రాఖీ పండుగ సందర్బంగా పిఠాపురం నియోజకవర్గంలోని 1,500 మంది వితంతు మహిళలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక కానుక పంపించారు. రక్షాబంధన్ కానుకగా చీరలను పంపిన పవన్, వాటిని మహిళలకు స్వయంగా అందజేయాలని స్థానిక జనసైనికులను ఆదేశించారు. ఈ అనూహ్యమైన కానుక అందుకున్న మహిళలు భావోద్వేగానికి గురయ్యారు.
వితంతువులందరికీ తాను సోదరుడిగా ఉంటానని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని పార్టీ కార్యకర్తలకు సూచనలు ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పంపిన చీరలను నాయకులు, క్రియాశీల సభ్యులు ఇంటింటికీ వెళ్లి అందజేశారు. పవన్ తరఫున మహిళలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు.
జనసేన ప్రకటనలో, పవన్ కల్యాణ్ పిఠాపురం శాసనసభ్యుడిగానే కాకుండా, ఒక సోదరుడిగా, కుటుంబ సభ్యుడిగా ఈ కానుకలను పంపించినట్లు పేర్కొంది.