Nara Lokesh: పార్టీ సిద్ధాంతం అంటేనే కార్యకర్తల గుర్తింపు.. టాప్ పెర్ఫార్మర్స్ భేటీలో లోకేశ్ కీలక వ్యాఖ్యలు.. AP Govt: దేవుడి పేరుతో దగా.. కులం పేరుతో దూషణలు! వైసీపీ నేతల కనుసన్నల్లోనే భూమి అక్రమ రిజిస్ట్రేషన్ Central Secretariat: అమరావతికి కేంద్రం భారీ కానుక.. రూ. 2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! Chandrababu Master Plan: పోర్టులే ఆర్థిక ఇంజిన్లు... ఏపీ తీరప్రాంతం వెంబడి భారీ హైవేల నెట్‌వర్క్ - సీఎం చంద్రబాబు! AP Govt: అన్నవరం, ద్వారకా తిరుమలకు కొత్త వెలుగులు.. నూతన పాలక మండలి సభ్యుల నియామకం! 34 మందితో కొత్త బోర్డు.. Chandrababu: రహదారుల రూపురేఖలు మార్చాలని నిర్ణయం.. ఏపీలో ఈ-బస్సులు.. చంద్రబాబు కీలక ఆదేశాలు! Ap Cabinet meeting: రెండు కీలక బిల్లులకు ఆమోదముద్ర.. కాసేపట్లో ప్రారంభం కానున్న కేంద్ర క్యాబినెట్ భేటీ! మహిళా రిజర్వేషన్లపై.. Pawan Kalyan: దాడులు కాదు.. న్యాయస్థానాల్లో పోరాడదాం.. రాజకీయ విమర్శలపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు.! New Airport: ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్ట్... డీపీఆర్ కోసం మళ్లీ సర్వేకు ప్రభుత్వం ఆదేశం! Prajadarbar: ప్రజాదర్బార్‌లో వినతుల వెల్లువ... బాధితులకు అండగా ఉంటానన్న మంత్రి నారా లోకేష్! Nara Lokesh: పార్టీ సిద్ధాంతం అంటేనే కార్యకర్తల గుర్తింపు.. టాప్ పెర్ఫార్మర్స్ భేటీలో లోకేశ్ కీలక వ్యాఖ్యలు.. AP Govt: దేవుడి పేరుతో దగా.. కులం పేరుతో దూషణలు! వైసీపీ నేతల కనుసన్నల్లోనే భూమి అక్రమ రిజిస్ట్రేషన్ Central Secretariat: అమరావతికి కేంద్రం భారీ కానుక.. రూ. 2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! Chandrababu Master Plan: పోర్టులే ఆర్థిక ఇంజిన్లు... ఏపీ తీరప్రాంతం వెంబడి భారీ హైవేల నెట్‌వర్క్ - సీఎం చంద్రబాబు! AP Govt: అన్నవరం, ద్వారకా తిరుమలకు కొత్త వెలుగులు.. నూతన పాలక మండలి సభ్యుల నియామకం! 34 మందితో కొత్త బోర్డు.. Chandrababu: రహదారుల రూపురేఖలు మార్చాలని నిర్ణయం.. ఏపీలో ఈ-బస్సులు.. చంద్రబాబు కీలక ఆదేశాలు! Ap Cabinet meeting: రెండు కీలక బిల్లులకు ఆమోదముద్ర.. కాసేపట్లో ప్రారంభం కానున్న కేంద్ర క్యాబినెట్ భేటీ! మహిళా రిజర్వేషన్లపై.. Pawan Kalyan: దాడులు కాదు.. న్యాయస్థానాల్లో పోరాడదాం.. రాజకీయ విమర్శలపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు.! New Airport: ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్ట్... డీపీఆర్ కోసం మళ్లీ సర్వేకు ప్రభుత్వం ఆదేశం! Prajadarbar: ప్రజాదర్బార్‌లో వినతుల వెల్లువ... బాధితులకు అండగా ఉంటానన్న మంత్రి నారా లోకేష్!

AP Govt: దేవుడి పేరుతో దగా.. కులం పేరుతో దూషణలు! వైసీపీ నేతల కనుసన్నల్లోనే భూమి అక్రమ రిజిస్ట్రేషన్

AP Government: కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం పెదతుమ్మిడి గ్రామానికి చెందిన మహంకాళమ్మ నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ..తమ గ్రామంలో తన భర్తకు తన తల్లి నుండి గిఫ్ట్ సెటిల్మెంట్ ద్వారా వచ్చిన 4 సెంట్ల ఇంటి స్థలం ఉంది.

Published : 2026-04-08 21:40:00
  • Politics: వైసీపీ అండతో డబుల్ రిజిస్ట్రేషన్ల దందాకు పాల్పడిన వీఆర్వోపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు..
     
  • వారసత్వ భూమిపై కబ్జాదారుల కన్ను.. న్యాయం చేయాలంటూ వినతి..
     
  • హోంమంత్రి వంగలపూడి అనిత, ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ యాదవ్..

Mangalagiri AP Government: కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం పెదతుమ్మిడి గ్రామానికి చెందిన మహంకాళమ్మ నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. తమ గ్రామంలో తన భర్తకు తన తల్లి నుండి గిఫ్ట్ సెటిల్మెంట్ ద్వారా వచ్చిన 4 సెంట్ల ఇంటి స్థలం ఉంది. (డాక్యుమెంట్ నంబర్ 1382/2023). దీనికి సంబంధించి అన్ని సరిహద్దులు స్పష్టంగా ఉన్నాయి. ఈ స్థలాన్ని చర్చి నిర్మాణానికి తమకు అమ్మాలని బంధువులైన ఏకుల పద్మావతి, ఆమె కుమారులు అడగగా.. ఇది అమ్మేది కాదని తన భర్త నిరాకరించారు. అప్పటి నుండి ఆయన వికలాంగుడనే విషయాన్ని ఎత్తి చూపుతూ దారుణంగా దూషించడం మొదలుపెట్టారు. 2024 ఏప్రిల్ 5న సదరు స్థలంలో అక్రమంగా రాళ్లు పాతడాన్ని అడ్డుకున్నందుకు.. మచిలీపట్నం వీఆర్వోగా పనిచేస్తున్న సతీష్, అతని సోదరులు శ్రీకాంత్, శ్యామ్ కలిసి తన భర్తను ఈడ్చి కొట్టారు. అడ్డువచ్చిన తనని కూడా జుట్టు పట్టుకుని, అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారు. రెవెన్యూ విభాగంలో తనకున్న పట్టుతో వీఆర్వో సతీష్ మోసపూరిత మార్గంలో భీమవరంలో అదే స్థలానికి డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఈసీ ద్వారా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వంలో రాజకీయ ఒత్తిళ్లతో తమపై కేసు నమోదు కాకుండా అడ్డుకున్నారని, "నేను వీఆర్వోని.. నాకు అందరూ తెలుసు, మీ భూమిని ఎలా కాజేయాలో నాకు తెలుసు" అంటూ సతీష్ బహిరంగంగా బెదిరిస్తున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని నేతలు హోంమంత్రి వంగలపూడి అనిత,  ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ యాదవ్ లకు అర్జీ ఇచ్చి అభ్యర్ధించారు.

వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన లక్షుమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తన భర్త ద్వారా సంక్రమించిన 0.95 సెంట్ల భూమి సర్వే నెం. 34 ఉంది. కాశినాయన దేవుని గర్భగుడి కట్టిస్తామని, బ్యాంకు లోన్ ఇప్పిస్తామని నమ్మబలికి వేములపాడుకు చెందిన కర్నాటి బలరామిరెడ్డి, కర్నాటి రంగమ్మలు తనతో అగ్రిమెంట్ చేయించుకున్నారు. తనకు తెలియకుండానే దొంగ పత్రాలు సృష్టించి భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ భూమిని కలసపాడుకు చెందిన ఒక వ్యక్తికి అమ్మకానికి పెట్టి రూ. 24 లక్షలు అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. ఈ మోసం బయటపడినప్పుడు అడగగా.. వైసీపీ నాయకులు విశ్వనాథరెడ్డి, మాజీ సలహాదారు నాగార్జునరెడ్డిలు వచ్చి తామే డబ్బులు ఇస్తామని నమ్మబలికారు. కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా, దేవాలయం కట్టకుండా మోసం చేశారు. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి న్యాయం జరగలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు గ్రీవెన్స్ లో అర్జీ విజ్ఞప్తి చేస్తూ..సర్వే నంబర్ 328/6 లో ఉన్న 0.49 సెంట్ల భూమి తనకు వారసత్వంగా వచ్చింది. అయితే అదే గ్రామానికి చెందిన దాసరి వెంకయ్య, రఘురామయ్యలు ఈ భూమిని అక్రమంగా వారి పేరు మీద ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అక్రమంగా పత్రాలు సృష్టించడమే కాకుండా, కోర్టు నుండి ఇంజక్షన్ ఆర్డరు తెచ్చుకుని తనకు చెందిన కోళ్ల ఫారాన్ని డోజర్‌తో ధ్వంసం చేయించారు. సాక్ష్యాధారాలు లేకుండా చేయాలనే కుట్రతోనే ఈ పనికి పాల్పడ్డారు. వారు సమర్పించిన నకిలీ పత్రాలను పరిశీలించిన గౌరవ న్యాయస్థానం, ఆ కేసును డిస్మిస్ చేసింది. అయినప్పటికీ, నిందితులు వెనుకుండి మరికొందరి ద్వారా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్ళ గ్రామానికి చెందిన కత్తి శంకరరావు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. అన్నవరపు శ్రీనివాసరావు వద్ద మోడల్ స్కూల్ పక్కన ఒక స్థలాన్ని కొనుగోలు చేసి హద్దు రాళ్లు వేయించాను. మార్చి 2, 2026న తొగటి నరసింహారావు అనే వ్యక్తి ఆ హద్దు రాళ్లను పీకి వేయడంతో వివాదం మొదలైంది. స్థలం కొన్నందుకు తనను బూతులు తిడుతూ.. ఊరిలోకి వచ్చి కొనడం ఏంటి?" అంటూ కులం పేరుతో అసభ్యకరంగా దూషించారు. నరసింహారావు తనతో పాటు రౌడీ షీటర్ సింగారెడ్డి కోటిరెడ్డి, దంతం నాగేశ్వరరావులను మారణాయుధాలతో రప్పించి తనపై దాడికి ప్రయత్నించారు. నీవు ఊరిలో బ్రతకకూడదు, మరో కారంచేడును చూపిస్తాము అంటూ ప్రాణాలు తీస్తామని తనను వెంబడించారు. ఎస్సీ, ఎస్టీ కేసు పెడితే చంపేస్తామని హెచ్చరించారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

డా.బీఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పాలగుమ్మి గ్రామానికి  చెందిన తరంగిణి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తనను ప్రేమ పేరుతో వంచించి, గర్భవతిని చేసి, అబార్షన్ చేయించిన కట్టా ధన మహేష్‌పై ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఘటనపై ఫిబ్రవరి 8, 2026న రాజోలు పోలీస్ స్టేషన్‌లో కేసు (Crime No: 39/2026) నమోదైనప్పటికీ 60 రోజులు గడిచినా నిందితుడిని అరెస్ట్ చేయలేదు. పోలీస్ శాఖలో ఉన్న నిందితుల బంధువుల అండతో ఎస్సై, సీఐలు దర్యాప్తును కాలయాపన చేస్తున్నారని, కేసు వెనక్కి తీసుకోవాలని తనపై ఒత్తిడి తెస్తున్నారు. కావున వారిపై  చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం వీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన వరప్రసాద్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో సర్వే నెం.400/3లో ఉన్న 1.50 సెంట్ల భూమికి పూర్వం నుంచి దారి ఉంది. అయితే పక్కనే భూమి కొన్న ఆరుమళ్ళ దుర్గారావు, ఆరుమళ్ళ మహేష్ అనే వ్యక్తులు రాజకీయ పలుకుబడితో ఆ దారిని మూసివేశారు. దారి గురించి ప్రశ్నించినందుకు తనపై తన భార్యపై నిందితులు దాడికి పాల్పడ్డారు. దీనిపై తడికలపూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, ఆర్డీవో, రెవెన్యూ అధికారులకు విన్నవించినా ఇప్పటివరకు ఎలాంటి ఫలితం లేదు. దారి లేకపోవడంతో పంటను బయటకు తెచ్చుకోవడానికి వీలు పడటం లేదని, వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్న తమ కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం మద్దూరుపాడు మజరా సిరిపురం గ్రామానికి చెందిన జక్కంపూడి మోహన్ రావు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. సర్వే నెం. 323-Aలో 1.12 ఎకరాలు, సర్వే నెం. 323-Cలో 0.12 ఎకరాలు మొత్తం 1.24 ఎకరాలు తన పేరున రెవెన్యూ రికార్డుల్లో స్పష్టంగా ఉన్నాయి. గత ఏడు సంవత్సరాలుగా తనకు అనారోగ్యం వల్ల, ఉపాధి నిమిత్తం దూర ప్రాంతంలో ఉండటాన్ని అదునుగా తీసుకుని అదే గ్రామానికి చెందిన జక్కంపూడి తిరుమలరావు అనే వ్యక్తి తనకు చెందిన 11 సెంట్ల భూమిని ఆక్రమించుకున్నారు. పొలానికి వెళ్లే పూర్వీకుల నాటి బండ్ల బాటలో జామాయిల్ చెట్లు వేసి, ట్రాక్టర్లు కూడా వెళ్లకుండా దారిని పూర్తిగా మూసివేశారు. తన భూమి గురించి నిలదీసినందుకు దుర్భాషలాడుతూ, శారీరక దాడులకు దిగుతామని బెదిరిస్తున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వహిద గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. మార్చి 24, 2026న ఎస్.కె. షబాన అనే స్నేహితురాలి ఫిర్యాదు విషయంలో తోడుగా వెళ్లిన తనను సి.ఐ. తన ఛాంబర్‌లోకి పిలిచి, "నువ్వు ఎందుకు వచ్చావు?" అంటూ అందరి ముందు అసభ్య పదజాలంతో దూషించారు. తన హక్కుల గురించి ప్రశ్నించగా తన భర్త అంధుడనే విషయాన్ని ప్రస్తావిస్తూ సి.ఐ. అత్యంత నీచంగా, అమానవీయంగా మాట్లాడారు. ఇది 'దివ్యాంగుల హక్కుల చట్టం 2016'కు పూర్తి విరుద్ధమని ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బందిని పిలిచి తనను వీడియోలు తీయమని, స్టేషన్ నుండి నెట్టివేయమని సి.ఐ. ఆదేశించారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం గండివారిపల్లి గ్రామానికి చెందిన ప్రభావతి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలోని సర్వే నెంబర్లు 598/2, 609, 602/4, 610/2, 629, 630/1, 631, 671/2, 695, 974లలో మొత్తం సుమారు 7 ఎకరాల భూమి తమ తండ్రి పేరు మీద ఉంది. తండ్రి చనిపోయిన తర్వాత ఆ ఆస్తి ముగ్గురు పిల్లలకు సమానంగా చెందాల్సి ఉండగా, సోదరుడు ఆస్తిని పంచకుండా ఇతరులకు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తన పేరు మీద పట్టా పుస్తకాలు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి న్యాయం జరగలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన లక్ష్మీ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. షేక్ జానపాటి మస్తాన్ బీ వద్ద నుండి 89 చదరపు గజాల ఇంటిని తన కుమారుడు ప్రశాంత్ 2015 జూలై 6న చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ సమయంలో ఇల్లు ఖాళీ చేయడానికి నాలుగు నెలల గడువు కోరగా, మానవత్వంతో అంగీకరించాం. గడువు ముగిసినా ఇల్లు ఖాళీ చేయకుండా, పైగా నెలకు రూ. 5000/- అద్దెను మస్తాన్బి వసూలు చేసుకుంటూ గడువు పొడిగిస్తూ వచ్చారు. ఇంటికి వెళ్లి అడిగితే "కిరోసిన్ పోసి తగలబెడతాం" అని బెదిరింపులకు పాల్పడుతున్నారు. పెద్ద మనుషుల సమక్షంలో రెండు సార్లు పంచాయితీ నిర్వహించినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ప్రక్కనే ఉన్న అమీరున్నీసా బేగం ద్వారా కుదిరిన రాజీ ప్రకారం.. ఆ ఇంటికి సంబంధించి రూ. 10 లక్షలు ముట్టినట్లు అగ్రిమెంట్ చేయించుకున్నారు. అందులో భాగంగా రూ. 4 లక్షలు అకౌంట్‌లో జమ అయ్యాయి, మిగతా మొత్తానికి చెక్కులు, ప్రామిసరీ నోట్లు కూడా ఇచ్చారు. అయితే డబ్బు తీసుకున్న అరగంటకే మస్తాన్బి మళ్ళీ మాట మారుస్తూ "ఇల్లు ఖాళీ చేయను, డాక్యుమెంట్లు నా దగ్గరే ఉన్నాయి" అని వాదనకు దిగారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం తెరువపల్లి గ్రామానికి చెందిన జయలక్ష్మీ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ అత్తమామలకు చెందిన సుమారు 4 ఎకరాల 50 సెంట్ల భూమి కలదు. వారు మరణించిన తర్వాత ఆ ఆస్తిపై నలుగురు కుమారులకు, ఇద్దరు కుమార్తెలకు హక్కు ఉంది. అయితే ప్రస్తుతం ఆ ఆస్తి ముగ్గురి ఆధీనంలో ఉంది. ఆస్తిని పంచమని అడిగినందుకు తనపై, తన భర్త, పిల్లలపై గతంలో చాలా సార్లు భౌతిక దాడులు చేయించి కొట్టించారు. ఈ విషయంలో పెద్దలు మందలించినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. భూమి కోసం కక్ష గట్టిన వారు తమ కుటుంబాన్ని అంతమొందించాలనే క్రూరమైన ఉద్దేశంతో తమకు ఆహారంలో విషం ఇచ్చి చంపడానికి కూడా ప్రయత్నించారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా.. మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్ లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్ధికతోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు అందించారు.

Spotlight

Read More →