Prajavedhika: ఆధార్ కార్డు బ్లాక్ చేసి భూమి కబ్జా.. రెవెన్యూ అధికారుల 'హైటెక్' దందా! కోర్టు తీర్పు ఉన్నా దక్కని భూమి.. Indian Rupee: బెంబేలెత్తుతున్న రూపాయి... అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ హవా! కారణం ఇదే! Reliance Data Center: ఉత్తరాంధ్ర తలరాతను మార్చేస్తున్న ఆ 1.6 లక్షల కోట్ల ప్రాజెక్ట్! Weather Update: ఏపీ ప్రజలకు అలర్ట్: రేపు 10 మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. అప్రమత్తంగా ఉండండి! Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.... కాకినాడ-లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు ప్రారంభం! Perugu Vada: వేసవి స్పెషల్: ఇంట్లోనే హోటల్ స్టైల్ పెరుగు వడ.. ఇలా చేస్తే రుచి అద్భుతం! Credit Card: క్రెడిట్ కార్డుల రివార్డుల తిప్పలు.. ఎక్కువ కార్డులు ఉంటే లాభమా? నష్టమా? Good Governance: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్! ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు.. అన్ని సేవలు అక్కడే! SSC Results 2026: ఏపీ పదో తరగతి రిజల్ట్స్ వచ్చేశాయి... డైరెక్ట్ లింక్ ఇదే! LV Prasad Eye Hospital: ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్... ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు! Prajavedhika: ఆధార్ కార్డు బ్లాక్ చేసి భూమి కబ్జా.. రెవెన్యూ అధికారుల 'హైటెక్' దందా! కోర్టు తీర్పు ఉన్నా దక్కని భూమి.. Indian Rupee: బెంబేలెత్తుతున్న రూపాయి... అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ హవా! కారణం ఇదే! Reliance Data Center: ఉత్తరాంధ్ర తలరాతను మార్చేస్తున్న ఆ 1.6 లక్షల కోట్ల ప్రాజెక్ట్! Weather Update: ఏపీ ప్రజలకు అలర్ట్: రేపు 10 మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. అప్రమత్తంగా ఉండండి! Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.... కాకినాడ-లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు ప్రారంభం! Perugu Vada: వేసవి స్పెషల్: ఇంట్లోనే హోటల్ స్టైల్ పెరుగు వడ.. ఇలా చేస్తే రుచి అద్భుతం! Credit Card: క్రెడిట్ కార్డుల రివార్డుల తిప్పలు.. ఎక్కువ కార్డులు ఉంటే లాభమా? నష్టమా? Good Governance: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్! ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు.. అన్ని సేవలు అక్కడే! SSC Results 2026: ఏపీ పదో తరగతి రిజల్ట్స్ వచ్చేశాయి... డైరెక్ట్ లింక్ ఇదే! LV Prasad Eye Hospital: ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్... ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు!

Farmers: రైతులకు శాస్త్రీయ మార్గదర్శకంగా “పశుసంవర్ధక మార్గదర్శిని” ప్రారంభం

Farmers: ఆంధ్రప్రదేశ్‌లో పశుసంవర్ధక రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కొత్త దిశగా అడుగులు వేస్తోంది. రైతులకు శాస్త్రీయ పద్ధతుల్లో మార్గనిర్దేశం చేయడానికి “పశుసంవర్ధక మార్గదర్శిని” అనే ఈ-మేగజైన్‌ను రాష్ట్ర వ్యవసాయ, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారు.

Published : 2026-04-30 16:10:00

పాడి పశువుల నుంచి కోట్ల ఆర్థిక వృద్ధి..

రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా చ‌ర్య‌లు..

ఆంధ్రప్రదేశ్‌లో పశుసంవర్ధక రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కొత్త దిశగా అడుగులు వేస్తోంది. రైతులకు శాస్త్రీయ పద్ధతుల్లో మార్గనిర్దేశం చేయడానికి “పశుసంవర్ధక మార్గదర్శిని” అనే ఈ-మేగజైన్‌ను రాష్ట్ర వ్యవసాయ, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది రైతులు పాడి పశువులు, చిన్న జీవాలు, నాటు కోళ్ల పెంపకంతో అనుబంధంగా ఉన్నారని తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఈ రంగం ద్వారా రూ.1,76,151 కోట్ల స్థూల విలువ వృద్ధి నమోదవడం పశుసంవర్ధక రంగ ప్రాధాన్యతను చూపిస్తోందన్నారు. అయితే సంప్రదాయ పద్ధతులు, కూలీల కొరత, పశుగ్రాసాల లోపం, పెరుగుతున్న దాణా ఖర్చులు వంటి సమస్యలు వృద్ధికి అడ్డంకులుగా మారుతున్నాయని చెప్పారు.

ప్రస్తుతం యువత సాంకేతిక రంగాల వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ, పశుసంవర్ధక రంగంలో వాణిజ్య అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని మంత్రి సూచించారు. పాడి పశువులు, నాటు కోళ్లు, పందుల పెంపకం వంటి రంగాల్లో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

విశాఖపట్నంలోని రాష్ట్ర పశుగణ యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజుల వ్యవస్థాపక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 1500 మంది శిక్షణ పొందగా, అందులో 200 మంది రైతులు వాణిజ్యపరంగా విజయవంతంగా తమ వ్యాపారాలను ప్రారంభించారని వెల్లడించారు.

రైతులకు శాస్త్రీయ అవగాహన కల్పించేందుకు రూపొందించిన ఈ-మేగజైన్‌ను ఏప్రిల్ నెల నుంచి “స్మైల్” వెబ్‌సైట్ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వాట్సాప్ గ్రూపుల ద్వారా అందుబాటులో ఉంచారు. ఇందులో పశు ఆరోగ్యం, పోషణ, పునరుత్పత్తి, యాజమాన్యం, మార్కెటింగ్, ప్రభుత్వ పథకాలు వంటి అంశాలపై సమగ్ర సమాచారం, నిపుణుల సూచనలు, విజయగాథలు అందిస్తారు. గ్రామీణ స్థాయిలో పనిచేసే పశుసంవర్ధక సహాయకులు, గోపాల మిత్రులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చేరవేయడంలో ఈ మేగజైన్ ఉపయోగపడుతుందని మంత్రి చెప్పారు.

పశుసంవర్ధక రంగాన్ని సేంద్రియ, వాణిజ్య పద్ధతుల్లో అభివృద్ధి చేస్తే ఒక్క ఎకరం నుంచి సంవత్సరానికి రూ.5 నుంచి 6 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశముందని మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించినట్లుగా ప్రతి ఇంట్లో ఒక ఎంట్రప్రెన్యూర్ ఏర్పడి, రైతుల ఆదాయం పెరగడమే కాకుండా రాష్ట్రాభివృద్ధికి కూడా తోడ్పడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అదనపు డైరెక్టర్ డా. వై. సింహాచలం, జాయింట్ డైరెక్టర్ డా. బైరాగి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Spotlight

Read More →