Instagram Instants: ఇన్‌స్టాగ్రామ్ నుంచి మరో అద్భుతం! స్నాప్‌చాట్‌కు పోటీగా 'ఇన్‌స్టంట్స్' యాప్ లాంచ్! BluJ Aero: విమానయానంలో కొత్త చరిత్ర! ఎయిర్‌పోర్టు అక్కర్లేదు.. రన్‌వే అవసరం లేదు... ఇంజనీర్ల అద్భుత విమానం! Oil Free Cooking: హెల్తీ లైఫ్ స్టైల్ కోసం బెస్ట్ ఎయిర్ ఫ్రైర్స్... టాప్ బ్రాండ్ల పూర్తి వివరాలు! Infinix India: ఇన్ఫినిక్స్ తొలి మెటల్ బాడీ ఫోన్... ఐఫోన్ కి గట్టి పోటీ! బ్యాక్ సైడ్ డిస్ప్లేతో క్రేజీ ఫీచర్లు! whatsapp Services: ఇకపై వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్ సేవలు! మీ ఫోన్‌లో ఈ నంబర్ ఉంటే చాలు.. India Space: అంతరిక్షంలోకి భారతీయ బాహుబలి.. గగన్‌యాన్ మిషన్ సిద్ధం.. ఇక నింగిలోకి ఎగరడమే..! Change Email ID: పాత ఐడిని వదలలేక.. కొత్తది వాడలేక సతమతమవుతున్నారా? గూగుల్ తెచ్చిన సూపర్ ఫీచర్ మీకోసమే! Google AI Overviews: గూగుల్ AI సెర్చ్‌లో భారీ తప్పులు.. గంటకు లక్షల సంఖ్యలో తప్పుడు సమాధానాలు! highspeed trains night: టెక్నికల్ రీజన్స్ vs మైండ్ గేమ్: రాత్రి పూట రైలు ప్రయాణంలో కలిగే ఆ త్రిల్లింగ్ అనుభూతి వెనుక సైన్స్.. AC India 2026: ఏసీ కొంటున్నారా? కొత్త స్టార్ రేటింగ్ నిబంధనలు ఇవే! Instagram Instants: ఇన్‌స్టాగ్రామ్ నుంచి మరో అద్భుతం! స్నాప్‌చాట్‌కు పోటీగా 'ఇన్‌స్టంట్స్' యాప్ లాంచ్! BluJ Aero: విమానయానంలో కొత్త చరిత్ర! ఎయిర్‌పోర్టు అక్కర్లేదు.. రన్‌వే అవసరం లేదు... ఇంజనీర్ల అద్భుత విమానం! Oil Free Cooking: హెల్తీ లైఫ్ స్టైల్ కోసం బెస్ట్ ఎయిర్ ఫ్రైర్స్... టాప్ బ్రాండ్ల పూర్తి వివరాలు! Infinix India: ఇన్ఫినిక్స్ తొలి మెటల్ బాడీ ఫోన్... ఐఫోన్ కి గట్టి పోటీ! బ్యాక్ సైడ్ డిస్ప్లేతో క్రేజీ ఫీచర్లు! whatsapp Services: ఇకపై వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్ సేవలు! మీ ఫోన్‌లో ఈ నంబర్ ఉంటే చాలు.. India Space: అంతరిక్షంలోకి భారతీయ బాహుబలి.. గగన్‌యాన్ మిషన్ సిద్ధం.. ఇక నింగిలోకి ఎగరడమే..! Change Email ID: పాత ఐడిని వదలలేక.. కొత్తది వాడలేక సతమతమవుతున్నారా? గూగుల్ తెచ్చిన సూపర్ ఫీచర్ మీకోసమే! Google AI Overviews: గూగుల్ AI సెర్చ్‌లో భారీ తప్పులు.. గంటకు లక్షల సంఖ్యలో తప్పుడు సమాధానాలు! highspeed trains night: టెక్నికల్ రీజన్స్ vs మైండ్ గేమ్: రాత్రి పూట రైలు ప్రయాణంలో కలిగే ఆ త్రిల్లింగ్ అనుభూతి వెనుక సైన్స్.. AC India 2026: ఏసీ కొంటున్నారా? కొత్త స్టార్ రేటింగ్ నిబంధనలు ఇవే!

israel-Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధంలో 'ఏఐ' మాయాజాలం... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శాటిలైట్ ఫోటోలు..!!

Artificial Intelligence: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో కృత్రిమ మేధస్సు (AI) సాయంతో సృష్టిస్తున్న నకిలీ శాటిలైట్ చిత్రాలు కలకలం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రాలు అసలు నిజాన్ని ఎలా మరుగున పరుస్తున్నాయో వీటి వల్ల కలిగే ముప్పుల గురించి వివరాలు..

Published : 2026-03-09 11:19:00

Artificial Intelligence: ప్రస్తుతం జరుగుతున్న ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధంలో కేవలం తుపాకులు, క్షిపణులే కాదు, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కూడా కీలక పాత్ర పోషిస్తోంది. కృత్రిమ మేధస్సు సాయంతో సృష్టిస్తున్న నకిలీ శాటిలైట్ చిత్రాలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. అసలు నిజమైన ఫోటో ఏదో, ఏఐ సృష్టించిన నకిలీ ఏదో గుర్తుపట్టలేనంతగా ఈ చిత్రాలు ఉంటున్నాయి. దీనివల్ల యుద్ధ క్షేత్రంలో ఏం జరుగుతుందో తెలియక సామాన్య ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.

ఇటీవల ఇరాన్‌కు చెందిన ఒక పత్రిక ఖతార్‌లోని అమెరికా సైనిక స్థావరం పూర్తిగా ధ్వంసమైనట్లు ఒక శాటిలైట్ చిత్రాన్ని పోస్ట్ చేసింది. అయితే, నిశితంగా పరిశీలించిన నిపుణులు అది పాత గూగుల్ ఎర్త్ ఫోటోను ఏఐ సాయంతో మార్చినట్లు గుర్తించారు. ఆ చిత్రంలో కార్లు ఉన్న చోటే ఉండటం, కొన్ని చోట్ల ఫోటోలు మసకగా ఉండటాన్ని గమనించారు. అయినప్పటికీ, ఆ నకిలీ ఫోటో అప్పటికే కోట్లాది మందికి చేరుకోవడంతో తప్పుడు సమాచారం వేగంగా వ్యాపించింది.

ఎక్కడ దాడులు జరిగాయి? అనే విషయాలను తెలుసుకోవడానికి శాటిలైట్ చిత్రాలు చాలా కీలకం. గతంలో ఇలాంటి సమాచారం కోసం అధికారిక వర్గాలపై ఆధారపడేవారు. కానీ ఇప్పుడు ఏఐ పుణ్యమా అని ఎవరికి వారే ఫోటోలను సృష్టించి వదులుతున్నారు. దీనివల్ల యుద్ధం గురించి ప్రజల్లో తప్పుడు అభిప్రాయాలు ఏర్పడటమే కాకుండా, స్టాక్ మార్కెట్లు కూడా ప్రభావితం అయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

కేవలం ఇజ్రాయిల్-ఇరాన్  యుద్ధమే కాకుండా, గతంలో రష్యా-ఉక్రెయిన్  భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు కూడా ఇలాంటి నకిలీ చిత్రాలు బయటకు వచ్చాయి. ఈ తప్పుడు సమాచారం వల్ల అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. యుద్ధం నేపథ్యంలో ఏ దేశం గెలుస్తోంది, ఏ దేశం నష్టపోయింది అనే దానిపై స్పష్టత లేకుండా చేసేందుకు కొన్ని శక్తులు కావాలనే ఇలాంటి 'డిజిటల్ మాయాజాలాన్ని' వాడుతున్నాయి.

 సోషల్ మీడియాలో వచ్చే ప్రతి శాటిలైట్ చిత్రాన్ని గుడ్డిగా నమ్మకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఏఐ సృష్టించిన చిత్రాల్లో కొన్ని చిన్న చిన్న తప్పులు (లాజిక్ లేని యాంగిల్స్, అక్షర దోషాలు) ఉంటాయి. వాటిని గమనించడం ద్వారా నిజానిజాలు తెలుసుకోవచ్చు. యుద్ధం లాంటి సున్నితమైన విషయాల్లో అధికారిక సమాచారం వచ్చే వరకు వేచి చూడటమే ఉత్తమమని  చెబుతున్నారు.

Spotlight

Read More →