ఆఫీసుల్లో పనిచేసే సిబ్బంది సంక్షేమమే సంస్థకు బలమైన పునాది అని చాలామంది నమ్ముతారు. పండుగల సందర్భాల్లో ఉద్యోగుల ముఖాల్లో చిరునవ్వు నింపేలా కానుకలు అందజేస్తుంటారు. ఆ దిశగా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక ఆత్మీయ కార్యక్రమం జరిగింది.
గురువారం, జనవరి 8, 2026న NRI TDP సెల్ ఆధ్వర్యంలో NRI TDP సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు, గన్నవరం నివాసి మరియు సేవా సంస్థ అయిన PRK ఫౌండేషన్ ఛైర్మన్ పారా రామకృష్ణ సహకారంతో పార్టీ కేంద్ర కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బందికి పలువురు నేతల చేతుల మీదుగా నూతన వస్త్రాలను బాహుకరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర కార్యాలయ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, టీడీపీ లీగల్ సెల్ సెక్రెటరీ పారా కిశోర్, ఎన్నారై టీడీపీ సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్, తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీ కృష్ణ, తడితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారు సిబ్బందిని ఆత్మీయంగా పలకరిస్తూ, పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
పండుగ వేళ సిబ్బంది కుటుంబాలతో ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో ఈ కానుకలను అందజేసినట్లు పారా రామకృష్ణ మరియు పరుచూరి అశోక్ బాబు తెలిపారు. ఉద్యోగుల శ్రమకు గౌరవం చెల్లించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా నిలిచింది.
అదేవిధంగా గత వారం నూతన సంవత్సరం సందర్భంగా ఇంట్లో రోజువారీగా ఉపయోగించే సరుకులను మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అందించడం జరిగింది.