రాష్ట్రంలో 108(అత్యవసర వైద్యం), 104(సంచార వైద్యం) సర్వీసుల నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందో సంస్థ వైదొలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు ' సర్వీసుల పనితీరు ఘోరంగా ఉందంటూ ఎన్డీయే ప్రభుత్వానికి పెద్దసంఖ్యలో ఫిర్యాదులు అందాయి. నిర్వహణ దారుణంగా ఉందని నిఘా సంస్థలూ ప్రభుత్వానికి నివేదించాయి. 108, 104 సర్వీసుల బాధ్యత నుంచి అరబిందోను తప్పించడమే మేలని సర్కారు ఆలోచిస్తోంది. బాధ్యతల నుంచి తమకు తాముగా తప్పుకోవాలని లేదంటే తనకు ఉన్న అధికారాల్ని అనుసరించి కఠిన చర్యలు తీసుకుంటామని అరబిందో యాజమాన్యానికి స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో బాధ్యతల నుంచి అరబిందో దూరం కావడం ఖాయంగా కనిపిస్తోంది. వేరే సంస్థకు నిర్వహణను అప్పగించడంలో భాగంగా టెండరు పిలిచేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమైంది. అరబిందో వ్యవహారంపై సచివాలయంలో సోమవారం ఉన్నతస్థాయిలో సమీక్ష నిర్వహించారు.
ఇంకా చదవండి: బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ తప్పుతుందా? ఈ యోగాసనాలు ట్రై చేయండి!
ఒకేసారి... ఏడేళ్ల ఒప్పందం
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో కీలకమైన ఈ రెండు సర్వీసుల వర్క్ ఆర్డర్లను వైకాపా ప్రభుత్వం 2020లో జారీచేసింది. ఆరోగ్యశ్రీ ట్రస్టుతో ఏడేళ్ల కాల పరిమితితో ఆ ఏడాది జులై 1న ఒప్పందం జరిగింది. దీని ప్రకారం 2027 వరకు గడువుంది. టెండర్లలో అరబిందో గ్రూపు మాత్రమే ఎంపికయ్యేలా వైకాపా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. అరబిందో గ్రూపు సంస్థల్లో వైకాపా సీనియర్ నేత విజయసాయిరెడ్డి అల్లుడు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ కారణంగానే నాటి వైకాపా ప్రభుత్వం అరబిందోకు పూర్తి సహాయ సహకారాలు అందించింది. భారీగా వాహనాల కొనుగోలు రాష్ట్రంలో 108 సర్వీసుల కింద అంతకుముందు ఉన్నవి, కొత్తగా కొనుగోలు చేసిన వాటితో కలిపి 768 అంబులెన్సులు నడుస్తున్నాయి. 104 సంచార వైద్యం కింద కొన్ని వాహనాలను వైకాపా పాలనలో కొనుగోలు చేశారు. 2019-24 మధ్యకాలంలో ఈ రెండు సర్వీసుల కింద రూ.450 కోట్లతో కొత్త వాహనాల్ని కొన్నారు. వీటి నిర్వహణలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ప్రిన్సిపల్ ఎకౌంటెంట్ జనరల్ తన నివేదికలో పేర్కొంది. అయినప్పటికీ నాటి ప్రభుత్వం స్పందించలేదు. కొన్నిచోట్ల గోల్డెన్ అవర్లో బాధితులకు 108 అంబులెన్సుల ద్వారా సేవలు అందలేదు. నిర్ణీత సమయానికి క్షతగాత్రుల వద్దకు అంబులెన్సులు వెళ్లలేదని కాగ్ తన నివేదికలో ఎండగట్టింది. జరిమానాల్లో ఉదాసీనత ఈ సంస్థలు నడిపే వాహనాల పరంగా నిబంధనల ఉల్లంఘన జరిగినప్పుడు.. విధించాల్సిన జరిమానాల విషయమై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. ఈ రెండు సర్వీసుల కింద పనిచేసే ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వలేదు. యాజమాన్యం నుంచి 3 నెలలుగా వేతనాల చెల్లింపుల్లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. 104 పథకం కింద గ్రామీణులకు అందించే మందుల విషయంలోనూ అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు ఉన్నాయి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ కు భారీ షాక్! పార్టీకి మాజీ మంత్రి రాజీనామా!
11వ నెల 11వ తారీకు ఉదయం 11 గంటలకు ఆ 11 మంది వస్తారా? ఏపీ అసెంబ్లీ సమావేశాలు!
అమరావతి టవర్ల నిర్మాణానికి మళ్ళీ ఉపిరి! ఏడాదిలోనే పనులు పూర్తి చేయాలన్న కసరత్తు!
దేశంలోనే నెంబర్ వన్ గా ఏపీ నూతన క్రీడా పాలసీ! చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షల భారీ జీతం! పరీక్ష లేకుండా నేరుగా జాబ్, ఈ ఛాన్స్ వదలొద్దు!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల వివరాలు! ఎవరో తెలుసా?
ఏపీలో పర్యాటక రంగానికి కొంత హంగులు.. విజయవాడ - శ్రీశైలం మధ్య సీ ప్లేన్! ప్రారంభం - టికెట్ రేట్!
కొత్త సంవత్సరం నుంచి ఈ రేషన్ కార్డులు చెల్లవు! వెంటనే ఇలా చేయండి - వారి కార్డులు రద్దు!
అన్నీ శుభవార్తలే... ఏపీకి అదృష్టంగా మారిన కేంద్రమంత్రి! ఆ జిల్లాల్లో పెరగనున్న స్థలాల రేట్లు!
ఆ మహిళ చేసిన పనికి బిత్తర పోయిన చంద్రబాబు! మరీ అంత దారుణంగానా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: