అరెస్టు నుంచి రక్షణ కల్పీస్తూ బెయిల్ మంజూరు..
పవన్ ఖేడా చేసిన ఆరోపణలే ఈ కేసుకు కారణం..
కాంగ్రెస్ నేత పవన్ ఖేడాకు తెలంగాణ హైకోర్టు లో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసులో కోర్టు వారం రోజులపాటు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఈ వ్యవధిలో సంబంధిత కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అప్పటివరకు ఆయనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించింది.
అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వా శర్మ భార్యపై పవన్ ఖేడా చేసిన ఆరోపణలే ఈ కేసుకు కారణమయ్యాయి. ఆమెకు మూడు పాస్‌పోర్టులు ఉన్నాయని ఖేడా ఆరోపించారు.
ఈ ఆరోపణలపై అస్సాం సీఎం భార్య ఫిర్యాదు చేయడంతో గువాహటిలో పవన్ ఖేడాపై కేసు నమోదు అయ్యింది. అనంతరం ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన కోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు ఇచ్చిన ఈ తాత్కాలిక ఉపశమనంతో పవన్ ఖేడాకు కొంత ఊరట లభించినట్టైంది. అయితే పూర్తి స్థాయి బెయిల్ కోసం ఆయన సంబంధిత కోర్టులో పిటిషన్ వేయాల్సి ఉంది.
ఈ కేసు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోవడంతో పాటు, భవిష్యత్తులో కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది.