అమరావతిలో 'క్వొంటం' విప్లవం: 40 ఏళ్ల భవిష్యత్తుకు నేడే శంకుస్థాపన.. బిల్ గేట్స్ రాకతో కొత్త దశ! కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం... భారత్ దెబ్బకు పాకిస్థాన్ అతలాకుతలం! యువత భవిష్యత్తుకు 'గేమ్ చేంజర్' క్వాంటం వ్యాలీ.. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి! భారత్‌కు అమెరికా బిగ్ రిలీఫ్..! అదనపు టారిఫ్ కట్.. ట్రేడ్‌లో కొత్త చాప్టర్! ఏపీలో కొత్తగా 10 బీసీ గురుకులాలు... సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్! చిన్నారుల డిజిటల్ భద్రతపై కేంద్రం ఫోకస్…! సోషల్ మీడియాకు వయో పరిమితులు! ఏపీలో మున్సిపల్ వ్యవస్థలో భారీ మార్పులు..! పలువురు కమిషనర్ల బదిలీ..! ఈ రోజు జరగబోయేది కేవలం ఒక భూమి పూజ మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్ గమనాన్ని మార్చే ఒక మహా అద్భుతం! India US Trade Deal: రష్యాకు చెక్.. భారత్‌కు ట్యాక్స్ ఊరట.. ట్రంప్ సంచలన నిర్ణయం వెనుక అసలు కథ ఇదే! ఆకాశమే హద్దుగా... అమరావతిలో ఐకానిక్ టవర్ల నిర్మాణంలో వేగం! అమరావతిలో 'క్వొంటం' విప్లవం: 40 ఏళ్ల భవిష్యత్తుకు నేడే శంకుస్థాపన.. బిల్ గేట్స్ రాకతో కొత్త దశ! కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం... భారత్ దెబ్బకు పాకిస్థాన్ అతలాకుతలం! యువత భవిష్యత్తుకు 'గేమ్ చేంజర్' క్వాంటం వ్యాలీ.. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి! భారత్‌కు అమెరికా బిగ్ రిలీఫ్..! అదనపు టారిఫ్ కట్.. ట్రేడ్‌లో కొత్త చాప్టర్! ఏపీలో కొత్తగా 10 బీసీ గురుకులాలు... సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్! చిన్నారుల డిజిటల్ భద్రతపై కేంద్రం ఫోకస్…! సోషల్ మీడియాకు వయో పరిమితులు! ఏపీలో మున్సిపల్ వ్యవస్థలో భారీ మార్పులు..! పలువురు కమిషనర్ల బదిలీ..! ఈ రోజు జరగబోయేది కేవలం ఒక భూమి పూజ మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్ గమనాన్ని మార్చే ఒక మహా అద్భుతం! India US Trade Deal: రష్యాకు చెక్.. భారత్‌కు ట్యాక్స్ ఊరట.. ట్రంప్ సంచలన నిర్ణయం వెనుక అసలు కథ ఇదే! ఆకాశమే హద్దుగా... అమరావతిలో ఐకానిక్ టవర్ల నిర్మాణంలో వేగం!

చిన్నారుల డిజిటల్ భద్రతపై కేంద్రం ఫోకస్…! సోషల్ మీడియాకు వయో పరిమితులు!

చిన్నారుల డిజిటల్ భద్రతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమింగ్ వల్ల పెరుగుతున్న వ్యసనాన్ని అరికట్టేందుకు వయో పరిమితులు విధించే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది.

Published : 2026-02-07 08:47:00

చిన్నారులను డిజిటల్ వ్యసనం నుంచి కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమింగ్ వల్ల పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటోందన్న ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో పరిశీలిస్తోంది. ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో చేసిన కీలక సూచనలను కేంద్రం సీరియస్‌గా అధ్యయనం చేస్తోందని కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఐసీఏఎన్ఎన్ (ICANN) సదస్సులో ఆయన ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు.

ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగానికి సంబంధించి వయో పరిమితులు విధించే అంశంపై ప్రభుత్వం విస్తృతంగా కసరత్తు చేస్తోంది. ఆస్ట్రేలియా వంటి దేశాలు ఇప్పటికే పిల్లల కోసం కఠిన వయో నిబంధనలు అమలు చేస్తున్నాయని అధికారులు గుర్తు చేస్తున్నారు. అదే తరహాలో భారత్‌లోనూ సోషల్ మీడియా అకౌంట్లు తెరవాలంటే వయసు ధ్రువీకరణ తప్పనిసరి చేసే విధానాన్ని అమలు చేసే అవకాశముందని సమాచారం. ఈ బాధ్యతను నేరుగా సోషల్ మీడియా కంపెనీలకే అప్పగించాలనే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. అలా చేస్తే తప్పుడు వయసు వివరాలతో అకౌంట్లు తెరవడాన్ని అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం, హానికరమైన కంటెంట్ వల్ల పిల్లలు మానసికంగా అస్థిరంగా మారుతున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఘజియాబాద్‌లో చోటుచేసుకున్న ఘటనలు డిజిటల్ వ్యసనం ఎంత ప్రమాదకరంగా మారుతోందో స్పష్టంగా చూపిస్తున్నాయని వారు చెబుతున్నారు. చదువు, కుటుంబంతో గడిపే సమయం తగ్గిపోవడం, ఒత్తిడి, ఒంటరితనం వంటి సమస్యలు పిల్లల్లో పెరుగుతున్నాయని హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లపై ప్రభుత్వ నియంత్రణ తప్పనిసరి అనే అభిప్రాయం బలపడుతోంది.

ఇదే క్రమంలో ఆర్థిక సర్వే కీలక సిఫార్సులు చేసింది. ఆన్‌లైన్ టీచింగ్‌పై పూర్తిగా ఆధారపడకుండా, పిల్లలకు సులభమైన, మానసిక ఒత్తిడి లేని విద్యా పరికరాలు అందించాలని సూచించింది. పిల్లల అభివృద్ధిలో స్క్రీన్ టైమ్ తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, గోవా వంటి రాష్ట్రాలు కూడా సొంతంగా వయో పరిమితి నిబంధనలు తీసుకువచ్చే ఆలోచనలో ఉండటం విశేషం. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి. అనంత నాగేశ్వరన్ కూడా డిజిటల్ ప్రపంచంలో పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కేంద్రం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా పిల్లల డిజిటల్ భద్రతకు కీలకంగా మారనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Spotlight

Read More →