ఏపీలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ భారీగా టికెట్ ఛార్జీలు (Private Bus Charges) పెంచేశాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సుల్లో విమాన టికెట్లకు సమానంగా ధరలు వసూలు చేస్తున్నారు. దీంతో సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అధిక ఛార్జీలపై రవాణాశాఖ పట్టించుకోవడం లేదన్న విమర్శలు రావడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది.
ప్రైవేట్ బస్సుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ఏపీ రవాణాశాఖ కఠిన చర్యలు ప్రారంభించింది. సంక్రాంతి సందర్భంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ట్రావెల్స్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్స్‌పై కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
అలాగే ప్రయాణికులు నేరుగా ఫిర్యాదు చేయేందుకు రవాణాశాఖ టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించింది. అధిక ఛార్జీల వసూళ్లపై 9281607001 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని సూచించింది. ఫిర్యాదులు అందితే సంబంధిత ట్రావెల్స్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మోటారు వాహన చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యంగా నడుస్తున్న ప్రైవేట్ బస్సులపై ఇకపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని రవాణాశాఖ తెలిపింది.
ప్రైవేట్ ట్రావెల్స్‌పై ఏపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంది?
సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల నుంచి అధిక టికెట్ ఛార్జీలు వసూలు చేస్తున్నందుకు చర్యలు తీసుకుంది.
ప్రయాణికులు అధిక ఛార్జీలపై ఎలా ఫిర్యాదు చేయాలి?
రవాణాశాఖ ప్రారంభించిన టోల్ ఫ్రీ నంబర్ 9281607001 కు ఫిర్యాదు చేయవచ్చు.
నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్స్‌పై ఏమి చర్యలు ఉంటాయి?
ప్రత్యేక తనిఖీల ద్వారా గుర్తించిన ట్రావెల్స్‌పై జరిమానాలు, చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.