పోలవరం–నల్లమలసాగర్ లింక్ (Polavaram Nallamala Sagar) ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అభ్యంతరాలను సుప్రీంకోర్టు డిస్పోజ్ చేయడంపై ఏపీ నీటివనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన స్పష్టమైన వ్యాఖ్యలు చేస్తూ, ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదని మరోసారి తేల్చిచెప్పారు. గోదావరి నదిలో (Godavari flood waters) ప్రతి ఏడాది అపారమైన నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతున్న నేపథ్యంలో, ఆ నీటిలో కొంత భాగాన్ని వినియోగించుకోవడమే పోలవరం నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు లక్ష్యమని మంత్రి వివరించారు.
గోదావరిలో సముద్రంలో కలిసే దాదాపు 3 వేల టీఎంసీల నీటిలో కేవలం 200 టీఎంసీలను మాత్రమే వినియోగించుకుంటామని మొదటి నుంచే చెబుతున్నామని నిమ్మల గుర్తు చేశారు. ఈ నీరు వాడుకోకపోతే అది నేరుగా సముద్రంలోకి వెళ్లిపోతుందని, అలాంటి నీటిని వినియోగించుకోవడంలో ఎవరికీ నష్టం జరగదని ఆయన వ్యాఖ్యానించారు. అయినా కొందరు రాజకీయ కారణాలతో అనవసర అభ్యంతరాలు లేవనెత్తుతున్నారని విమర్శించారు.
గత ఐదేళ్లలో గోదావరి నుంచి ఏకంగా 1.53 లక్షల టీఎంసీల నీరు సముద్రంలో కలిసిందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది మాత్రమే 4,600 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి వెళ్లిందని చెప్పారు. ఇంత విస్తారమైన నీరు అందుబాటులో ఉన్నప్పుడు, దాన్ని వినియోగించుకునే ప్రాజెక్టులపై (AP irrigation projects) అభ్యంతరాలు పెట్టడం తగదని ఆయన అభిప్రాయపడ్డారు. వరద సమయంలో పోలవరం ప్రాంతంలో వచ్చే నీటిని ఉపయోగించుకోకపోతే, మొత్తం నీరు సముద్రంపాలవుతుందని స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు గోదావరిలో పుష్కలంగా నీరు ఉందన్న కారణంతో ఆంధ్రప్రదేశ్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని నిమ్మల రామానాయుడు గుర్తు చేశారు. అదే విధంగా పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుకూ అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా,T(elangana water dispute) రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగపడే ప్రాజెక్టు అని చెప్పారు.
రెండు తెలుగు రాష్ట్రాలు సోదరభావంతో కలిసి అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్ష అని మంత్రి పేర్కొన్నారు. నీటి విషయంలో రాజకీయాలు చేయకుండా, వాస్తవాలు అర్థం చేసుకుని ముందుకు సాగితే ఇరు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని అన్నారు. సుప్రీంకోర్టు తెలంగాణ అభ్యంతరాలను డిస్పోజ్ చేయడం కూడా ఈ ప్రాజెక్టుపై స్పష్టత తీసుకొచ్చిందని, ఇకనైనా అనవసర వివాదాలకు తావు లేకుండా అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని (Nimmala Ramanaidu) నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు.