Chandrababu Master Plan: పోర్టులే ఆర్థిక ఇంజిన్లు... ఏపీ తీరప్రాంతం వెంబడి భారీ హైవేల నెట్‌వర్క్ - సీఎం చంద్రబాబు! AP Govt: అన్నవరం, ద్వారకా తిరుమలకు కొత్త వెలుగులు.. నూతన పాలక మండలి సభ్యుల నియామకం! 34 మందితో కొత్త బోర్డు.. Chandrababu: రహదారుల రూపురేఖలు మార్చాలని నిర్ణయం.. ఏపీలో ఈ-బస్సులు.. చంద్రబాబు కీలక ఆదేశాలు! Ap Cabinet meeting: రెండు కీలక బిల్లులకు ఆమోదముద్ర.. కాసేపట్లో ప్రారంభం కానున్న కేంద్ర క్యాబినెట్ భేటీ! మహిళా రిజర్వేషన్లపై.. Pawan Kalyan: దాడులు కాదు.. న్యాయస్థానాల్లో పోరాడదాం.. రాజకీయ విమర్శలపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు.! New Airport: ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్ట్... డీపీఆర్ కోసం మళ్లీ సర్వేకు ప్రభుత్వం ఆదేశం! Prajadarbar: ప్రజాదర్బార్‌లో వినతుల వెల్లువ... బాధితులకు అండగా ఉంటానన్న మంత్రి నారా లోకేష్! APCPDCL: గుణదలలో విద్యుత్ సౌరభం: ఏపీసీపీడీసీఎల్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి! Top 5 AP HighWays: లాజిస్టిక్స్ హబ్‌గా.. ఆంధ్రప్రదేశ్‌లోని టాప్ 5 హైవేలు మెగా రోడ్ ప్రాజెక్టులు! గంటల దూరం ఇక నిమిషాల్లోనే.! Fishing Ban: మత్స్యకారులకు అలర్ట్... ఏప్రిల్ 15 నుండి ఏపీ తీరంలో చేపల వేట నిషేధం! Chandrababu Master Plan: పోర్టులే ఆర్థిక ఇంజిన్లు... ఏపీ తీరప్రాంతం వెంబడి భారీ హైవేల నెట్‌వర్క్ - సీఎం చంద్రబాబు! AP Govt: అన్నవరం, ద్వారకా తిరుమలకు కొత్త వెలుగులు.. నూతన పాలక మండలి సభ్యుల నియామకం! 34 మందితో కొత్త బోర్డు.. Chandrababu: రహదారుల రూపురేఖలు మార్చాలని నిర్ణయం.. ఏపీలో ఈ-బస్సులు.. చంద్రబాబు కీలక ఆదేశాలు! Ap Cabinet meeting: రెండు కీలక బిల్లులకు ఆమోదముద్ర.. కాసేపట్లో ప్రారంభం కానున్న కేంద్ర క్యాబినెట్ భేటీ! మహిళా రిజర్వేషన్లపై.. Pawan Kalyan: దాడులు కాదు.. న్యాయస్థానాల్లో పోరాడదాం.. రాజకీయ విమర్శలపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు.! New Airport: ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్ట్... డీపీఆర్ కోసం మళ్లీ సర్వేకు ప్రభుత్వం ఆదేశం! Prajadarbar: ప్రజాదర్బార్‌లో వినతుల వెల్లువ... బాధితులకు అండగా ఉంటానన్న మంత్రి నారా లోకేష్! APCPDCL: గుణదలలో విద్యుత్ సౌరభం: ఏపీసీపీడీసీఎల్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి! Top 5 AP HighWays: లాజిస్టిక్స్ హబ్‌గా.. ఆంధ్రప్రదేశ్‌లోని టాప్ 5 హైవేలు మెగా రోడ్ ప్రాజెక్టులు! గంటల దూరం ఇక నిమిషాల్లోనే.! Fishing Ban: మత్స్యకారులకు అలర్ట్... ఏప్రిల్ 15 నుండి ఏపీ తీరంలో చేపల వేట నిషేధం!

Prajadarbar: ప్రజాదర్బార్‌లో వినతుల వెల్లువ... బాధితులకు అండగా ఉంటానన్న మంత్రి నారా లోకేష్!

Prajadarbar: మంత్రి నారా లోకేష్ 87వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించి సామాన్యుల నుండి వినతులను స్వీకరించారు. రైల్వే డిపో తరలింపు, భూ ఆక్రమణలు మరియు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కారానికి హామీ ఇచ్చారు.

Published : 2026-04-08 13:34:00

87వ రోజు ప్రజాదర్బార్: కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ లోకేష్ భరోసా!

మంగళగిరిలో వినతుల వెల్లువ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి లోకేష్…

రైల్వే డిపో తరలింపు వద్దు.. మంత్రి లోకేష్‌ను కలిసిన లోకో పైలట్ల సిబ్బంది…

Prajadarbar: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న 'ప్రజాదర్బార్' దిగ్విజయంగా 87వ రోజుకు చేరుకుంది. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుండి తరలివచ్చిన సామాన్య ప్రజలు, పార్టీ కార్యకర్తలు తమ సమస్యలను మంత్రికి నేరుగా వివరించారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన లోకేష్, వారి వినతులను స్వయంగా స్వీకరించి పరిష్కారానికి హామీ ఇచ్చారు. కష్టాల్లో ఉన్న వారికి "నేనున్నాను" అనే భరోసా కల్పించడమే ఈ ప్రజాదర్బార్ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

దర్బార్‌లో రైల్వే ఉద్యోగుల సమస్యలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. విజయవాడలోని లోకో పైలట్ల 'గాలా' (సికింద్రాబాద్) డిపోను ఇతర ప్రాంతాలకు తరలించవద్దని సిబ్బంది మంత్రిని వేడుకున్నారు. సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పాటు నేపథ్యంలో ఈ డిపోను మోటమర్రి లేదా డోర్నకల్‌కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న దినసరి వేతన ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని యూనియన్ ప్రతినిధులు కోరగా, కోవిడ్ వల్ల నష్టపోయిన హైర్ బస్ యజమానులు తమను ఆదుకోవాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

భూ ఆక్రమణలు, వ్యక్తిగత సమస్యలపై కూడా లోకేష్ సానుకూలంగా స్పందించారు. నంద్యాల జిల్లాకు చెందిన ఒక వృద్ధురాలు తన వంశపారంపర్య భూమి ఆక్రమణకు గురైందని వాపోగా, విచారణ జరిపి తగిన న్యాయం చేస్తానని ఆమెకు ధైర్యం చెప్పారు. అందిన ప్రతి వినతిని సంబంధిత శాఖాధికారులకు పంపి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా పర్యవేక్షిస్తానని లోకేష్ స్పష్టం చేశారు. నాయకుడు ప్రజల చెంతకు వచ్చి సమస్యలు వినడం పట్ల బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Spotlight

Read More →