వేసవి దృష్ట్యా తగిన ఏర్పాట్లు చేయాలి : ముఖేష్ కుమార్ మీనా
ఎన్నికల స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఏలూరు బ్యూరో ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏలూరు జిల్లాలో స్ట్రాంగ్ రూమ్ లు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటుకు గాను ఎంపిక చేసిన ఏలూరు సి ఆర్ ఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలను శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సందర్శించారు. ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, చింతలపూడి, పోలవరం, నూజివీడు, కైకలూరు అసెంబ్లీ నియోజక వర్గాల కౌంటింగ్ ఒకే ఆవరణలో ఉన్నందున ఆయా నియోజక వర్గాల ఓట్ల కౌంటింగ్ కు వేరు, వేరు సముదాయాలలో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి, సంబంధిత లేఔట్ ను సీఈఓ ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇందుకు సంబందించిన వివరాలను జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ సీఈవో కి వివరించారు. ఓట్ల లెక్కింపు సమయంలో తీసుకోవలసిన భద్రతకు సంబంధించి జిల్లా ఎస్పీ డి. మేరీ ప్రశాంతి ,ఇతర పోలీసు అధికారులకు సీఈఓ సూచనలు చేశారు. తొలుత పోలింగ్ పూర్తయిన తరువాత వచ్చే ఈవీఎం, ఇతర స్టాట్యూటరీ సామాగ్రిని స్వీకరించేందుకు రిసప్షన్ కేంద్రాల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకుని, త్రాగునీరు, టెంట్లు వంటివి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్ లు, కౌంటింగ్ కేంద్రాలను వారు పరిశీలించారు. వీరి వెంట జాయింట్ కలెక్టర్ బి. లావణ్య వేణి, ఐ టి డి ఏ పీఓ ఎం. సూర్యతేజ, అసిస్టెంట్ కలెక్టర్ టి. శ్రీపూజ, డిఆర్ఓ డి. పుష్పమణి, ఆర్డీఓ ఎన్ . ఎస్.కె. ఖాజావలి, వై. భవాని శంకరి ,కె. అద్ధయ్య, ఎస్డీసీలు ఎం. ముక్కంటి, కె. భాస్కర్, కలెక్టరేట్ ఏ వో కె.కాశీ విశ్వేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
ఆదివారం ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే దరిద్రాన్ని మీరే స్వాగతిస్తున్నట్లు!!
పార్టీ కోసం రూ.10 కోట్లు విరాళం!! సముచిత స్థానం కల్పించే బాధ్యత నాది!! - పవన్ కల్యాణ్
జగన్ 100% మేనిఫెస్టో అమలు చేస్తే వందమంది ఎమ్మెల్యేలను ఎందుకు మారుస్తున్నాడు? ఆంధ్రుడా ఆలోచించు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు.. కూటమి నుంచి పోటీ ..
యూఏఈ: ఈ దేశాల పౌరులకు శుభవార్త! వీసా ఆన్ అరైవల్!
షర్మిల, సునీతపై పోస్టులు!! వైసీపీ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి ఫిర్యాదు!!
పోలీసులతో కొట్టించిన జగన్ రెడ్డికి నేడు వాళ్లే దిక్కు !! అనిత ఘాటు వ్యాఖ్యలు!!
తొందరలోనే వారిమీద పరువునష్టం దావా వేస్తా!! లావు శ్రీకృష్ణదేవరాయలు
జగన్ సిద్దం అంటే మేం యుద్దం!!పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!!
అభ్యర్థుల ఎంపికలో పవన్ కళ్యాణ్ నిర్ణయమే అంతిమం!! అతిక్రమిస్తే చర్యలే!! నాగబాబు
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి