Apple Benefits: ఆరోగ్యకరమైన ఆహారాల్లో యాపిల్‌కు ప్రత్యేక స్థానం ఉంది. రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం లేదు అనే మాటకు కారణం దీనిలో పోషక విలువలే. అయితే గ్రీన్ ఆపిల్ రెడ్ ఆపిల్ మధ్య తేడాలు ఏమిటి? ఏది మంచిది? అనే ప్రశ్నలు చాలామందికి ఉంటాయి. ఈ రెండు పండ్ల మధ్య ఉన్న వ్యత్యాసాలను, పోషక విలువలను ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం.
గ్రీన్ ఆపిల్ సాధారణంగా పులుపు రుచితో ఉంటుంది. ఇది తిన్నప్పుడు కొంచెం టార్ట్ ఫీలింగ్ ఇస్తుంది. మరోవైపు రెడ్ ఆపిల్ తియ్యగా ఉండి తేలికగా తినడానికి అనువుగా ఉంటుంది. అందుకే పిల్లలు ఎక్కువగా రెడ్ ఆపిల్‌ను ఇష్టపడతారు. పోషక విలువల విషయానికి వస్తే, ఈ రెండు యాపిల్స్‌లో కూడా విటమిన్లు, ఫైబర్ యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. గ్రీన్ ఆపిల్‌లో షుగర్ కంటెంట్ తక్కువగా ఉండగా, ఫైబర్ విటమిన్ C ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో జీర్ణక్రియను మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. రెడ్ ఆపిల్‌లో నేచురల్ షుగర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఇది శరీరానికి త్వరగా శక్తిని అందిస్తుంది. అలాగే ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి.
ఆరోగ్య ప్రయోజనాల పరంగా గ్రీన్ ఆపిల్ బరువు తగ్గాలనుకునే వారికి చాలా ఉపయోగకరం. తక్కువ క్యాలరీలు ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల ఎక్కువసేపు ఆకలి అనిపించకుండా చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఇది మంచి ఎంపికగా భావిస్తారు. ఇక రెడ్ ఆపిల్ శరీరానికి త్వరగా ఎనర్జీ ఇవ్వడంతో పాటు రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే చర్మ కాంతిని పెంచడంలో కూడా ఇది సహాయపడుతుంది.
గ్రీన్ ఆపిల్ రెడ్ ఆపిల్ రెండింటికీ ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. మీ ఆరోగ్య పరిస్థితి, అవసరాల ప్రకారం వీటిని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఈ రెండు పండ్లను సమతుల్యంగా తీసుకోవడం ద్వారా మరింత ప్రయోజనం పొందవచ్చు. ఈ సమాచారం కేవలం మీ అవగాహనకు మాత్రమే మీ ఆరోగ్యరీత్యా ముందుగా మీ డాక్టర్ ని సంప్రదించి తీసుకోవడం ఉత్తమం.