Pooja Hegde: పూజా హెగ్డేకు అంత పొగరా అన్న నెటిజన్లు.. సెల్ఫీ ఘటనపై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్! Minister Savitha: 104 మంది ప్రతిభావంతుల విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలు! Gummadi Sandhya Rani: స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగంగా వీధులు శుభ్రం చేసిన మంత్రి సంధ్యారాణి! TDP: మహిళా సాధికారతలో టీడీపీ చారిత్రాత్మక అడుగు.. 33 శాతం మహిళా రిజర్వేషన్‌తో కొత్త దిశ! Operation Sindoor: అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్ధం.. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది! Goa: ఘనంగా గోవా 40వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు! Noro Virus: అమెరికాను వణికిస్తున్న సరికొత్త మహమ్మారి..వేగంగా విస్తరిస్తున్న 'నోరోవైరస్'! New Pensions: ఏపీ పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్... కొత్తగా 5,606 మందికి పెన్షన్లు!! Palla Srinivasa Rao: గాజువాక సమస్యలపై దిశా సమావేశంలో పల్లా! Healthy Food: ఈ 10 రకాల స్నాక్స్ మీరు ఎంత తిన్నా అస్సలు బరువు పెరగరట... Pooja Hegde: పూజా హెగ్డేకు అంత పొగరా అన్న నెటిజన్లు.. సెల్ఫీ ఘటనపై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్! Minister Savitha: 104 మంది ప్రతిభావంతుల విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలు! Gummadi Sandhya Rani: స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగంగా వీధులు శుభ్రం చేసిన మంత్రి సంధ్యారాణి! TDP: మహిళా సాధికారతలో టీడీపీ చారిత్రాత్మక అడుగు.. 33 శాతం మహిళా రిజర్వేషన్‌తో కొత్త దిశ! Operation Sindoor: అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్ధం.. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది! Goa: ఘనంగా గోవా 40వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు! Noro Virus: అమెరికాను వణికిస్తున్న సరికొత్త మహమ్మారి..వేగంగా విస్తరిస్తున్న 'నోరోవైరస్'! New Pensions: ఏపీ పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్... కొత్తగా 5,606 మందికి పెన్షన్లు!! Palla Srinivasa Rao: గాజువాక సమస్యలపై దిశా సమావేశంలో పల్లా! Healthy Food: ఈ 10 రకాల స్నాక్స్ మీరు ఎంత తిన్నా అస్సలు బరువు పెరగరట...

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 14 గంటల సమయం!

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుండటంతో ఆలయ పరిసరాలు భక్తజనంతో కిక్కిరిసిపోయాయి.

Published : 2026-05-13 09:33:00

ఉచిత దర్శనం కోసం 24 కంపార్ట్మెంట్ల లో భక్తులు..

సర్వదర్శనం భక్తులకు 14 గంటల సమయం..

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుండటంతో ఆలయ పరిసరాలు భక్తజనంతో కిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

టీటీడీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఉచిత సర్వదర్శనం కోసం ప్రస్తుతం 24 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం పొందేందుకు సుమారు 14 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక శీఘ్రదర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు కూడా 3 నుంచి 4 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు.

అలాగే సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులు దర్శనం కోసం 4 నుంచి 6 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ, దర్శన ఏర్పాట్లు సజావుగా కొనసాగుతున్నాయని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

ఇక మంగళవారం ఒక్కరోజే 80,389 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అదే రోజున 32,213 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.50 కోట్లకు చేరింది.

భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు కొనసాగిస్తోంది. తాగునీరు, అన్నప్రసాదం, వైద్యసేవలు వంటి సౌకర్యాలను విస్తృతంగా అందుబాటులో ఉంచారు.

Spotlight

Read More →