AP Political News: పనితీరు మార్చుకోకుంటే కష్టమే..ఆ ఎమ్మెల్యేలకు సీఎం సీరియస్ హెచ్చరిక.!! Elections 2026: ఈ మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం... ఓటు హక్కు వినియోగించుకోండి- ప్రధాని మోదీ! Pattadaru Passbooks: బాపట్ల జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులకు పట్టాదారు పాస్‌బుక్ల పంపిణీ! Minister Ramprasad Reddy: కాజా టోల్ గేట్ వద్ద మంత్రి రాంప్రసాద్ రెడ్డి తనిఖీలు- వారికి సీరియస్ వార్నింగ్! Praja Vedika: నేడు (09/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం! 2016 కి ముందే ఇంటి పట్టా ఉందా... దర్జాగా అమ్ముకోవచ్చు! Nara Lokesh: పార్టీ సిద్ధాంతం అంటేనే కార్యకర్తల గుర్తింపు.. టాప్ పెర్ఫార్మర్స్ భేటీలో లోకేశ్ కీలక వ్యాఖ్యలు.. AP Govt: దేవుడి పేరుతో దగా.. కులం పేరుతో దూషణలు! వైసీపీ నేతల కనుసన్నల్లోనే భూమి అక్రమ రిజిస్ట్రేషన్ Central Secretariat: అమరావతికి కేంద్రం భారీ కానుక.. రూ. 2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! Chandrababu Master Plan: పోర్టులే ఆర్థిక ఇంజిన్లు... ఏపీ తీరప్రాంతం వెంబడి భారీ హైవేల నెట్‌వర్క్ - సీఎం చంద్రబాబు! AP Political News: పనితీరు మార్చుకోకుంటే కష్టమే..ఆ ఎమ్మెల్యేలకు సీఎం సీరియస్ హెచ్చరిక.!! Elections 2026: ఈ మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం... ఓటు హక్కు వినియోగించుకోండి- ప్రధాని మోదీ! Pattadaru Passbooks: బాపట్ల జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులకు పట్టాదారు పాస్‌బుక్ల పంపిణీ! Minister Ramprasad Reddy: కాజా టోల్ గేట్ వద్ద మంత్రి రాంప్రసాద్ రెడ్డి తనిఖీలు- వారికి సీరియస్ వార్నింగ్! Praja Vedika: నేడు (09/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం! 2016 కి ముందే ఇంటి పట్టా ఉందా... దర్జాగా అమ్ముకోవచ్చు! Nara Lokesh: పార్టీ సిద్ధాంతం అంటేనే కార్యకర్తల గుర్తింపు.. టాప్ పెర్ఫార్మర్స్ భేటీలో లోకేశ్ కీలక వ్యాఖ్యలు.. AP Govt: దేవుడి పేరుతో దగా.. కులం పేరుతో దూషణలు! వైసీపీ నేతల కనుసన్నల్లోనే భూమి అక్రమ రిజిస్ట్రేషన్ Central Secretariat: అమరావతికి కేంద్రం భారీ కానుక.. రూ. 2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! Chandrababu Master Plan: పోర్టులే ఆర్థిక ఇంజిన్లు... ఏపీ తీరప్రాంతం వెంబడి భారీ హైవేల నెట్‌వర్క్ - సీఎం చంద్రబాబు!

Minister Ramprasad Reddy: కాజా టోల్ గేట్ వద్ద మంత్రి రాంప్రసాద్ రెడ్డి తనిఖీలు- వారికి సీరియస్ వార్నింగ్!

Minister Ramprasad Reddy: రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలకు అడ్డుకట్ట వేసేలా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు నేరుగా రోడ్డుపైకి వచ్చి తనిఖీలు చేపట్టడం హర్షణీయం. కేవలం లాభాలే ధ్యేయంగా సరుకు రవాణా చేస్తూ, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడే సంస్థల పట్ల ఆయన కఠినంగా వ్యవహరించారు.

Published : 2026-04-09 08:24:00

బస్సుల భద్రతపై మంత్రి ఆరా.. పెండింగ్ చలానాలపై సీరియస్…

ప్రయాణికుల భద్రతే మా ప్రాధాన్యం: రవాణా శాఖ మంత్రి మండిపల్లి…

రూల్స్ అతిక్రమిస్తే పర్మిట్లు రద్దు - ప్రైవేట్ ఆపరేటర్లకు మంత్రి హెచ్చరిక…

Minister Ramprasad Reddy: మంగళగిరి సమీపంలోని కాజా టోల్ గేట్ వద్ద రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గురువారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆపి, వాటికి సంబంధించిన అనుమతి పత్రాలు (పర్మిట్లు), ఫిట్‌నెస్ సర్టిఫికెట్లను స్వయంగా పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బస్సుల పట్ల ఆయన కఠినంగా వ్యవహరించారు. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు లాభాల కంటే ప్రయాణికుల భద్రతకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి హెచ్చరించారు. బస్సుల్లో అగ్నిమాపక పరికరాలు, అత్యవసర ద్వారాలు వంటి ప్రమాద నివారణ చర్యలు ఉన్నాయా లేదా అని ఆయన ఆరా తీశారు. పెండింగ్‌లో ఉన్న చలానాలను వెంటనే చెల్లించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా బస్సుల్లో ప్రయాణికులతో పాటు అనధికారికంగా సరుకు రవాణా చేయడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. "బస్సుల్లో సరుకు రవాణా చేస్తే.. అదే ఆ బస్సుకు ఆఖరి ట్రిప్పు అవుతుంది" అని హెచ్చరిస్తూ, నిబంధనలు అతిక్రమిస్తే పర్మిట్లు రద్దు చేస్తామని తేల్చి చెప్పారు.

ప్రజా భద్రతకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, నిరంతరం ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రయాణికులు క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆర్టీఓ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో రవాణా శాఖ ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Spotlight

Read More →