TTD: కల్తీ నెయ్యి వ్యవహారం మహాపాపం.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మండిపాటు! Maha Shivaratri : 2026 మహాశివరాత్రి తిథి, పూజా ముహూర్తం మరియు ఉపవాస నియమాల పూర్తి వివరాలు!! Ratha Saptami: బ్రహ్మోత్సవాల స్థాయిలో రథసప్తమి! శ్రీవారి వాహన సేవలకు లక్షలాది భక్తులు! బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల్లో కొత్త నిబంధన.. హిందూయేతరులకు ప్రవేశం బంద్! చార్‌ధామ్ యాత్రలో కీలక పరిణామం! Medaram Jatara 2026: మేడారంలో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ఇప్ప పువ్వు లడ్డూలు... ధర ఎంత అంటే..!! ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక యాత్ర! దక్షిణ కాశీ నుండి జ్యోతిర్లింగాల వరకు! Ratha Saptami: సూర్య జయంతి అంటే ఏమిటి.. రథ సప్తమి ప్రాముఖ్యత తెలుసుకుందాం! Ratha Saptami: ఏడాది పుణ్యం ఒకే రోజులో…! తిరుమల రథసప్తమి విశేషం! Hindu Astrology: బెల్లం కలిపిన నీటితో సూర్యారాధన చేస్తే ఏం జరుగుతుందో తెలుసా.. ముఖ్యంగా వారు చేస్తే ఇంకా తిరిగే ఉండదు!! Annavaram: అన్నవరం ప్రసాదం కౌంటర్‌లో ఎలుకలు..! ఇద్దరు ఉద్యోగులపై వేటు! TTD: కల్తీ నెయ్యి వ్యవహారం మహాపాపం.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మండిపాటు! Maha Shivaratri : 2026 మహాశివరాత్రి తిథి, పూజా ముహూర్తం మరియు ఉపవాస నియమాల పూర్తి వివరాలు!! Ratha Saptami: బ్రహ్మోత్సవాల స్థాయిలో రథసప్తమి! శ్రీవారి వాహన సేవలకు లక్షలాది భక్తులు! బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల్లో కొత్త నిబంధన.. హిందూయేతరులకు ప్రవేశం బంద్! చార్‌ధామ్ యాత్రలో కీలక పరిణామం! Medaram Jatara 2026: మేడారంలో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ఇప్ప పువ్వు లడ్డూలు... ధర ఎంత అంటే..!! ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక యాత్ర! దక్షిణ కాశీ నుండి జ్యోతిర్లింగాల వరకు! Ratha Saptami: సూర్య జయంతి అంటే ఏమిటి.. రథ సప్తమి ప్రాముఖ్యత తెలుసుకుందాం! Ratha Saptami: ఏడాది పుణ్యం ఒకే రోజులో…! తిరుమల రథసప్తమి విశేషం! Hindu Astrology: బెల్లం కలిపిన నీటితో సూర్యారాధన చేస్తే ఏం జరుగుతుందో తెలుసా.. ముఖ్యంగా వారు చేస్తే ఇంకా తిరిగే ఉండదు!! Annavaram: అన్నవరం ప్రసాదం కౌంటర్‌లో ఎలుకలు..! ఇద్దరు ఉద్యోగులపై వేటు!

Medaram Jatara 2026: మేడారంలో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ఇప్ప పువ్వు లడ్డూలు... ధర ఎంత అంటే..!!

మేడారం మహా జాతరలో ఈసారి 'ఇప్ప పువ్వు లడ్డూలు' ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గిరిజన మహిళల ఆర్థిక స్వావలంబనకు చిహ్నంగా మారిన ఈ లడ్డూల విశేషాలు, ఆరోగ్య ప్రయోజనాలు..

Published : 2026-01-26 13:47:00
రెండోసారి తల్లి కాబోతున్న నటి.. బేబీ బంప్‌ ఫోటోలతో నెట్టింట సందడి.. వైరల్ అవుతున్న క్రేజీ అప్‌డేట్!

అడవి తల్లీ దీవెనలు, ఆదివాసీల ఆచారాల కలయికతో జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరలో ఈసారి ఒక వినూత్న రుచి భక్తులను పలకరిస్తోంది. అటవీ సంపదను అమృతంలా మార్చి, గిరిజన మహిళలు తయారు చేసిన 'ఇప్ప పువ్వు లడ్డూలు' ప్రస్తుతం జాతరలో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. కేవలం రుచికే పరిమితం కాకుండా, అపారమైన ఆరోగ్య రహస్యాలను తనలో దాచుకున్న ఈ లడ్డూలు, ఈ ఏడాది జాతరలో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి.

WHO vs US: ట్రంప్ నిర్ణయంతో ప్రపంచానికి ముప్పు.. డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!

మేడారం జాతర చరిత్రలో తొలిసారిగా సమ్మక్క-సారలమ్మ మహిళా రైతుల ఉత్పత్తుల సంఘం' ఆధ్వర్యంలో ఈ లడ్డూల విక్రయాలు ప్రారంభమయ్యాయి. అటవీ ప్రాంతాల్లో సహజంగా లభించే ఇప్ప పువ్వులను సేకరించి, వాటిని శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసి ఈ పోషకాహారాన్ని సిద్ధం చేస్తున్నారు. జాతర ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పది స్టాళ్ల వద్ద భక్తుల రద్దీ కనిపిస్తోంది. కేవలం ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే సుమారు మూడు లక్షల రూపాయల మేర అమ్మకాలు జరగడం విశేషం.  250 గ్రాములు లడ్డూల బాక్సు ధరను రూ. 150గా నిర్ణయించినప్పటికీ, నాణ్యత మెండుగా ఉండటంతో భక్తులు పోటీ పడి మరీ కొనుగోలు చేస్తున్నారు.

77వ గణతంత్ర దినోత్సవం: భారత్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ శుభాకాంక్షలు.. "డ్రాగన్, ఏనుగు కలిసి నాట్యం చేయాలి" అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు!

మహిళల ఆర్థిక ఎదుగుదల ముఖ్యమంత్రి, మంత్రుల సమక్షంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ లడ్డూలను పంపిణీ చేయడంతో వీటికి ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్త గుర్తింపు లభించింది. మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో జనవరి 13న ఈ స్టాళ్లను ప్రారంభించారు. 'సెర్ప్' (SERP) ద్వారా మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడమే కాకుండా, ఐటీడీఏ (ITDA) ద్వారా మార్కెటింగ్ సదుపాయాలను కల్పించడం ఈ విజయానికి ప్రధాన కారణం. తాడ్వాయి మండలంలోని కొండపర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తయారీ యూనిట్ ద్వారా చెరుపు నాగమణి నాయకత్వంలో గిరిజన మహిళలు వీటిని తయారు చేస్తున్నారు. ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్, ఫుడ్ లైసెన్స్ వంటి ప్రమాణాలను పాటించడం వల్ల ప్రజల్లో వీటిపై నమ్మకం పెరిగింది.

ఆదివాసీల జీవనశైలిలో ఇప్ప పువ్వు ఒక భాగం. ఆధునిక కాలంలో వీటి విలువను మర్చిపోతున్న తరుణంలో, నిపుణులు వీటిలోని ఔషధ గుణాలను వివరిస్తున్నారు

 రోగనిరోధక శక్తి: ఇందులోని విటమిన్లు శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని అందిస్తాయి.

 జీర్ణక్రియ: అధిక ఫైబర్ ఉండటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.

 మధుమేహం & కొలెస్ట్రాల్: రక్తంలోని చక్కెర స్థాయిలను, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

 గర్భిణులకు వరం: రక్తహీనతను నివారించే ఖనిజ లవణాలు ఉండటం వల్ల గర్భిణీ స్త్రీలకు ఇవి ఎంతో మేలు చేస్తాయని వైద్యులు సూచిస్తున్నారు.

అడవి బిడ్డల కష్టానికి, ప్రభుత్వ ప్రోత్సాహం తోడవడంతో మేడారం జాతర ఈసారి భక్తితో పాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు వేదికైంది. కేవలం ఒక తీపి పదార్థంగానే కాకుండా, గిరిజన మహిళల ఆత్మగౌరవానికి చిహ్నంగా ఈ ఇప్ప పువ్వు లడ్డూలు నిలుస్తున్నాయి.

Spotlight

Read More →