Janardhan Reddy: అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు.. 20 నెలల్లో రూ. 1117 కోట్లతో 44 % పైగా పనులు పూర్తి! Chandrababu: ప్రపంచ స్థాయి పరికరాల ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. సచివాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం.. Minister Gottipati: గ్రామాల్లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుపై మంత్రి కీలక ఆదేశం.. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా.. Assam Elections 2026: అస్సాం బీజేపీ మేనిఫెస్టో విడుదల: మహిళలకు నెలకు రూ.3,000 సాయం! Minister Nimmala: కర్నూలు పశ్చిమ ప్రాంతానికి మాస్టర్ ప్లాన్.. చంద్రబాబు ప్రత్యేక దృష్టి.. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలోనే.! AP Development: అమరావతిపై జగన్ వైఖరి మార్చుకోవాలి.. డ్యామ్ సైట్ నుంచి సీఎంకు ఫోన్ చేసిన పయ్యావుల! Minister Narayana: 40 ఏళ్ల నాటి సమస్యకు నెల రోజుల్లోనే పరిష్కారం.. ఇంటింటికీ వెళ్లి.. పేద విద్యార్థులకు అంతర్జాతీయ విద్య! Chandrababu Tour: నెల్లూరు, కడప జిల్లాల్లో చంద్రబాబు పర్యటన! రేపు పింఛన్ల పంపిణీలో - రాత్రికి ఒంటిమిట్టలోనే.! Nara Lokesh: మునగాలపాడులో విషాదం.. నేనున్నాను.. అర్జున్ సోదరి కోమలి భవిష్యత్తుకు లోకేష్ హామీ.! Chandrababu: సంజీవని ప్రాజెక్టుపై సమీక్షలో అధికారులతో చంద్రబాబు.. 5 పిల్లర్లతో పటిష్టంగా - ఏడాదిలో 56.40 లక్షల మందికి.! Janardhan Reddy: అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు.. 20 నెలల్లో రూ. 1117 కోట్లతో 44 % పైగా పనులు పూర్తి! Chandrababu: ప్రపంచ స్థాయి పరికరాల ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. సచివాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం.. Minister Gottipati: గ్రామాల్లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుపై మంత్రి కీలక ఆదేశం.. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా.. Assam Elections 2026: అస్సాం బీజేపీ మేనిఫెస్టో విడుదల: మహిళలకు నెలకు రూ.3,000 సాయం! Minister Nimmala: కర్నూలు పశ్చిమ ప్రాంతానికి మాస్టర్ ప్లాన్.. చంద్రబాబు ప్రత్యేక దృష్టి.. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలోనే.! AP Development: అమరావతిపై జగన్ వైఖరి మార్చుకోవాలి.. డ్యామ్ సైట్ నుంచి సీఎంకు ఫోన్ చేసిన పయ్యావుల! Minister Narayana: 40 ఏళ్ల నాటి సమస్యకు నెల రోజుల్లోనే పరిష్కారం.. ఇంటింటికీ వెళ్లి.. పేద విద్యార్థులకు అంతర్జాతీయ విద్య! Chandrababu Tour: నెల్లూరు, కడప జిల్లాల్లో చంద్రబాబు పర్యటన! రేపు పింఛన్ల పంపిణీలో - రాత్రికి ఒంటిమిట్టలోనే.! Nara Lokesh: మునగాలపాడులో విషాదం.. నేనున్నాను.. అర్జున్ సోదరి కోమలి భవిష్యత్తుకు లోకేష్ హామీ.! Chandrababu: సంజీవని ప్రాజెక్టుపై సమీక్షలో అధికారులతో చంద్రబాబు.. 5 పిల్లర్లతో పటిష్టంగా - ఏడాదిలో 56.40 లక్షల మందికి.!

Chandrababu Tour: నెల్లూరు, కడప జిల్లాల్లో చంద్రబాబు పర్యటన! రేపు పింఛన్ల పంపిణీలో - రాత్రికి ఒంటిమిట్టలోనే.!

Chandrababu Tour: నెల్లూరు, కడప జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం పర్యటించనున్నారు. ఓవైపు పేదల సేవలో, మరోవైపు భగవంతుని సేవలో అన్నట్టుగా ఒకే రోజు రెండు కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు.

Published : 2026-03-31 15:39:00
  • ఒంటిమిట్టలో సీతారాములవారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్న సీఎం దంపతులు..
     
  • Politics: వింజమూరులో రేపు పింఛన్ల పంపిణీలో పాల్గొననున్న ముఖ్యమంత్రి..

Chandrababu Tour: నెల్లూరు, కడప జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం పర్యటించనున్నారు. ఓవైపు పేదల సేవలో, మరోవైపు భగవంతుని సేవలో అన్నట్టుగా ఒకే రోజు రెండు కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. మొదట నెల్లూరు జిల్లా, వింజమూరులో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు పింఛన్లు అందించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు నేరుగా ఒంటిమిట్టకు వెళ్లి సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం సంధర్భంగా సీతారాముల వారికి సతీసమేతంగా పట్టువస్త్రాలు, తలంబ్రాలను సమర్పిస్తారు.

22 నెలల్లో రూ.60,437 కోట్లు పంపిణీ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు నేరుగా అతిపెద్ద నగదు బదిలీ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం ద్వారా జరుగుతోంది. 22 నెలల్లోనే రూ.60,437 కోట్లను ప్రభుత్వం పింఛన్ల రూపంలో పేదలకు అందించింది. ఈ ఏప్రిల్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 62.60 లక్షల మందికి పింఛనుదారులకు రూ.2,724 కోట్లను విడుదల చేసింది. ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొనే నెల్లూరు జిల్లాలో 2.91 లక్షల మందికి రూ.128 కోట్లు, ఉదయగిరి నియోజకవర్గంలో 39,330 మందికి రూ.17.81 కోట్లు, వింజమూరు మండలంలో 5,484 మందికి రూ.2.47 కోట్లను ప్రభుత్వం పింఛన్లు ఇవ్వనుంది. నెల్లూరు జిల్లా వింజమూరు పర్యటన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా కడప జిల్లా, ఒంటిమిట్ట చేరుకుంటారు. ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణ మహోవ్సతం సందర్భంగా పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారు.

సీఎం పర్యటన జరిగేదిలా…
బుధవారం ఉదయం 10 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 11 గంటలకు సీఎం చంద్రబాబు వింజమూరు చేరుకుంటారు. వింజమూరులోని ఉత్తర ఎస్సీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీని చేపడతారు... లబ్ధిదారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పాతూరు ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొంటారు. 02.15 గంటలకు ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. ఈ కార్యక్రమాన్ని ముగించుకుని సాయంత్రం 04.25 గంటలకు ఒంటిమిట్టకు సీఎం చేరుకుంటారు. 06.15 గంటలకు కోదండ రామస్వామికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 06.45 గంటలకు కళ్యాణవేదికలో నిర్వహించే సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామి వార్లకు పట్టువస్త్రాలు, తలంబ్రాలను అందజేస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం సతీమణి భువనేశ్వరి పాల్గొంటారు. బుధవారం రాత్రికి ఒంటిమిట్టలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు బస చేయనున్నారు. 

Spotlight

Read More →