ChaiRaasta: ఏపీలో మహిళలకు చాయ్‌రస్తాలు... నెల నెలా సంపాదన! పూర్తి వివరాలు.. నేతన్నలకు శుభవార్త.. క్రిస్మస్–సంక్రాంతికి ఆప్కో పండుగ ఆఫర్! 30 నుంచి 40శాతం రాయితీ! Rural Politics: భార్య సర్పంచ్... అధికారం భర్త చేతుల్లోనేనా? NHRC సీరియస్!! Chandrababu: కన్హా శాంతివనంలో సీఎం చంద్రబాబు పర్యటన..దాజీతో కీలక భేటీ! New Railway line: ఏపీలో ఆ రూట్లో రైల్వే విస్తరణ.. రూ.1,723 కోట్లతో! గంటలో చెన్నై చేరే దిశగా అడుగులు... Praja Vedika: నేడు (15/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Vande Bharath: ఏపీలో మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. ఈ రోజు నుంచే ప్రారంభం! రూట్, టైమింగ్స్ ఇవే... కాంగ్రెస్ జోరు.. కారు బేజారు.. పంచాయతీ ఎన్నికల్లో కంగుతిన్న బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులు! Pawan Kalyans decision: అంధ క్రీడాకారుల కోసం రూ.84 లక్షల ప్రోత్సాహకం.. పవన్ కళ్యాణ్ నిర్ణయంతో! Railway Station: బెజవాడ రైల్వే స్టేషన్‌కు మల్టీ లెవల్ మేకోవర్…! షాపింగ్ నుంచి హోటళ్ల వరకూ భారీ ప్లాన్..! ChaiRaasta: ఏపీలో మహిళలకు చాయ్‌రస్తాలు... నెల నెలా సంపాదన! పూర్తి వివరాలు.. నేతన్నలకు శుభవార్త.. క్రిస్మస్–సంక్రాంతికి ఆప్కో పండుగ ఆఫర్! 30 నుంచి 40శాతం రాయితీ! Rural Politics: భార్య సర్పంచ్... అధికారం భర్త చేతుల్లోనేనా? NHRC సీరియస్!! Chandrababu: కన్హా శాంతివనంలో సీఎం చంద్రబాబు పర్యటన..దాజీతో కీలక భేటీ! New Railway line: ఏపీలో ఆ రూట్లో రైల్వే విస్తరణ.. రూ.1,723 కోట్లతో! గంటలో చెన్నై చేరే దిశగా అడుగులు... Praja Vedika: నేడు (15/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Vande Bharath: ఏపీలో మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. ఈ రోజు నుంచే ప్రారంభం! రూట్, టైమింగ్స్ ఇవే... కాంగ్రెస్ జోరు.. కారు బేజారు.. పంచాయతీ ఎన్నికల్లో కంగుతిన్న బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులు! Pawan Kalyans decision: అంధ క్రీడాకారుల కోసం రూ.84 లక్షల ప్రోత్సాహకం.. పవన్ కళ్యాణ్ నిర్ణయంతో! Railway Station: బెజవాడ రైల్వే స్టేషన్‌కు మల్టీ లెవల్ మేకోవర్…! షాపింగ్ నుంచి హోటళ్ల వరకూ భారీ ప్లాన్..!

Railway Station: బెజవాడ రైల్వే స్టేషన్‌కు మల్టీ లెవల్ మేకోవర్…! షాపింగ్ నుంచి హోటళ్ల వరకూ భారీ ప్లాన్..!

2025-12-14 18:39:00
Wifi: ఫ్రీ వైఫై ఉంది కదా అని కనెక్ట్ అయ్యారా..? మీ డేటా ప్రమాదంలోనే..!

అమరావతి రాజధానికి దీటుగా విజయవాడను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో, నగరానికి కీలక ద్వారంగా ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్‌ను పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) మోడల్‌లో ఆధునీకరించేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. ఇప్పటికే ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రూ.661.11 కోట్ల నిధులు మంజూరు చేయడంతో, రైల్వే యంత్రాంగం వేగంగా ముందడుగు వేసింది. స్టేషన్ అభివృద్ధికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి, ప్రతిపాదనలకు అధికారికంగా శ్రీకారం చుట్టింది.

Job Alert: త్రివిధ దళాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్…! UPSC NDA, NA 2026 విడుదల!

మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చేపట్టిన ఆధునిక రైల్వే స్టేషన్ అభివృద్ధి నమూనాలను అనుసరించి, అమరావతి రాజధానికి అతి సమీపంలోని విజయవాడ రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ఎన్‌డీఏ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి అనుగుణంగా స్టేషన్ అభివృద్ధికి సంబంధించిన పూర్తి బ్లూ ప్రింట్‌ను రైల్వే అధికారులు సిద్ధం చేశారు. మొత్తం 83,367 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ అభివృద్ధి చేపట్టనుండగా, వ్యాపార సముదాయాలు, స్టాల్స్, హోటళ్లు, రైల్వే క్వార్టర్లు, స్టేషన్ కార్యాలయాలు వంటి సదుపాయాలను 81,948 చదరపు మీటర్ల పరిధిలో నిర్మించనున్నారు. తూర్పు, పడమర వైపులా విజయవాడ నగరానికి ఆకర్షణగా నిలిచేలా స్టేషన్‌ను డిజైన్ చేయనున్నారు.

Coffee Tips: ఇంట్లో కాఫీ కేఫేలా రుచిగా కావాలా? ఈ చిన్న చిట్కాలే చాలు!!

తూర్పు ముఖద్వారాన్ని పార్లమెంట్ ముఖద్వారానికి దీటుగా, సూపర్ లుక్‌తో ఆకట్టుకునే విధంగా రూపొందించేందుకు ఇప్పటికే ప్రత్యేక నమూనాలను సిద్ధం చేశారు. మరోవైపు పడమర వైపు ఉన్న వన్‌టౌన్ ప్రాంతం వ్యాపార కేంద్రంగా పేరుగాంచిన నేపథ్యంలో, అక్కడ కూడా వ్యాపారులకు అనుకూలంగా బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. రెండు నుంచి మూడు అంతస్తుల వరకూ కమర్షియల్ స్పేస్‌ను అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం స్టేషన్‌లో మూడు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు అందుబాటులో ఉన్నప్పటికీ, రైళ్ల సంఖ్యతో పాటు ప్రయాణికుల రద్దీ భారీగా పెరగడంతో అదనపు సదుపాయాల అవసరం ఏర్పడింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా బడ్జెట్‌ను కేటాయించారు.

Late night: యువత లేట్ నైట్ అలవాటు.. వైద్యుల హెచ్చరిక!

ఇదిలా ఉండగా, రైల్వే స్టేషన్ తూర్పు వైపు ఉన్న సిటీ బస్టాండ్, స్కూటర్ పార్కింగ్ ప్రాంతం నుంచి టవర్ క్లాక్ వరకు పరిసర ప్రాంతాలన్నింటిలోనూ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాంతంలో స్టేషన్‌కు చెందిన 41.70 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జీ ప్లస్–2 భవనం నిర్మించనున్నారు. అలాగే పడమర వైపు 6,647 చదరపు మీటర్ల పరిధిలో జీ ప్లస్–2 భవనాలు నిర్మించే ప్రణాళిక ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో రైల్వే అధికారులు పలు దఫాలు చర్చలు జరిపారు. తూర్పు వైపు అభివృద్ధికి పూర్తిగా అనుకూల పరిస్థితులు ఉండగా, పడమర వైపు గాంధీ హిల్ కొండ ప్రాంతంలో ఉన్న కొంత భూమిని స్టేషన్ అభివృద్ధికి కేటాయించాలనే ప్రతిపాదనలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే విజయవాడ రైల్వే స్టేషన్ రాష్ట్రానికే ఒక మైలురాయిగా మారనుందని అధికారులు భావిస్తున్నారు.

Messi tour: ఒకే మెస్సీ టూర్.. కోల్కతాలో గందరగోళం.. హైదరాబాద్‌లో విజయం!
Industries: ఏపీకి తరలి వచ్చిన ఫార్మా కంపెనీకి భూకేటాయింపులు..! 3 జిల్లాల్లో వేల ఎకరాలు.. వేల ఉద్యోగాలు…!
National Security: మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై ఐఎస్ఐ నిఘా అలర్ట్‌.. భద్రత మరింత కట్టుదిట్టం!!
Delhi : గ్యాస్ ఛాంబర్‌గా మారిన ఢిల్లీ.. GRAP-4 రూల్స్ అమలు!
దక్షిణాఫ్రికాలో విషాదం.. హిందూ ఆలయం కూలి నలుగురు దుర్మరణం, భారత సంతతి వ్యక్తి మృతి!
ఏపీలో బంగారు గనులు.. ఆ ప్రాంతాల్లో మొదలైన తవ్వకాలు! 10 ఏళ్లలో 6 వేల టన్నుల బంగారం!

Spotlight

Read More →