నేడు ఢిల్లీకి నారా లోకేష్! ఫుల్ షెడ్యూల్... India-US Trade Deal: అమెరికా మార్కెట్‌లో మేడ్ ఇన్ ఇండియా హవా.. చైనా పాకిస్థాన్‌ల కంటే భారత్‌కే ఎక్కువ లబ్ధి! పలు జిల్లాల్లో భూ కబ్జాలు.. వైసీపీ నాయకులపై ప్రజావేదిక లో ఫిర్యాదు! ఏపీలో ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! 100 పడకల ఆసుపత్రి... డయాలసిస్ సెంటర్ కూడా! ఇక కష్టాలు తీరినట్లే... చట్టం మన చేతుల్లోకి తీసుకోవద్దు.. ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకు సాగుదాం! లండన్ వీధుల్లో మంత్రి బృందం.. అమరావతి కోసం సరికొత్త 'మాస్టర్ ప్లాన్' వేట! విశాఖ తీరాన నౌకాదళ విన్యాసాల పండగ: ఈ నెల 18న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ.. 19న మిలాన్-2026! భక్తులకు శుభవార్త.. ఈ ఏడాది కూడా ఉచిత! శ్రీశైలంలో శివరాత్రి వైభవం - అధికారులకు మంత్రుల బృందం ఆదేశం! ఏపీలో ₹92,649 కోట్ల రైల్వే ప్రాజెక్టులు.. వేగంగా కొనసాగుతున్న పనులు! అనుచిత వ్యాఖ్యలే రాజకీయమా..? జోగి రమేష్‌పై వసంత కృష్ణప్రసాద్ ఫైర్..! నేడు ఢిల్లీకి నారా లోకేష్! ఫుల్ షెడ్యూల్... India-US Trade Deal: అమెరికా మార్కెట్‌లో మేడ్ ఇన్ ఇండియా హవా.. చైనా పాకిస్థాన్‌ల కంటే భారత్‌కే ఎక్కువ లబ్ధి! పలు జిల్లాల్లో భూ కబ్జాలు.. వైసీపీ నాయకులపై ప్రజావేదిక లో ఫిర్యాదు! ఏపీలో ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! 100 పడకల ఆసుపత్రి... డయాలసిస్ సెంటర్ కూడా! ఇక కష్టాలు తీరినట్లే... చట్టం మన చేతుల్లోకి తీసుకోవద్దు.. ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకు సాగుదాం! లండన్ వీధుల్లో మంత్రి బృందం.. అమరావతి కోసం సరికొత్త 'మాస్టర్ ప్లాన్' వేట! విశాఖ తీరాన నౌకాదళ విన్యాసాల పండగ: ఈ నెల 18న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ.. 19న మిలాన్-2026! భక్తులకు శుభవార్త.. ఈ ఏడాది కూడా ఉచిత! శ్రీశైలంలో శివరాత్రి వైభవం - అధికారులకు మంత్రుల బృందం ఆదేశం! ఏపీలో ₹92,649 కోట్ల రైల్వే ప్రాజెక్టులు.. వేగంగా కొనసాగుతున్న పనులు! అనుచిత వ్యాఖ్యలే రాజకీయమా..? జోగి రమేష్‌పై వసంత కృష్ణప్రసాద్ ఫైర్..!

పలు జిల్లాల్లో భూ కబ్జాలు.. వైసీపీ నాయకులపై ప్రజావేదిక లో ఫిర్యాదు!

పలు జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు, వైసీపీ నాయకులు భూములను అక్రమంగా కబ్జా చేశారని ప్రజావేదికలో ఫిర్యాదులు చేశారు. తమ భూ హక్కులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Published : 2026-02-03 07:32:00

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతులు… వైసీపీ హయాంలో అక్రమాలు ….

జీతాలు ఇవ్వని వైసీపీ మాజీ జెడ్పీటీసీపై బాధితుల ఆవేదన….

భూముల కబ్జాలు, అక్రమ పట్టాలు: గ్రీవెన్స్‌లో వరుస ఫిర్యాదులు…..

• పని చేయించుకోని జీతాలు ఇవ్వని వైసీపీ మాజీ జెడ్పీటీసీపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు

• వైసీపీ హయాంలో వారసత్వ భూమి కబ్జా.. న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి

• డ్వాక్రా మహిళల సాగు భూమిపై మాజీ సర్పంచ్ కన్ను.. చర్యలు తీసుకోవాలంటూ వినతి

• అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు

• మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఏపీ శెట్టి బలిజా వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు

గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన చెందిన బాలకృష్ణ నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. తాను, తన భార్య గత మూడు సంవత్సరాలుగా ఒక వైసీపీ మాజీ జెడ్పీటీసీ వద్ద పని చేశాం. ఆ కాలంలో నిరంతరంగా సేవలందించినప్పటికీ తమకు రావాల్సిన జీతాలను ఇవ్వకుండా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. ఇదే సమయంలో వారి 7 సంవత్సరాల తన చిన్న కుమారుడికి బ్లడ్ క్యాన్సర్ రావడంతో సరైన చికిత్స అందించడానికి ఆర్థిక స్థోమత లేక తీవ్ర కష్టాలు ఎదుర్కొన్నాం. బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా తమ జీతాలు ఇవ్వకపోవడంతో చికిత్స పూర్తిగా చేయించలేకపోయామని చివరికి తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయంపై జిల్లా పోలీసు అధికారులను ఆశ్రయించినా సరైన న్యాయం జరగలేదు. రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో అతనిపై చర్యలు తీసుకోవడానికి అధికారులు భయపడుతున్నారు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని నేతలు మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఏపీ శెట్టి బలిజా వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబులకు అర్జీ ఇచ్చి అభ్యర్దించాడు.

పల్నాడు జిల్లా మాచర్ల మండలం రాయవరం గ్రామానికి చెందిన కామిశెట్టి చెన్నకేశవరావు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలోని సర్వే నెం. 363లో 2.50 ఎకరాల భూమి తమ పూర్వీకుల నుండి 1995 నుండి తనకు వారసత్వంగా సంక్రమించింది. ఈ భూమిని సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నానని, 2009లో తన భార్య కామిశెట్టి లక్ష్మీ నర్సమ్మ పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. ఈ భూమిని మాచర్ల సొసైటీ బ్యాంక్, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తనఖా పెట్టి రుణాలు పొందినట్లు, వాటికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. 2022 వరకు ఆస్తి తన భార్య పేరుమీదే ఉన్నట్లు రికార్డులు ఉన్నప్పటికీ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు వ్యక్తులు అధికారుల అండతో కామిశెట్టి హైమావతి పేరుమీద 1.50 ఎకరాలు అక్రమంగా నమోదు చేయించారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో తన భార్య పేరుమీద కేవలం 1.00 ఎకరం మాత్రమే చూపుతుంది. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ భూమి సమస్యను పరిష్కరించాలని కోరాడు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం పెద్దపట్టపుపాలెం గ్రామానికి  చెందిన సునీత, తిరుపతమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో 1998వ సంవత్సరంలో నందమ్మపాలెం కాలువ ఇవతల భాగంలో ఉన్న పోరంబోకు భూమిని, అప్పట్లో అడవిలాగా చెట్లు, చామలు, పొదలతో నిండిపోయిన ప్రాంతాన్ని డ్వాక్రా గ్రూపు మహిళలమంతా కలిసి దాదాపుగా రూ.20,00,000/ స్వయంగా ఖర్చు చేసి చదును చేసి సాగుబడి భూమిగా మార్చుకున్నాము. ఆ భూమిలో వ్యవసాయం చేస్తూ, కుటుంబాలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాము. కొంతకాలం తరువాత సంబంధిత అధికారులను ఆశ్రయించగా, వారు సానుకూలంగా స్పందించి మా డ్వాక్రా పొదుపు గ్రూపుల పేర్లపై పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ అమలు కాకుండా కాలయాపన జరిగింది. మళ్లీ తాము అధికారులను గుర్తుచేయగా, 13 డ్వాక్రా గ్రూపులకు చెందిన 40–50 మంది సభ్యులకు మాత్రమే పట్టాలు మంజూరయ్యాయి. దానికి సంబంధించినగా మాకు జన్మభూమి పథకం రిజిస్టర్ నెం.7/06/06/98, అలాగే సర్వే నెంబర్లు 457-5, 369 కేటాయించినట్లు సమాచారం అందించారు. ఈ పరిస్థితుల్లో అప్పటి మాజీ సర్పంచ్ మొదట టీడీపీ తరఫున ఎన్నికై, తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలో చేరి, తన బినామీల పేర్లపై ఈ భూములను అక్రమంగా ఆక్రమించుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతానికి పోర్టు రావడంతో భూమి విలువ పెరిగిన నేపథ్యంలో, తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అక్రమంగా పట్టాలు మంజూరు చేయించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

అన్నమయ్య జిల్లా కురబలకోటకు చెందిన సిద్ధప్ప గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 627, 628లకు సంబంధించిన భూములు గతంలో రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ అధికారులు నిరుపేద కుటుంబాలకు నివేశ స్థలాల కోసం స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తన జీవనోపాధి నిమిత్తం ప్రభుత్వం సర్వే నెంబర్ 628లో 2.29 సెంట్లు వ్యవసాయ భూమిని తన పేరున మంజూరు చేసింది. ప్రస్తుతం ఆ భూమిని తన స్వాధీనంలో ఉంచుకొని సాగు చేస్తూ, పంటలు పండించుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఈ భూమికి సంబంధించిన RTI ద్వారా పొందిన A-రిజిస్టర్ నకలు, భూమి కొలతల పటం (స్కెచ్) తదితర ధృవీకరణ పత్రాల జిరాక్సులను కూడా రెవెన్యూ అధికారులకు సమర్పించాను. అయితే ఇప్పటికీ తనకు మంజూరైన ఈ వ్యవసాయ భూమి ఆన్‌లైన్‌లో నమోదు కాకపోవడంతో పాస్‌బుక్ జారీ కాలేదు. వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోలలపూడి గ్రామానికి చెందిన వెంకట సుబ్బారావు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 146/B4లో తన తండ్రి నర్రా చిన్నలింగయ్య పేరున 0.84 సెంట్లు భూమి రిజిస్టర్ అయి ఉంది. అదేవిధంగా తన పేరున 0.30 సెంట్లు స్థలం కూడా రిజిస్టర్ అయి ఉండగా, ఆ స్థలంలో నివాస గృహాన్ని నిర్మించుకొని గత 33 సంవత్సరాలుగా కుటుంబంతో కలిసి నివసిస్తూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. అయితే తమకు చట్టబద్ధంగా రిజిస్టర్ అయిన భూమి, నివాస గృహానికి సంబంధించిన వివరాలు ఆన్‌లైన్ భూరికార్డుల్లో కనిపించకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భూమి రికార్డులు ఆన్‌లైన్‌లో నమోదు కాకపోవడంతో ప్రభుత్వ పథకాలు, ధృవీకరణ పత్రాలు పొందడంలో సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. కావునా తమయందు దయవుంచి తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం గ్రామానికి చెందిన కుమ్మిర బాలుడు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలో తమకు చట్టబద్ధంగా వచ్చిన ఇంటి, వ్యవసాయ భూమిపై హక్కులు ఉన్నప్పటికీ, దాయాదులు రాజకీయ బలాన్ని అడ్డుపెట్టుకొని, వైసీపీ గుండాలతో కలిసి దాడులకు పాల్పడి భయభ్రాంతులకు గురి చేసి అక్రమంగా ఆక్రమణకు దిగారు. ఇంటిని కూల్చివేయడం వల్ల కుటుంబం నిరాశ్రయ స్థితికి చేరిందని పొలాన్ని కోల్పోవడంతో జీవనోపాధి పూర్తిగా దెబ్బతింది. ఈ ఘటనపై సంబంధిత అధికారులను, పోలీసులను పలుమార్లు ఆశ్రయించినా సరైన న్యాయం జరగలేదు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన రమణ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 1067,14159లకు సంబంధించిన భూములు ఇప్పటికీ మార్ఫింగ్/మార్పిడి, భూరికార్డుల్లో నమోదు కాలేదు. ఈ విషయంలో పరిష్కారం కోసం తాము గత కొంతకాలంగా మాచర్ల తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారి ఈ సమస్యను పట్టించుకోవడం లేదు. భూమి హక్కులు స్పష్టంగా ఉన్నప్పటికీ రికార్డుల్లో నమోదు కాకపోవడం వల్ల, ప్రభుత్వ పథకాలు పొందడంలో, ధృవీకరణ పత్రాలు తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ భూమి సమస్యను పరిష్కరించాలని కోరాడు.

కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి గ్రామానికి చెందిన కోటేశ్వరి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 192/1, 192/9లో మొత్తం 3.09 ఎకరాలు భూమి తమ కుటుంబానికి చట్టబద్ధంగా ఉంది. ఈ భూమి తమ అమ్మాయికి పసుపు కుంకుమ కింద ఇచ్చారు. అయితే ఆన్‌లైన్ “మీ భూమి” వెబ్‌సైట్‌లో భూమి వివరాలు పరిశీలించగా ఈ భూమి నిషేధిత జాబితాలో ఉన్నట్లు చూపిస్తోంది.. దీని వల్ల తమ భూమికి సంబంధించిన హక్కులు వినియోగించుకోవడంలో రికార్డులు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. కావునా తమయందు దయవుంచి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

తిరుపతి జిల్లా చిట్వేలి మండలం కేవీఆర్ఆర్ పురం గ్రామానికి చెందిన దిలీప్ కుమార్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ అమ్మ గౌరవమ్మ జీవనోపాధి నిమిత్తం దాదాపు ఒక సంవత్సరం క్రితం మస్కట్‌కు వెళ్లినప్పటికీ, అక్కడి ఏజెంట్లు ఆమెకు మెడికల్ పరీక్షలు, సివిల్ ఐడి వంటి తప్పనిసరి ప్రక్రియలు పూర్తి చేయకుండా మోసం చేశారు. అంతేకాకుండా ఆమె పాస్‌పోర్టును కూడా ఏజెంట్లు తీసుకుని ఇవ్వకుండా నిర్బంధించారు. గత ఆరు నెలలుగా ఆమె ఆరోగ్యం తీవ్రమైనంగా క్షీణించింది. పని సమయంలో చేతులపై యాసిడ్ పడటంతో గాయాలు కావడంతో తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా హృదయ సమస్యలు కూడా ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఆమె అత్యంత అసహాయ స్థితిలో మస్కట్‌లోని భారతీయ దౌత్య కార్యాలయం (Indian Embassy) వద్ద ఆశ్రయం పొందుతున్నప్పటికీ, అవసరమైన పత్రాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కావునా సంబంధిత అధికారులు మానవతా దృక్పథంతో స్పందించి మస్కట్‌లోని భారతీయ దౌత్య కార్యాలయంతో సమన్వయం చేసి తమ తల్లిని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలని కోరాడు.

వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా.. మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్ లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్ధికతోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు అందించారు.

Spotlight

Read More →