- శెట్టిబలిజ పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం హర్షణీయం..
Minister Kollu Ravindra: శెట్టిబలిజ పితామహుడు కీ.శే. దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహం ఏర్పాటు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహణపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యునిగా, బీసీ విభాగం అధ్యక్షునిగా కొల్లు రవీంద్ర అనేక సార్లు విన్నవించారు. అధికారంలోకి వచ్చాక చేసిన కృషి ఫలించింది. మార్చి 23న రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జి.ఓ.నెం.629 జారీ చేయడం హర్షణీయం. రాష్ట్రవ్యాప్తంగా కీ.శే. దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం అన్ని శాఖలు, జిల్లాల కలెక్టర్లు, అధికారులకు ఆదేశాలు జారీ చేయడం గర్వకారణం. చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. దొమ్మేటి వెంకటరెడ్డి గారి ఆశయాలను భావితరాలకు వివరించి స్ఫూర్తి నింపేలా పని చేస్తాం..