Diabetes Diet: మధుమేహానికి చెక్! జీలకర్ర నీరు వర్సెస్ మెంతి నీరు.. ఏది బెస్ట్? Jackfruit Benefits: వేసవిలో పనస తొనలు తింటే ఈ ఆరోగ్య సమస్యలన్నీ దూరం! Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే రోజూ ఇవి ట్రై చేయండి! Ice Cream: వింత నిబంధన... ఆ గ్రామంలోకి ఐస్‌క్రీమ్ బండి వస్తే రూ. 5,000 ఫైన్! Health Tips: ఏసీ గది నుండి బయటకు రాగానే తలనొప్పి వస్తోందా? కారణాలు ఇవే! Pot Water: మీ మట్టి కుండ నాణ్యమైనదేనా? ఇలా ఈజీగా చెక్ చేయండి! Diabetes Tips: షుగర్ పేషెంట్లు పుచ్చకాయ తినవచ్చా? నిపుణులు చెబుతున్న అసలు నిజమిదే! Beetroot Juice: బీట్‌రూట్ జ్యూస్ తాగుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే ఆపేయండి! Jamun Fruit: నేరేడు పండు అమృతమే..! కానీ ఈ 5 రకాల వ్యక్తులకు మాత్రం విషం లాంటిది! Electric Rice Cooker: ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడుతున్నారా? అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! Diabetes Diet: మధుమేహానికి చెక్! జీలకర్ర నీరు వర్సెస్ మెంతి నీరు.. ఏది బెస్ట్? Jackfruit Benefits: వేసవిలో పనస తొనలు తింటే ఈ ఆరోగ్య సమస్యలన్నీ దూరం! Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే రోజూ ఇవి ట్రై చేయండి! Ice Cream: వింత నిబంధన... ఆ గ్రామంలోకి ఐస్‌క్రీమ్ బండి వస్తే రూ. 5,000 ఫైన్! Health Tips: ఏసీ గది నుండి బయటకు రాగానే తలనొప్పి వస్తోందా? కారణాలు ఇవే! Pot Water: మీ మట్టి కుండ నాణ్యమైనదేనా? ఇలా ఈజీగా చెక్ చేయండి! Diabetes Tips: షుగర్ పేషెంట్లు పుచ్చకాయ తినవచ్చా? నిపుణులు చెబుతున్న అసలు నిజమిదే! Beetroot Juice: బీట్‌రూట్ జ్యూస్ తాగుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే ఆపేయండి! Jamun Fruit: నేరేడు పండు అమృతమే..! కానీ ఈ 5 రకాల వ్యక్తులకు మాత్రం విషం లాంటిది! Electric Rice Cooker: ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడుతున్నారా? అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి!

Glowing Skin Tips: డైట్‌లో ఈ 5 మార్పులు చేసుకోండి.. 4 వారాల్లోనే మీ చర్మంలో అద్భుతమైన మెరుపు చూడండి!

Glowing Skin Tips: 25 ఏళ్లు పైబడిన మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత చర్మ సమస్యలు రావడం సహజం. వీటికి పరిష్కారం మీ వంటగదిలోనే ఉంది. మెరిసే చర్మం మెరుగైన జీర్ణక్రియ కోసం నిపుణులు సూచించిన 5 ముఖ్యమైన ఆహార పదార్థాల గురించి తెలుసుకోండి.

Published : 2026-03-21 09:12:00

Glowing Skin Tips: వయసు పాతికేళ్లు దాటిందంటే చాలు.. మహిళల శరీరంలో ఎన్నో మార్పులు మొదలవుతాయి. చర్మంపై ముడతలు రావడం, ముఖం కళ తప్పడం, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు వేధిస్తుంటాయి. చాలామంది వీటి కోసం వేలకు వేలు ఖర్చు చేసి బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతుంటారు. అయితే, అసలైన మెరుపు బయట పూసే క్రీముల్లో లేదు, మన పొట్ట (గట్) ఆరోగ్యంలోనే ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లోపల ఆరోగ్యం బాగుంటేనే ముఖంపై కాంతి కనిపిస్తుంది. మరి 25 ఏళ్లు పైబడిన మహిళలు తమ జీర్ణక్రియను మెరుగుపరుచుకుంటూ, హార్మోన్లను బ్యాలెన్స్ చేసుకోవడానికి రోజూ తీసుకోవాల్సిన ఆ 5 పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.

మన పూర్వీకులు చద్ది అన్నం, పెరుగు ఎందుకు తినేవారో తెలుసా? వీటిలో ఉండే 'మంచి బ్యాక్టీరియా' మన పొట్టను క్లీన్‌గా ఉంచుతుంది. పెరుగు, మజ్జిగ లేదా కిమ్చీ వంటి పదార్థాలు తీసుకోవడం వల్ల ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లు అదుపులో ఉంటాయి. దీనివల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే చికాకు తగ్గుతుంది, చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది.ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే పాలకూర, తోటకూర వంటి వాటిలో విటమిన్-సి, ఇ  మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని విషతుల్యాలను  బయటకు పంపిస్తాయి. వారానికి కనీసం మూడు సార్లు ఆకుకూరలు తింటే చర్మం వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా యవ్వనంగా కనిపిస్తుంది.

నాన్-వెజ్ తినే వారికి చేపలు ఒక అద్భుతమైన ఆహారం. సాల్మన్ లేదా మన దగ్గర దొరికే చిన్న చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని డ్రై అవ్వకుండా కాపాడి, సహజమైన తేమను అందిస్తాయి. అంతేకాదు, మానసిక ఒత్తిడిని తగ్గించి మూడ్‌ని హుషారుగా ఉంచుతాయి. మన వంటింట్లో దొరికే వెల్లుల్లి, ఉల్లిపాయలు కేవలం రుచి కోసమే కాదు, వీటిలో ఉండే ప్రీబయోటిక్ ఫైబర్ కడుపులోని బ్యాక్టీరియాకు మేతగా పనిచేస్తుంది. అలాగే ఓట్స్, అరటిపండ్లు క్రమం తప్పకుండా తీసుకుంటే జీర్ణకోశం లోపలి పొర ఆరోగ్యంగా ఉంటుంది. దీనివల్ల ముఖంపై అలర్జీలు, మొటిమలు రావు.

చర్మంపై గాయాలు త్వరగా మానాలన్నా, మొటిమల మచ్చలు పోవాలన్నా శరీరానికి 'జింక్' చాలా అవసరం. గుమ్మడి గింజలు, శనగలు, ఎండు ద్రాక్ష వంటి వాటిలో ఇది సమృద్ధిగా దొరుకుతుంది. అయితే ఇవి తీసుకునేటప్పుడు ఖాళీ కడుపుతో కాకుండా, ఏదైనా తిన్న తర్వాతే తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.అందం అనేది కేవలం రంగులో ఉండదు, మనం తీసుకునే పోషక ఆహారంలో ఉంటుంది. ఒక 4 నుండి 6 వారాల పాటు పైన చెప్పిన ఆహార నియమాలు పాటిస్తే మీ చర్మం ఆకృతిలో మార్పును మీరే గమనిస్తారు. 

Spotlight

Read More →