శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.
ముందుగా శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ద్రౌపది ముర్ముకు సీఎం చంద్రబాబునాయుడుతో కలిసి మంత్రి నారా లోకేష్ ఘనస్వాగతం పలికారు.
అనంతరం ప్రశాంతి నిలయానికి చేరుకుని సాయి కుల్వంత్ మందిరంలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆదివాసీ మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం ‘శ్రీ సత్యసాయి ఆదివాసీ మహిళా స్వాస్త్య స్వశక్తీకరణ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా “శ్రీ సత్యసాయి యూనివర్సల్ టార్చ్ ఫర్ పీస్” జ్యోతిని వెలిగించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్, శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నిమిష్ పాండ్యా తదితరులు పాల్గొన్నారు.