భారతదేశంలో స్పోర్ట్స్ బైక్ అనగానే చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చే పేరు బజాజ్ పల్సర్. మైలేజ్ బైక్‌లే ఎక్కువగా ఉన్న రోజుల్లో, పవర్, స్టైల్, స్పోర్టీ లుక్‌ను యువతకు పరిచయం చేసిన బ్రాండ్ పల్సర్. అందుకే ఇది కేవలం ఒక బైక్ మాత్రమే కాదు… కోట్లాది యువతకు ఒక యూత్ ఐకాన్ అని చెప్పుకోవాలి.
ఈ లెజెండరీ బ్రాండ్ ఇప్పుడు 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బజాజ్ ఆటో 25 ఇయర్స్ ఆఫ్ పల్సర్ సెలబ్రేషన్ ఆఫర్ ను ప్రకటించింది. పల్సర్ అభిమానులకు ఇది నిజంగా ఒక శుభవార్త. డిజైన్ అయినా, ఇంజిన్ పనితీరు అయినా ఫీచర్లు కాలానుగుణంగా పల్సర్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వచ్చింది. కొత్త టెక్నాలజీ, అగ్రెసివ్ స్టైలింగ్, స్ట్రాంగ్ ఇంజిన్‌తో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అందుకే 25 ఏళ్లుగా భారత రోడ్లపై పల్సర్ క్రేజ్ తగ్గలేదు.
ఈ సెలబ్రేషన్ ఆఫర్‌లో భాగంగా, పల్సర్ బైక్ కొనుగోలు చేసే వారికి రూ.7,000 వరకు ప్రయోజనాలు* లభించనున్నాయి. ఇందులో డిస్కౌంట్‌తో పాటు కొన్ని మోడళ్లపై ఫ్రీ సర్వీసింగ్ వంటి అదనపు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇది కేవలం ఆఫర్ మాత్రమే కాదు… పల్సర్‌ను ఇష్టపడిన లక్షలాది వినియోగదారులకు బజాజ్ ఇచ్చే ఒక థ్యాంక్యూ గిఫ్ట్‌గా చెప్పొచ్చు. ఈ స్పెషల్ ఆఫర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అధికారిక బజాజ్ షోరూమ్‌లలో అందుబాటులో ఉంది. పల్సర్ కొనాలని అనుకుంటున్నవారికి ఇది నిజంగా బెస్ట్ టైమ్.
ప్రస్తుతం పల్సర్ లైనప్ 125cc నుంచి 400cc వరకు విస్తరించి ఉంది. మొత్తం 11 వేర్వేరు మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్ కావాలంటే పల్సర్ 125 మంచి ఎంపిక. తక్కువ ధరలో స్పోర్టీ లుక్‌తో పల్సర్ ఫీల్ ఇస్తుంది. మొదటిసారి స్పోర్ట్స్ బైక్ కొనాలనుకునే యువతకు ఇది బాగా సరిపోతుంది. దీని తర్వాత పల్సర్ N150, పల్సర్ 150, పల్సర్ N160 వంటి మోడళ్లు యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాయి. ఎక్కువ పవర్, లేటెస్ట్ ఫీచర్లు కోరుకునేవారికి పెద్ద ఇంజిన్ మోడళ్లూ అందుబాటులో ఉన్నాయి.