ఏపీ స్థానిక ఎన్నికల ఫిర్యాదులకు ఎస్‌ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు..

AP Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో రెండో సాధారణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల ఫిర్యాదుల స్వీకరణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఎన్నికల ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలు, ఫిర్యాదులను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు విజయవాడలోని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

Ap Local Body Elections Control room for Complaints
Ap Local Body Elections Control room for Complaints
  • ఓటర్లకు, అభ్యర్థులకు అందుబాటులో ఫోన్ నంబర్లు.. ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ
  • విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుంది.

AP Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో రెండో సాధారణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల ఫిర్యాదుల స్వీకరణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఎన్నికల ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలు, ఫిర్యాదులను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు విజయవాడలోని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు, సమస్యలపై ప్రజలు, అభ్యర్థులు కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇందుకోసం నాలుగు ఫోన్ నంబర్లను కేటాయించింది.

కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు:

0866-2490023
0866-2490024
0866-2490025
0866-2490026

ఫోన్ ద్వారా మాత్రమే కాకుండా, ఈ-మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదులు పంపే అవకాశం కల్పించారు. ఇందుకోసం [email protected], [email protected] ఈ-మెయిల్ చిరునామాలను వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించిన అదనపు సమాచారం కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ sec.ap.gov.in ను సందర్శించవచ్చు.

విడతలవారీగా స్థానిక ఎన్నికలు

రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను వేర్వేరు దశల్లో నిర్వహించేందుకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. అందులో భాగంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు అక్టోబర్ 28న పోలింగ్ నిర్వహించనుండగా, అక్టోబర్ 30న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నవంబర్ 3న ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 5న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నారు. తొలి దశ నవంబర్ 26న, రెండో దశ నవంబర్ 29న, మూడో దశ డిసెంబర్ 2న జరగనున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ జరిగిన రోజే ఫలితాలను వెల్లడించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి తలెత్తే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కంట్రోల్ రూమ్ ఉపయోగపడనుంది. ఎన్నికల ప్రక్రియలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే కేటాయించిన ఫోన్ నంబర్లు లేదా ఈ-మెయిల్ చిరునామాల ద్వారా ఎన్నికల సంఘాన్ని సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.

Tags

Be the first to react

Latest