FASTag Update: ఫాస్టాగ్ లో తాజా సవరణలు... ఇకపై ఆ వాహనాలకు టోల్ ఫీజు డబుల్! Road Safety: జాతీయ రహదారులపై ఓవర్‌లోడ్ వాహనాలకు చెక్.. ఏప్రిల్ 15 నుంచి కొత్త రూల్స్! Bullet Train: హైదరాబాద్‌కు బుల్లెట్ రైలు..! శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద భారీ హబ్! Leopard: శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుతపులి కలకలం.. భయాందోళనలో భక్తులు! Amarnath Yatra: భక్తులకు అలర్ట్.. యాత్రకు వెళ్లే వారు ఇవి మర్చిపోకండి.. అమర్‌నాథ్ రిజిస్ట్రేషన్లు మరియు హెల్త్ సర్టిఫికేట్లపై కీలక అప్‌డేట్.! Hyderabad-Vijayawada: విజయవాడ-హైదరాబాద్ మధ్య కొత్త విమాన సర్వీసు ప్రారంభం! APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.... ఇకపై ఏడాదికి రెండుసార్లు.!! Vande Bharat: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 12 వందే భారత్ స్లీపర్ రైళ్లు సిద్ధం! స్లీపర్ రైళ్ల ప్రారంభ తేదీలపై.. AP New Highways: అమరావతి-మచిలీపట్నం మధ్య కొత్త హైవే... త్వరలో రెండు రాష్ట్రాల మధ్య తగ్గనున్న దూరం! IRCTC: బడ్జెట్ ధరలో డార్జిలింగ్ విహారం... ఐఆర్సీటీసీ అదిరిపోయే ఆఫర్.. భోజనం, వసతి అన్నీ ఫ్రీ! FASTag Update: ఫాస్టాగ్ లో తాజా సవరణలు... ఇకపై ఆ వాహనాలకు టోల్ ఫీజు డబుల్! Road Safety: జాతీయ రహదారులపై ఓవర్‌లోడ్ వాహనాలకు చెక్.. ఏప్రిల్ 15 నుంచి కొత్త రూల్స్! Bullet Train: హైదరాబాద్‌కు బుల్లెట్ రైలు..! శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద భారీ హబ్! Leopard: శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుతపులి కలకలం.. భయాందోళనలో భక్తులు! Amarnath Yatra: భక్తులకు అలర్ట్.. యాత్రకు వెళ్లే వారు ఇవి మర్చిపోకండి.. అమర్‌నాథ్ రిజిస్ట్రేషన్లు మరియు హెల్త్ సర్టిఫికేట్లపై కీలక అప్‌డేట్.! Hyderabad-Vijayawada: విజయవాడ-హైదరాబాద్ మధ్య కొత్త విమాన సర్వీసు ప్రారంభం! APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.... ఇకపై ఏడాదికి రెండుసార్లు.!! Vande Bharat: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 12 వందే భారత్ స్లీపర్ రైళ్లు సిద్ధం! స్లీపర్ రైళ్ల ప్రారంభ తేదీలపై.. AP New Highways: అమరావతి-మచిలీపట్నం మధ్య కొత్త హైవే... త్వరలో రెండు రాష్ట్రాల మధ్య తగ్గనున్న దూరం! IRCTC: బడ్జెట్ ధరలో డార్జిలింగ్ విహారం... ఐఆర్సీటీసీ అదిరిపోయే ఆఫర్.. భోజనం, వసతి అన్నీ ఫ్రీ!

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి 2 నుంచి కొత్త బ్యాగేజీ రూల్స్!

విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు శుభవార్త. బ్యాగేజీ రూల్స్–2026 ఫిబ్రవరి 2 నుంచి అమల్లోకి వచ్చాయి. పాత 2016 నిబంధనలను రద్దు చేస్తూ, డ్యూటీ ఫ్రీ లిమిట్స్‌ను పెంచారు. ఏడాది పైగా విదేశాల్లో ఉన్న భారతీయులు మాత్రమే పరిమిత బంగారు ఆభరణాలు తెచ్చుకోవచ్చు. సాధారణ వస్తువుల డ్యూటీ ఫ్రీ లిమిట్‌ను రూ.50,000 నుంచి రూ.75,000కు పెంచారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ప్రయాణికుడు ఒక ల్యాప్‌టాప్‌ను పన్ను లేకుండా తీసుకురావచ్చు. ఈ లిమిట్స్ అన్నీ ఒక్కో ప్రయాణికుడికే వర్తిస్తాయి.

Published : 2026-02-03 08:06:00

పాత రూల్స్ రద్దు.. 2026 నుంచి అమల్లోకి కొత్త కస్టమ్స్ నిబంధనలు…..

గోల్డ్ తీసుకొస్తున్నారా? కొత్త లిమిట్స్ ఇవే…

డ్యూటీ ఫ్రీ లిమిట్ పెంపు.. ఇక రూ.75,000 వరకు వస్తువులు ఫ్రీ…

పాత 2016 రూల్స్ ఇక చెల్లవు: బంగారం తెచ్చుకునే వారికి (Gold Allowance):
​విదేశాల్లో ఏడాదికి పైగా (1 Year) ఉన్న ఇండియన్స్ లేదా భారత సంతతి వ్యక్తులు మాత్రమే ఈ రూల్స్ కింద బంగారం తెచ్చుకోవచ్చు.
​ఆడవారికి: కస్టమ్స్ డ్యూటీ లేకుండా 40 గ్రాముల వరకు బంగారు ఆభరణాలు తెచ్చుకోవచ్చు.
​మగవారికి: 20 గ్రాముల వరకు లిమిట్ ఉంది.

కండిషన్: ఇది కేవలం మీ సొంత వాడకానికి (Personal Use) తెచ్చుకునే ఆభరణాలకే వర్తిస్తుంది. బిస్కెట్లు లేదా అమ్మడానికి తెచ్చే గోల్డ్ దీని కిందకు రాదు.

​వస్తువుల లిమిట్ పెంపు (General Allowance):
​ఇప్పుడు విదేశాల నుంచి వచ్చేటప్పుడు రూ. 75,000 విలువైన వస్తువులను డ్యూటీ లేకుండా తెచ్చుకోవచ్చు. (గతంలో ఇది రూ. 50,000 మాత్రమే ఉండేది).

విదేశీ పర్యాటకులకు (Foreign Tourists):
​ఫారిన్ టూరిస్టులు తమ సొంత అవసరాల కోసం రూ. 25,000 విలువైన వస్తువులను మాత్రమే వెంట తెచ్చుకోవాలి.

ల్యాప్‌టాప్ రూల్ (Laptop):
​18 ఏళ్లు నిండిన ప్రయాణికులు ఎవరైనా సరే.. పన్ను లేకుండా ఒక ల్యాప్‌టాప్‌ను తమ వెంట తెచ్చుకోవచ్చు.

ముఖ్య గమనిక:
​ఈ లిమిట్స్ అన్నీ 'ఒక్కో ప్రయాణికుడికి' (Per Passenger) మాత్రమే. ఒకరి లిమిట్ మరొకరికి షేర్ చేయడం కుదరదు.
​కరెన్సీకి సంబంధించిన రూల్స్ మాత్రం ఫెమా (FEMA) నిబంధనల ప్రకారమే ఉంటాయి.

Spotlight

Read More →