Pooja Hegde: పూజా హెగ్డేకు అంత పొగరా అన్న నెటిజన్లు.. సెల్ఫీ ఘటనపై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్! Minister Savitha: 104 మంది ప్రతిభావంతుల విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలు! Gummadi Sandhya Rani: స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగంగా వీధులు శుభ్రం చేసిన మంత్రి సంధ్యారాణి! TDP: మహిళా సాధికారతలో టీడీపీ చారిత్రాత్మక అడుగు.. 33 శాతం మహిళా రిజర్వేషన్‌తో కొత్త దిశ! Operation Sindoor: అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్ధం.. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది! Goa: ఘనంగా గోవా 40వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు! Noro Virus: అమెరికాను వణికిస్తున్న సరికొత్త మహమ్మారి..వేగంగా విస్తరిస్తున్న 'నోరోవైరస్'! New Pensions: ఏపీ పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్... కొత్తగా 5,606 మందికి పెన్షన్లు!! Palla Srinivasa Rao: గాజువాక సమస్యలపై దిశా సమావేశంలో పల్లా! Healthy Food: ఈ 10 రకాల స్నాక్స్ మీరు ఎంత తిన్నా అస్సలు బరువు పెరగరట... Pooja Hegde: పూజా హెగ్డేకు అంత పొగరా అన్న నెటిజన్లు.. సెల్ఫీ ఘటనపై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్! Minister Savitha: 104 మంది ప్రతిభావంతుల విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలు! Gummadi Sandhya Rani: స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగంగా వీధులు శుభ్రం చేసిన మంత్రి సంధ్యారాణి! TDP: మహిళా సాధికారతలో టీడీపీ చారిత్రాత్మక అడుగు.. 33 శాతం మహిళా రిజర్వేషన్‌తో కొత్త దిశ! Operation Sindoor: అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్ధం.. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది! Goa: ఘనంగా గోవా 40వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు! Noro Virus: అమెరికాను వణికిస్తున్న సరికొత్త మహమ్మారి..వేగంగా విస్తరిస్తున్న 'నోరోవైరస్'! New Pensions: ఏపీ పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్... కొత్తగా 5,606 మందికి పెన్షన్లు!! Palla Srinivasa Rao: గాజువాక సమస్యలపై దిశా సమావేశంలో పల్లా! Healthy Food: ఈ 10 రకాల స్నాక్స్ మీరు ఎంత తిన్నా అస్సలు బరువు పెరగరట...

Real Estate: రాయదుర్గంలో ప్రభుత్వ భూముల వేలం.. ఎకరాకు కనీస ధర రూ.139 కోట్లు!

Real Estate: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో సంచలనానికి రంగం సిద్ధమైంది. నగరంలోని అత్యంత కీలకమైన ఐటీ కారిడార్‌లో ఉన్న రాయదుర్గంలో విలువైన ప్రభుత్వ భూములను వేలం వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ భూములకు ఎకరాకు కనీస ధర (అప్‌సెట్ ప్రైస్) ఏకంగా రూ.139 కోట్లుగా నిర్ధారించడం విశేషం.

Published : 2026-05-12 20:29:00
  • ఈ వేలం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో కొత్త బెంచ్‌మార్క్‌లు సృష్టించే అవకాశం..
     
  • Real Estate: గతంలో ఇదే ప్రాంతంలో గరిష్ఠంగా రూ.177 కోట్లు పలికిన ఎకరా భూమి..

Real Estate: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా తెలంగాణ ప్రభుత్వం రాయదుర్గం ఐటీ కారిడార్‌లోని అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూముల విక్రయానికి సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం పరిధిలోని రాయదుర్గం పాన్మక్తాలో ఉన్న 11.38 ఎకరాల ప్రభుత్వ భూములను వేలం వేసేందుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) మే 6న అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ భూములకు ఎకరాకు కనీస ధరను (అప్‌సెట్ ప్రైస్) ఏకంగా రూ.139 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. మొత్తం భూమిని రెండు ప్లాట్లుగా విభజించి 'యాజ్ ఈజ్ వేర్ ఈజ్' ప్రాతిపదికన ఎంఎస్ టీసీ లిమిటెడ్ ద్వారా ఈ-వేలం నిర్వహించనున్నారు.

వేలం షెడ్యూల్ ప్రకారం, 6.29 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్లాట్ 1A & 1F కు మే 28, 2026న ఉదయం 10:30 గంటల నుంచి వేలం ప్రక్రియ మొదలవుతుంది. అలాగే 5.09 ఎకరాల విస్తీర్ణం ఉన్న ప్లాట్ P4 కు జూన్ 1, 2026న వేలం నిర్వహించనున్నారు. ఈ వేలంలో పాల్గొనదలచిన సంస్థలు లేదా డెవలపర్లు ఒక్కో ప్లాటుకు రూ.10 కోట్ల ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) చెల్లించాల్సి ఉంటుంది. బిడ్డింగ్ సమయంలో ఎకరాకు కనీసం కోటి రూపాయల చొప్పున పెంచుతూ వెళ్లాలని నిబంధన విధించారు. ఆసక్తి ఉన్న కొనుగోలుదారుల సందేహాలను నివృత్తి చేసేందుకు మే 18న రాయదుర్గంలోని టీ-హబ్‌లో ప్రీ-బిడ్ సమావేశం కూడా ఏర్పాటు చేశారు.

ఈ భూములు హైటెక్ సిటీ మరియు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు అత్యంత సమీపంలో ఉండటం వల్ల వీటికి విపరీతమైన డిమాండ్ నెలకొంది. క్వాల్‌కామ్ భవనానికి ఎదురుగా, టీ-హబ్ మరియు టీ-వర్క్స్ వంటి ప్రతిష్టాత్మక కేంద్రాలకు అతి దగ్గరలో ఉండటమే కాకుండా, ఔటర్ రింగ్ రోడ్ మరియు మెట్రో స్టేషన్లకు మెరుగైన కనెక్టివిటీ ఉండటం ఈ ప్లాట్ల ప్రత్యేకత. ఇవి మల్టీ-యూజ్ జోనింగ్‌లో ఉన్నందున వాణిజ్య, నివాస లేదా హాస్పిటాలిటీ రంగాలకు సంబంధించిన భారీ ప్రాజెక్టులు నిర్మించుకోవడానికి అనువుగా ఉంటాయి. గతంలో 2025 అక్టోబర్‌లో జరిగిన వేలంలో ఎకరా గరిష్ఠంగా రూ.177 కోట్లు పలికిన నేపథ్యంలో, ఈసారి అప్‌సెట్ ధరను పెంచినప్పటికీ కార్పొరేట్ సంస్థల నుంచి భారీ పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వేలం ఫలితాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త దిశను నిర్దేశిస్తాయని భావిస్తున్నారు.

Spotlight

Read More →