–అనంతపురానికి చెందిన ప్రొ. బి. దుర్గాప్రసాద్‌కు అప్పగించారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఐసెట్‌కు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొ. ఎం. శశిని సారథ్యం వహించనున్నారు.

Transport News: ఆ ప్రాంత ప్రజలకు శుభవార్త – కేవలం రెండున్నర గంటల్లోనే తిరుపతికి ప్రయాణం..!!

పీజీ సాంకేతిక కోర్సులైన ఎంటెక్, ఎంఫార్మా ప్రవేశాలకు జరిగే ఏపీ పీజీఈసెట్‌కు ప్రొ. మల్లికార్జున రావును, న్యాయ విద్య ప్రవేశ పరీక్ష అయిన ఏపీ లాసెట్‌కు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొ. సీతా కుమారిని కన్వీనర్‌గా నియమించారు. బీ.ఎడ్ కోర్సుల కోసం జరిగే ఏపీ ఎడ్‌సెట్‌ను ప్రొ. శ్రీనివాస్ కుమార్ పర్యవేక్షించనుండగా, సాధారణ పీజీ కోర్సుల కోసం నిర్వహించే ఏపీ పీజీసెట్‌కు ప్రొ. వి. పద్మావతిని ఎంపిక చేశారు. శారీరక విద్య కోర్సుల ప్రవేశ పరీక్ష అయిన ఏపీ పీఈసెట్‌కు ప్రొ. పాల్ కుమార్‌ను నియమించారు.

మూడు రోజులు, మూడు రహస్యాలు… అసలు కథ!

పరీక్షల షెడ్యూల్ ప్రకారం ఏపీ ఈసెట్ ఏప్రిల్ 23న, ఐసెట్ ఏప్రిల్ 28న, పీజీఈసెట్ ఏప్రిల్ 29, 30 మరియు మే 2 తేదీల్లో జరుగనుంది. లాసెట్, ఎడ్‌సెట్ మే 4న, పీజీసెట్ మే 5, 8, 9, 10, 11 తేదీల్లో నిర్వహిస్తారు. ఇంజినీరింగ్ ఈఏపీసెట్ మే 12 నుంచి 15 మరియు 18 తేదీల్లో, అగ్రికల్చర్, ఫార్మా ఈఏపీసెట్ మే 19, 20న జరుగుతుంది. విద్యార్థులు ఈ తేదీలను గుర్తుంచుకుని ముందుగానే ప్రణాళికతో సిద్ధమవ్వాలని ఉన్నత విద్యామండలి అధికారులు సూచిస్తున్నారు.

Sankranthi Gift: 45 ఏళ్ల తర్వాత పరిష్కారం.. సంక్రాంతి కానుకగా ఆ 2,111 కుటుంబాలకు ఫ్లాట్ల కేటాయింపు!
AP Government: ఏపీలో వారికి భారీ ఊరట! రూ.2,600 కోట్లు విడుదల... ఒక్కొక్కరి ఖాతాలో రూ.60,000!
Movie Review 2026: కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న ‘నారి నారి నడుమ మురారి’ ఎలా ఉంది అంటే?
Movie Review Telugu: సంక్రాంతికి నవ్వుల పండుగ తెచ్చిన నవీన్ పోలిశెట్టి – ‘అనగనగా ఒక రాజు’తో మరోసారి వన్ మ్యాన్ షో.!!
Amaravathi: అమరావతి మాస్టర్ ప్లాన్ విస్తరణకు సీఆర్డీఏ కీలక కసరత్తు! కొత్త హద్దులు, కీలక నిర్ణయాలు!!

Spotlight

Read More →