Chandrababu: ఏడవ జిల్లా కలెక్టర్ల సదస్సులో కీలక నిర్ణయం.. పావలా వడ్డీ విద్యా రుణాలకు సీఎం గ్రీన్ సిగ్నల్! Atchennaidu: ఖరీఫ్‌ రైతుకు అండగా ప్రభుత్వం.. విత్తనాలు, ఎరువులు, నీటితో పూర్తి సన్నద్ధత! TamilNadu Election 2026: తమిళనాడులో నవ శకం... మే 9న సీఎంగా 'దళపతి' విజయ్ ప్రమాణ స్వీకారం! Chandrababu: గంటల్లోనే ఫైళ్లు క్లియర్ కావాలి.. 90 రోజుల్లో అందుబాటులోకి సింగిల్ డ్యాష్‌బోర్డు! Kadapa Steel Plant: కడప స్టీల్ ప్లాంట్‌పై బాబు మార్క్ డెసిషన్... ఈ నెల నుంచే పనులు షురూ!! Chandrababu: రాయలసీమ ఇక ‘రాయల్’సీమ.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్! Atchennaidu: ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు కొత్త రికార్డు! సీఎం చంద్రబాబు ప్రశంసలు! Telangana: పలు కులాల పేర్లు మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం! కొత్త పేర్లను ఖరారు.. Tamil Nadu: తమిళ రాజకీయాల్లో సంచలన మలుపు.. NDA నుంచి బయటకు రావడానికి సిద్ధమైన AIADMK? New Airport: లేటెస్ట్ అప్డేట్... ఏపీలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్ ఈ జిల్లాలోనే..!! Chandrababu: ఏడవ జిల్లా కలెక్టర్ల సదస్సులో కీలక నిర్ణయం.. పావలా వడ్డీ విద్యా రుణాలకు సీఎం గ్రీన్ సిగ్నల్! Atchennaidu: ఖరీఫ్‌ రైతుకు అండగా ప్రభుత్వం.. విత్తనాలు, ఎరువులు, నీటితో పూర్తి సన్నద్ధత! TamilNadu Election 2026: తమిళనాడులో నవ శకం... మే 9న సీఎంగా 'దళపతి' విజయ్ ప్రమాణ స్వీకారం! Chandrababu: గంటల్లోనే ఫైళ్లు క్లియర్ కావాలి.. 90 రోజుల్లో అందుబాటులోకి సింగిల్ డ్యాష్‌బోర్డు! Kadapa Steel Plant: కడప స్టీల్ ప్లాంట్‌పై బాబు మార్క్ డెసిషన్... ఈ నెల నుంచే పనులు షురూ!! Chandrababu: రాయలసీమ ఇక ‘రాయల్’సీమ.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్! Atchennaidu: ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు కొత్త రికార్డు! సీఎం చంద్రబాబు ప్రశంసలు! Telangana: పలు కులాల పేర్లు మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం! కొత్త పేర్లను ఖరారు.. Tamil Nadu: తమిళ రాజకీయాల్లో సంచలన మలుపు.. NDA నుంచి బయటకు రావడానికి సిద్ధమైన AIADMK? New Airport: లేటెస్ట్ అప్డేట్... ఏపీలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్ ఈ జిల్లాలోనే..!!

Satya Kumar Yadav: కిడ్నీ రోగులకు ఊరటనిచ్చే వార్త.. రాష్ట్రంలో మరిన్ని డయాలసిస్ కేంద్రాలు!

Satya Kumar Yadav: రాష్ట్రంలో కిడ్నీ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా మరో 12 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

Published : 2026-05-08 19:42:00

కొత్తగా మరో 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు..

ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే 12 కేంద్రాలు ప్రారంభమయ్యాయి..

అమరావతి: రాష్ట్రంలో కిడ్నీ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా మరో 12 డయాలసిస్ (రక్త శుద్ధి) కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

ఈ కేంద్రాల నిర్వహణ బాధ్యతలను టెండర్ ద్వారా ఎంపిక చేసిన ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించనున్నారు. ఎంపికైన సంస్థ మూడు నెలల్లోపు సేవలను ప్రారంభించనుంది.

ప్రస్తుతం ‘ప్రైమ్ మినిస్టర్ నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్ (PMNDP)’ కింద రాష్ట్రంలోని జిల్లా, ప్రాంతీయ, సామాజిక ఆసుపత్రుల్లో 61 డయాలసిస్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. కొత్తగా ఏర్పడే 12 కేంద్రాలతో కలిపి మొత్తం 73 కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లి చికిత్స పొందాల్సిన రోగుల కష్టాలు గణనీయంగా తగ్గనున్నాయి. ముఖ్యంగా ఈ సేవలు పూర్తిగా ఉచితంగా అందించబడతాయి.

ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక్కో డయాలసిస్ సెషన్‌కు రూ.3,000 నుంచి రూ.4,000 వరకు ఖర్చవుతుండగా, నెలకు నాలుగైదు సార్లు చికిత్స అవసరమయ్యే రోగులకు ఇది భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కేంద్రాలు వారికి పెద్ద ఉపశమనంగా నిలుస్తున్నాయి.

గత వైసీపీ పాలన (2019–2024)లో 19 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే 12 కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు మరో 12 కేంద్రాలు ఏర్పాటు చేయడంతో, కేవలం 23 నెలల్లోనే మొత్తం 24 కొత్త కేంద్రాల ఏర్పాటు దిశగా ప్రభుత్వం ముందడుగు వేసినట్టవుతోంది.

ఈ కొత్త కేంద్రాలు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, చిత్తూరు జిల్లా పీలేరు, వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు, నెల్లూరు జిల్లా వెంకటగిరి, ప్రకాశం జిల్లా అద్దంకి, నంద్యాల జిల్లా సున్నిపెంట, తిరుపతి జిల్లా రైల్వే కోడూరు, ప్రకాశం జిల్లా కొండేపి, తూర్పు గోదావరి జిల్లా కోవూరు, కడప జిల్లా మైదుకూరు, ఎన్టీఆర్ జిల్లా నందిగామ, పల్నాడు జిల్లా వినుకొండ ప్రాంతాల్లో ఏర్పాటు కానున్నాయి.

ప్రతి కేంద్రంలో ఐదు డయాలసిస్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కేంద్రానికి సుమారు రూ.85 లక్షల విలువైన పరికరాలు సమకూర్చబడతాయి. ఈ కేంద్రాల ద్వారా సుమారు 1,500 మంది రోగులకు నేరుగా లాభం చేకూరుతుంది.

ఇదే కాకుండా, ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ కింద 186 అనుబంధ ఆసుపత్రుల్లో కూడా ఉచిత డయాలసిస్ సేవలు అందుతున్నాయి. పీఎంఎన్‌డీపీ మరియు ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ కలిపి ప్రతి ఏడాది సుమారు రూ.165 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.

ఈ నిర్ణయం కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆశాజ్యోతిగా మారింది. దీర్ఘకాలిక చికిత్స అవసరమైన రోగులకు ఈ కేంద్రాలు ప్రాణాధారంగా నిలుస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు.

Spotlight

Read More →