Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం షాక్..! గ్యాస్ కనెక్షన్లపై కొత్త నిబంధనలు...! AP Job Calendar: నిరుద్యోగులకు ఉగాది కానుక... ఏపీ జాబ్ క్యాలెండర్ పూర్తి వివరాలివే! Gas Shortage: గ్యాస్ కొరతకు చెక్.. ఎలక్ట్రిక్ స్టవ్ సబ్సిడీపై..! తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం! Railway Station: ఆ నాలుగు రైల్వే స్టేషన్లకు మహార్దశ! రూ.40 కోట్లతో... ఎయిర్పోర్ట్ రేంజ్ లో కొత్త లుక్! YSRCP: మడకశిర వైసీపీలో ముదిరిన వర్గ పోరు..! నడిరోడ్డుపైనే నాయకుల భౌతిక దాడులు! Free Gas Cylinder: ఉచిత గ్యాస్ సిలిండర్లపై సీఎం చంద్రబాబు సమీక్ష! అధికారులకు కీలక ఆదేశాలు! Statue Of Sacrifice: రాజధానిలో సరికొత్త రికార్డు! 6 నెలల్లో 58 అడుగుల కాంస్య విగ్రహం... ఆవిష్కరణకు సర్వం సిద్ధం! Praja Vedika: నేడు (14/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Smart Family Cards: ఏపీలో స్మార్ట్ ఫ్యామిలీ కార్డుల పంపిణీ... ఎప్పటినుండంటే! JanaSena FormationDay: గిరిజన గడ్డపై జనసేన ఆవిర్భావ వేడుకలు! అల్లూరి జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్! Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం షాక్..! గ్యాస్ కనెక్షన్లపై కొత్త నిబంధనలు...! AP Job Calendar: నిరుద్యోగులకు ఉగాది కానుక... ఏపీ జాబ్ క్యాలెండర్ పూర్తి వివరాలివే! Gas Shortage: గ్యాస్ కొరతకు చెక్.. ఎలక్ట్రిక్ స్టవ్ సబ్సిడీపై..! తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం! Railway Station: ఆ నాలుగు రైల్వే స్టేషన్లకు మహార్దశ! రూ.40 కోట్లతో... ఎయిర్పోర్ట్ రేంజ్ లో కొత్త లుక్! YSRCP: మడకశిర వైసీపీలో ముదిరిన వర్గ పోరు..! నడిరోడ్డుపైనే నాయకుల భౌతిక దాడులు! Free Gas Cylinder: ఉచిత గ్యాస్ సిలిండర్లపై సీఎం చంద్రబాబు సమీక్ష! అధికారులకు కీలక ఆదేశాలు! Statue Of Sacrifice: రాజధానిలో సరికొత్త రికార్డు! 6 నెలల్లో 58 అడుగుల కాంస్య విగ్రహం... ఆవిష్కరణకు సర్వం సిద్ధం! Praja Vedika: నేడు (14/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Smart Family Cards: ఏపీలో స్మార్ట్ ఫ్యామిలీ కార్డుల పంపిణీ... ఎప్పటినుండంటే! JanaSena FormationDay: గిరిజన గడ్డపై జనసేన ఆవిర్భావ వేడుకలు! అల్లూరి జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్!

Nara Lokesh: ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే.. సవరణ బిల్లును ప్రతిపాదించిన మంత్రి లోకేష్!

Nara Lokesh: పల్నాడులో బీసీ నాయకుడు తోట చంద్రయ్యను అతి కిరాతకంగా హతమార్చిన ఆనాటి విజువల్స్ ఏపీలోనే కాదు, భారతదేశంలోని చాలామంది ప్రజలు చూశారు. వీడియో రికార్డు కూడా ఉంది. అటువంటి చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మేము నిర్ణయించాం.

Published : 2026-03-04 13:10:00
  • 2004లో వైఎస్ సీఎం అయ్యాక రాష్ట్రంలో మారణహోమం..
     
  • తోట చంద్రయ్య కుటుంబానికి న్యాయం చేసేందుకే బిల్లు..

Nara Lokesh: పల్నాడులో బీసీ నాయకుడు తోట చంద్రయ్యను అతి కిరాతకంగా హతమార్చిన ఆనాటి విజువల్స్ ఏపీలోనే కాదు, భారతదేశంలోని చాలామంది ప్రజలు చూశారు. వీడియో రికార్డు కూడా ఉంది. అటువంటి చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మేము నిర్ణయించాం. ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకే ఈ బిల్లు తెస్తున్నామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏపీ పబ్లిక్ సర్వీసు నియామకాల సవరణ బిల్లును మంత్రి లోకేష్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... ఈ విషయమై కేవలం టీడీపీలోనే కాకుండా కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులతో కూడా చర్చించాం. 

కేబినెట్ లో కూడా పవనన్నతో మాట్లాడితే ఆయన ఇది మంచి నిర్ణయమని అన్నారు. ఫ్యాక్షన్ లో చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తే, వారి జోలికిరావడానికి ప్రత్యర్థులు భయపడతారని భావించి కేబినెట్ లో చర్చించి ఈ బిల్లు తీసుకువచ్చాం. కేబినెట్ ఆమోదం తెలిపింది. శాసనసభకు తీసుకువచ్చాం. 2025 సెప్టెంబర్ లో ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బీసీ బిడ్డకు ఉద్యోగం ఇవ్వాలని మేం కౌన్సిల్ కు బిల్లు పంపిస్తే కావాలని అక్కడ ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. బిల్లును వారు మండలిలో తిరస్కరించినా, నిబంధనలకు లోబడి మేం అసెంబ్లీలో పాస్ చేస్తామని చెప్పాం. కానీ, బిల్లుపై ఏ నిర్ణయం తీసుకోకుండా అక్కడ తొక్కిపట్టారు. దీంతో ఒక బాధ్యతగా భావించి మళ్లీ ఈ బిల్లు శాసనసభకు తీసుకొచ్చాం, దీనిని ఎవరూ ఆపలేరు. దీనిపై ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒక్క తోట చంద్రయ్య కుటుంబానికే కాదు, ఏపీలో ఏ కుటుంబానికి ఈ విధంగా అన్యాయం జరగకూడదన్నదే మా లక్ష్యం. ఇది ఒక ఫేవర్, చారిటీ కాదు. ఇది మనందరి బాధ్యత. ఫ్యాక్షన్ కి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇలాంటి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అందుకే ఈ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించాల్సిందిగా మంత్రి లోకేష్ సహచర శాసన సభ్యులకు విజ్ఞప్తి చేశారు.

ఏ పార్టీకి చెందిన వారైనా ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫ్యాక్షన్ అంటే రాజకీయ హత్యలు. ఒక కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీసి, పెద్దదిక్కు లేకుండా చేసి యావత్ కుటుంబాలను రోడ్డుపైకి తేవడమే ఫ్యాక్షనిస్టుల ప్రధాన లక్ష్యం. 2019-24 నడుమ కూడా ఫ్యాక్షన్ దాడులు పెద్దఎత్తున కొనసాగాయి. బలహీనవర్గాలకు చెందిన బీసీ నాయకుడు, నమ్ముకున్న సిద్ధాంతం కోసం పోరాడిన తోట చంద్రయ్యను 2022 జనవరి 12న నడివీధిలో మెడపై కత్తితో నరికి దారుణంగా హతమార్చారు. హత్యచేసే సమయంలో వారి నాయకుడికి జై కొడితే వదిలేస్తామని ఒత్తిడి తెస్తే... నేను చచ్చిపోయినా ఫర్వాలేదు, పసుపుజెండా వదలనని చెప్పిన వ్యక్తి తోట చంద్రయ్య. ఆనాడు జై చంద్రబాబు, జై తెలుగుదేశం అన్నందుకు అతి కిరాతకం చంపేశారని మంత్రి లోకేష్ ఆవేదన వ్యక్తంచేశారు.

అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యక నేను 1983లో జన్మించా. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి నేను రాజకీయాలను క్లోజ్ గా గమనిస్తూ వచ్చా. అంతకుముందు ఫ్యాక్టన్ రాజకీయాలకు ఏపీ కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. 1995లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఏ పార్టీ అని చూడకుండా ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలనే లక్ష్యంతో ఆనాడు యుద్ధం ప్రకటించారు. ఒక పక్క ఫ్యాక్షనిజం, మరోపక్క నక్సలిజంపై పోరాడారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మొదటి రెండు సంవత్సరాల్లో 164మంది టీడీపీ కార్యకర్తలను అతిదారుణంగా, కిరాతకంగా చంపేశారు. ప్రత్యేకంగా ఉమ్మడి అనంతపురంలో ఈ మారణాకాండ ఎక్కువగా జరిగింది. 

మా నాయకులు ఒకరువెళ్లి హత్యజరిగిన కుటుంబాన్ని పరామర్శించే లోపు మరో కుటుంబంలో హత్య జరిగిందని కబురు వచ్చేది.. అలా ఆనాడు హత్యల పరంపర కొనసాగింది. ఫ్యాక్షన్ బాధిత కుటుంబాలు మళ్లీ ఆ మార్గంలో వెళ్లకూడదనే ఉద్దేశంతో, వారి పిల్లల కోసం చంద్రబాబు గారు హైదరాబాద్ లో ఎన్టీఆర్ మోడల్ స్కూలు ఏర్పాటుచేశారు. ఆ పిల్లలను సొంత పిల్లల మాదిరి ప్రత్యేక శ్రద్ధతో చదివించారు, మాకు కూడా అంత సమయం ఇవ్వలేదు. ఫ్యాక్షన్ దాడుల్లో చనిపోయిన వారి పిల్లలను పరామర్శించేందుకు నెలకు ఒకసారి స్కూలుకు వెళ్లి వారి బాగోగులు చూసుకునే వారు. వారికి కౌన్సిలింగ్ చేసి మీరు ఫ్యాక్షన్ లోకి వెళ్లవద్దని హితవు పలికారు. ఇటువంటి ప్రయత్నం భారతదేశంలో ఏ రాజకీయపార్టీ చేయలేదు, కేవలం ఒక తెలుగుదేశం మాత్రమే బాధ్యతగా ముందుకు తీసుకెళ్లిందని మంత్రి లోకేష్ చెప్పారు.

Spotlight

Read More →