Chandrababu: నిడదవోలులో బాబు నిరసన గళం.. మహిళా బిల్లుపై విపక్షాల తీరుకు వ్యతిరేకంగా ర్యాలీ! Prakash Raj: ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై ఆగ్రహం.. నోటీసులు జారీ చేసిన న్యాయవాదులు! Dwacra Womens: డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. 72 గంటల్లోనే లోన్! AP Speaker: హరివంశ్ నిబద్ధతకు ఈ ఎన్నిక ఒక నిదర్శనం.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు! Automatic Toll Gates: విజయవాడ ట్రాఫిక్ కష్టాలకు చెక్... ఆటోమేటిక్ టోల్ గేట్లు! ప్రయాణికులకు భారీ ఊరట.... Kollu Ravindra: ఎక్సైజ్ శాఖపై మంత్రి సమీక్ష... కల్తీ జరిగితే కఠిన చర్యలు- కొల్లు రవీంద్ర! Chintamaneni Prabhakar: ఇది కదా ప్రజా నాయకత్వం.. వృద్ధుడిని సొంత కారులో ఇంటికి చేర్చిన చింతమనేని! Land Pooling: రాజధాని రైతులకు చంద్రబాబు వరాల జల్లు.. రెండో విడత భూ సమీకరణ...! మరో పదేళ్ల పాటు.. CBN Birthday Celebrations: చంద్రబాబు జన్మదిన వేడుకలకు ముస్తాబవుతున్న ఆత్మకూరు! Praja Vedika: నేడు (18/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Chandrababu: నిడదవోలులో బాబు నిరసన గళం.. మహిళా బిల్లుపై విపక్షాల తీరుకు వ్యతిరేకంగా ర్యాలీ! Prakash Raj: ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై ఆగ్రహం.. నోటీసులు జారీ చేసిన న్యాయవాదులు! Dwacra Womens: డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. 72 గంటల్లోనే లోన్! AP Speaker: హరివంశ్ నిబద్ధతకు ఈ ఎన్నిక ఒక నిదర్శనం.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు! Automatic Toll Gates: విజయవాడ ట్రాఫిక్ కష్టాలకు చెక్... ఆటోమేటిక్ టోల్ గేట్లు! ప్రయాణికులకు భారీ ఊరట.... Kollu Ravindra: ఎక్సైజ్ శాఖపై మంత్రి సమీక్ష... కల్తీ జరిగితే కఠిన చర్యలు- కొల్లు రవీంద్ర! Chintamaneni Prabhakar: ఇది కదా ప్రజా నాయకత్వం.. వృద్ధుడిని సొంత కారులో ఇంటికి చేర్చిన చింతమనేని! Land Pooling: రాజధాని రైతులకు చంద్రబాబు వరాల జల్లు.. రెండో విడత భూ సమీకరణ...! మరో పదేళ్ల పాటు.. CBN Birthday Celebrations: చంద్రబాబు జన్మదిన వేడుకలకు ముస్తాబవుతున్న ఆత్మకూరు! Praja Vedika: నేడు (18/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

LiquorScam: మద్యం కుంభకోణంలో అవినాష్‌రెడ్డి అరెస్ట్...! రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు!

LiquorScam: మద్యం కుంభకోణం కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు సంస్థలు సిద్ధం చేసిన రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు బయటపడినట్లు సమాచారం. ఈ కుంభకోణంలో నిధుల మళ్లింపు, కీలక వ్యక్తులతో జరిగిన లావాదేవీలు మరియు క్విడ్ ప్రో కో (Quid Pro Quo) పద్ధతిలో జరిగిన ఒప్పందాల గురించి దర్యాప్తు అధికారులు రిపోర్టులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

Published : 2026-02-26 18:46:00

అవినాష్‌రెడ్డి అరెస్ట్ వెనుక ఉన్న అసలు సీక్రెట్స్ ఇవే…

రిమాండ్ రిపోర్టులో దిమ్మతిరిగే నిజాలు…

మద్యం మత్తులో అవినీతి తిమింగలాలు…

LiquorScam: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ స్కామ్‌లో ప్రధాన పాత్రధారిగా భావిస్తున్న ముప్పిడి అవినాష్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో అవినాష్‌రెడ్డి సాగించిన అక్రమాల చిట్టాను ఏసీబీ అధికారులు బయటపెట్టారు. ఏ-1 నిందితుడు కేసీరెడ్డితో కలిసి వందల కోట్ల రూపాయల లావాదేవీలు నడిపినట్లు అధికారులు గుర్తించారు.

మద్యం నడిపించడంలో అవినాష్‌రెడ్డి ప్రధాన వ్యూహకర్తగా వ్యవహరించారని రిపోర్టు పేర్కొంది. కేవలం ప్లాన్ చేయడమే కాకుండా, ఆర్థిక లావాదేవీలన్నీ ఆయన పర్యవేక్షణలోనే జరిగినట్లు తేలింది. మద్యం వ్యాపారుల నుంచి కిక్‌బ్యాక్‌లు, కమీషన్ల రూపంలో భారీగా లబ్ధి పొందారని, ఈ నేరపూరిత సొమ్మును ఇతర ప్రాంతాలకు మళ్లించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఐపీసీ సెక్షన్లు 409, 420, 384తో పాటు అవినీతి నిరోధక చట్టం కింద ఆయనపై కేసులు నమోదు చేశారు.

మద్యం మార్కెట్లో  ఆధిపత్యం కోసం అవినాష్‌రెడ్డి వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని రిమాండ్ రిపోర్టులో వివరించారు. ప్రజలకు అలవాటైన పాత, పాపులర్ బ్రాండ్లను కావాలనే మార్కెట్ నుంచి మాయం చేసి, కేవలం తమకు ముడుపులు చెల్లించే కొత్త బ్రాండ్లకు మాత్రమే 'ఆర్డర్ ఫర్ సప్లై' దక్కేలా చక్రం తిప్పారు. ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా అమ్మకాలను సైతం తన గుప్పిట్లోకి తెచ్చుకుని, సిండికేట్ చెప్పినట్లే వ్యాపారం జరిగేలా ఒత్తిడి తెచ్చినట్లు ఆధారాలు లభించాయి.

అక్రమాలకు అడ్డురాకూడదనే ఉద్దేశంతో, అప్పటి వరకు పారదర్శకంగా ఉన్న 'ఆటోమేటెడ్ ప్రొక్యూర్‌మెంట్ సిస్టమ్'ను అవినాష్‌రెడ్డి రద్దు చేయించినట్లు అధికారులు తెలిపారు. దాని స్థానంలో కావాలనే 'మాన్యువల్ ప్రాసెస్'ను ప్రవేశపెట్టారు. దీనివల్ల ఎవరికి ఆర్డర్లు ఇవ్వాలి, ఎంత కోటా కేటాయించాలి అనే అంశాల్లో మానిప్యులేషన్లకు అవకాశం ఏర్పడింది. ఈ లొసుగులను వాడుకుని డిస్టిలరీల నుంచి సుమారు 3,500 కోట్ల రూపాయలను కిక్‌బ్యాక్‌ల రూపంలో వసూలు చేసినట్లు రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారు.
 

Spotlight

Read More →