Indian Parliament: ఎన్నికల్లో మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదు.. విపక్ష పార్టీలకు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్.! India & Pakistan: పాక్ వ్యాఖ్యలు అర్థరహితం.. డీలిమిటేషన్ బిల్లుపై దాయాది దేశానికి భారత్ స్ట్రాంగ్ వార్నింగ్! Rahul Gandhi: రాహుల్ గాంధీకి హైకోర్టు షాక్.. హైకోర్టు తీర్పుతో ఒక్కసారిగా - బ్రిటన్ కంపెనీ రికార్డులే కీలకం! Reservation Bill: మహిళా బిల్లు vs డీలిమిటేషన్.. కాంగ్రెస్ ప్రశ్నలకు అమిత్ షా ధీటైన సమాధానం! Indian Parliament: భారత దేశ అపూర్వ ఘట్టం... మహిళలను నిరాశపరిచిన పార్లమెంట్ - మిగతా రెండు బిల్లులను.? AP Politics: సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టుల కేసు! ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..! Praja Vedika: రేపు (18/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! State Election Commissioner: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ పునేఠా నియామకం! Ramanarayana Reddy: పెంచలకోనలో మంత్రి ఆనం సందడి.. ఎమ్మెల్యే రామకృష్ణతో కలిసి పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం.! Women Reservation Bill: 2029 తర్వాత చట్టసభల్లో మహిళల రాజ్యమే.... కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ వెల్లడి! Indian Parliament: ఎన్నికల్లో మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదు.. విపక్ష పార్టీలకు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్.! India & Pakistan: పాక్ వ్యాఖ్యలు అర్థరహితం.. డీలిమిటేషన్ బిల్లుపై దాయాది దేశానికి భారత్ స్ట్రాంగ్ వార్నింగ్! Rahul Gandhi: రాహుల్ గాంధీకి హైకోర్టు షాక్.. హైకోర్టు తీర్పుతో ఒక్కసారిగా - బ్రిటన్ కంపెనీ రికార్డులే కీలకం! Reservation Bill: మహిళా బిల్లు vs డీలిమిటేషన్.. కాంగ్రెస్ ప్రశ్నలకు అమిత్ షా ధీటైన సమాధానం! Indian Parliament: భారత దేశ అపూర్వ ఘట్టం... మహిళలను నిరాశపరిచిన పార్లమెంట్ - మిగతా రెండు బిల్లులను.? AP Politics: సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టుల కేసు! ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..! Praja Vedika: రేపు (18/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! State Election Commissioner: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ పునేఠా నియామకం! Ramanarayana Reddy: పెంచలకోనలో మంత్రి ఆనం సందడి.. ఎమ్మెల్యే రామకృష్ణతో కలిసి పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం.! Women Reservation Bill: 2029 తర్వాత చట్టసభల్లో మహిళల రాజ్యమే.... కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ వెల్లడి!

Indian Parliament: ఎన్నికల్లో మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదు.. విపక్ష పార్టీలకు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్.!

Indian Parliament: మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భవిష్యత్ ఎన్నికల్లో మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని, వారి ఉసురు మీకు తగులుతుందని హెచ్చరించారు. బిల్లును తిరస్కరించడం మహిళలను అవమానించడమేనని ఆయన మండిపడ్డారు. బిల్లు వీగిపోయిన అనంతరం గెలిచామంటూ నినాదాలు చేయడం అత్యంత హేయమైన చర్య అని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 2026-04-17 22:03:00
  • మెజారిటీ ఉన్నా అందని లక్ష్యం: రాజ్యాంగ సవరణ అడ్డంకితో మహిళా బిల్లుకు బ్రేక్!
     
  • Politics: "దేశ చరిత్రలో ఇది చీకటి రోజు": మహిళా రిజర్వేషన్ల అడ్డంకిపై అమిత్ షా ధ్వజం..

Indian Parliament: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన పరిణామంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం కల్పించే ఈ చారిత్రక బిల్లును అడ్డుకోవడం ద్వారా విపక్షాలు కోట్లాదిమంది మహిళల ఆకాంక్షలను కాలరాశాయని ఆయన మండిపడ్డారు. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని, వారి ఉసురు ప్రతిపక్షాలకు తగులుతుందని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ముఖ్యంగా బిల్లు తిరస్కరణకు గురైన తర్వాత విపక్ష సభ్యులు సభలో నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకోవడం అత్యంత హేయమైన చర్య అని, ఇది భారతీయ మహిళలను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ కీలక రాజ్యాంగ సవరణ బిల్లుపై జరిగిన ఓటింగ్ వివరాలను పరిశీలిస్తే, సభలో మొత్తం 528 మంది సభ్యులు హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బిల్లుకు మద్దతుగా 298 ఓట్లు పోలవగా, 230 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. సాధారణ మెజారిటీ లభించినప్పటికీ, రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండొంతుల (2/3) ప్రత్యేక మెజారిటీ మార్కును అందుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా సభలో ఉన్న సమయంలోనే ఈ కీలక బిల్లు వీగిపోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

అనంతరం ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా స్పందించిన అమిత్ షా, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే మరియు సమాజ్‌వాదీ పార్టీల తీరును ఎండగట్టారు. ఈ పార్టీలన్నీ మహిళా వ్యతిరేక వైఖరిని అవలంబిస్తూ అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తూ ఉత్తర మరియు దక్షిణ రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణ రాష్ట్రాలకు ఎటువంటి అన్యాయం జరగదని, భౌగోళిక సమతుల్యతను దెబ్బతీయకుండానే ప్రక్రియ సాగుతుందని హామీ ఇచ్చారు.

Spotlight

Read More →