జగన్ కు రాబోయే ఎన్నికలలో ఓటమి భయం పట్టుకుంది.
బైబిల్ భగవద్గీత కురానగా భావించి మేనిఫెస్టోను నూటికి నూరు శాతం అమలు చేసిన ఘనత వైసిపి పార్టీని గొప్పలు చెప్పుకుంటున్నారు.
100% మేనిఫెస్టో అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి 100 మంది ఎమ్మెల్యేలను ఎందుకు మార్చుతున్నారో చెప్పాలి.
ప్రస్తుతం ఉన్న 151 మంది ఎమ్మెల్యేలలో నూటికి నూరు శాతం ఎస్సీ, ఎస్టీ బీసీ ఎమ్మెల్యేలను మాత్రమే మార్చడంలోని ఈయన ఆంతర్యం చెప్పాలి.
బయట పడుతున్న కేశినేని నాని అక్రమాలు!! మీడియా ముందుకు బాధితులు???
దేశంలోనే ఆంధ్రప్రదేశ్ సామాజిక న్యాయం పాటిస్తుందని అన్ని బహిరంగ సభలలో ఈయన గొంతేత్తి అరుస్తున్నారు.
ఆర్థికంగా స్థితి మంతులైన ఎస్సీ, బీసీలను పక్క నియోజకవర్గాలకు మారుస్తూ ఆర్థికంగా బలహీనమైన వారికి ఎమ్మెల్యే టికెట్లు లేవని ఇంటికి సాగనంపుతున్నారు.
రాష్ట్రంలో ఈయన పాలనలో ఎస్సీ , బీసీ వర్గాలకు జరిగినంత అన్యాయం మరి ప్రభుత్వంలోనూ జరగలేదు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల సంఘాల నాయకులను నోరత్తకుండా కట్టడి చేయడంలో ఈయన విజయం సాధించారని చెప్పవచ్చు.
అనంతపురం: పోలీసుల ఓవర్ యాక్షన్ కు చెక్!! ఎస్పీ ప్రకటన??
ఈయన ఐదేళ్ల పాలనలో 3600 మంది దళితులు ఊచకోతకు గురయ్యారు.
బీసీలపై జరిగినన్ని దాడులు అన్ని ఇన్ని కాదు.
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని ఈయన రద్దు చేసిన దళిత సంఘాలు నోరెత్తలేదు.
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అంబేద్కర్ విదేశీ విద్య పేరును జగనన్న విదేశీ విద్య అని మళ్లీ ప్రవేశపెట్టిన అంబేద్కర్ పేరు మార్పుపై దళిత నాయకులు మౌనం దాల్చారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
దళితుల హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నామని ప్రజలు పాలు పలికే దళిత నాయకులు ఈయన పాలనలో పెత్తందారుల కింద పెద్ద పాలేర్లుగా మారారు.
అమరావతి రాజధాని నగరంలో అంబేద్కర్ స్మృతి వనం పేరుతో 20 ఎకరాలు కేటాయించి ఒక టూరిస్ట్ ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నాలను ఈయన వమ్ము చేశారు.
అమరావతిలో అంబేద్కర్ స్మృతి వనాన్ని అంతం చేసి విజయవాడలో చిన్న ప్రాంతంలో కోట్లు ఖర్చుపెట్టి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు.
రాష్ట్రంలో దళితులను ఒక వైపు ఉచ్చ కోత కోస్తూ మరొకవైపు రాజకీయంగా దళితులను కాలరాస్తూ ఈయన అంబేద్కర్ విగ్రహం పెట్టి అంబేద్కర్ వారీగా ప్రచారం చేసుకుంటున్నారు.
జనసేనలో అంతర్గత విభేదాలు!! ఎంపీగా నేను, ఎమ్మెల్యేగా నువ్వు??
ప్రభుత్వ ఉద్యోగాల కొరకు రేయింబవళ్లు కష్టపడి చదివిన దళిత బిడ్డలు ఈయన ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్నారు.
దళితులకు సెంటు స్థలాల పేరుతో అంటరాని వారిగా పట్టణాలకు గ్రామాలకు దూరంగా పంట పొలాలలో ఇళ్ల స్థలాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి దళితుల స్థానాన్ని వారికి గుర్తు చేశారు.
జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎన్ని అన్యాయాలు చేసినా ఆయా సంఘాల నాయకుల మాత్రం నమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
నాయకులను ఈయన లొంగ తీసుకున్నా ఆయా వర్గాలను మాత్రం ఈయన్ని దూరం చేసుకున్నారనడంలో సందేహం లేదు.
కొంతమంది వల్ల చెడ్డపేరు వస్తోంది!! నా మాటలకు కట్టుబడి ఉన్నా!! పవన్ కల్యాణ్...
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళిత ఓడలకు కేటాయించిన నిధులను కూడా ఈయన ఇతర పథకాలకు మళ్లించి ఆయా ప్రాంతాల అభివృద్ధిని నిర్వీర్యం చేశారు.
కులానికి ఒక కార్పొరేషన్ పెట్టిన ఈయన ఆయా కులాలలో ఒక్కరికి కూడా కార్పొరేషన్ ద్వారా రణం ఇచ్చి ప్రోత్సహించిన దాఖలాలు లేవు.
గత టిడిపి ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 4,000 మందికి ఇన్నోవా కార్లు ఇచ్చి దళితులను యజమానులను చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలపై జరిగిన దాడులను వైసిపి పార్టీలో ఉండి కూడా ఖండించకపోవడం దాడులను చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లే ఆయా ఎమ్మెల్యేలపై పెరిగిన వ్యతిరేకతను తప్పించుకోవడానికి ఈయన వారికి సీట్లు కేటాయించడం లేదు.
అమెరికాలో భారతీయులపై దాడులు!! ఖండించిన శ్వేతసౌధం!!
ఈయన చేసిన పాపాలను ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేలకు అంటగట్టి చేతులు కడుక్కుంటున్నారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.