Sankranthi Gift: 45 ఏళ్ల తర్వాత పరిష్కారం.. సంక్రాంతి కానుకగా ఆ 2,111 కుటుంబాలకు ఫ్లాట్ల కేటాయింపు!

2026-01-15 07:36:00
Andhra Pradesh: కేంద్రం నుంచి ఏపీకి లేఖ… పీపీపీపై కీలక ఆదేశాలు..!!

తిరుపతి శెట్టిపల్లెలో 45 ఏళ్లుగా నలుగుతున్న 380.42 ఎకరాల భూ వివాదానికి చివరకు శాశ్వత పరిష్కారం లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం చొరవతో ఈ సమస్యకు ముగింపు పలుకుతూ, 2,111 మంది లబ్ధిదారులకు న్యాయం చేయాలని నిర్ణయించింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని లాటరీ పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు (Plot Allotment) చేపట్టనుండగా, ఈ ప్రక్రియను ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షించనున్నారు. దీంతో శెట్టిపల్లి ప్రజలు నిజమైన సంక్రాంతి ఆనందాన్ని అనుభవిస్తున్నారు.

Warning to Indians : ఇరాన్‌లో భారతీయులకు హెచ్చరిక... వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఎంబసీ సూచన!

ఈ భూ వివాదానికి మూలం 1945 నాటి ఎస్టేట్ అబాలిషన్ చట్టం అమలులో లోపాలు మరియు 1979లో ఇనామ్ చట్టం రద్దు కావడమే. దశాబ్దాలుగా భూములు సాగు చేస్తూ, ఇళ్లను నిర్మించుకున్న ప్రజలకు చట్టబద్ధమైన హక్కులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. భూములు అమ్ముకోలేక, విద్య, పెళ్లిళ్లు వంటి అవసరాలకు వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. సుమారు రూ.2,000 కోట్ల విలువైన ఈ భూమిపై గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగినా, పూర్తి స్థాయిలో పరిష్కారం లభించలేదు.

Trump shows: మిచిగాన్‌లో వివాదం.. ఉద్యోగికి మిడిల్ ఫింగర్ చూపించిన ట్రంప్!

ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యను ప్రాధాన్యంగా తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ నేతృత్వంలో విస్తృత స్థాయిలో చర్చలు జరిగాయి. దాదాపు 30కు పైగా సమావేశాల అనంతరం ఒక సమగ్ర పరిష్కారానికి వచ్చారు. సాగు భూములు వినియోగిస్తున్న వారికి 30 శాతం, నివాస స్థలాలు ఉన్న వారికి 50 శాతం భూమిని కేటాయించాలనే విధానాన్ని ఖరారు చేశారు. ఈ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

SIP investments: మ్యూచువల్ ఫండ్స్‌పై నమ్మకం పెరిగింది.. సిప్ ఇన్వెస్ట్మెంట్లు ఆల్‌టైమ్ హై!

ఈ నిర్ణయంతో మొత్తం 225.42 ఎకరాలను లబ్ధిదారులకు, 90 ఎకరాలను ప్రభుత్వానికి, 65 ఎకరాలను తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా)కు కేటాయించారు. సుమారు 900 మందికి రెండు సెంట్లకు తక్కువ స్థలం వచ్చినప్పటికీ, మంత్రివర్గ ప్రత్యేక నిర్ణయంతో వారందరికీ కనీసం రెండు సెంట్ల చొప్పున భూమి ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే, రిజిస్ట్రేషన్ల సమయంలో స్టాంప్ డ్యూటీ మినహాయింపుతో ప్రభుత్వం సుమారు రూ.16 కోట్ల భారం నుంచి లబ్ధిదారులను విముక్తం చేసింది.

Movie Review Telugu: సంక్రాంతికి నవ్వుల పండుగ తెచ్చిన నవీన్ పోలిశెట్టి – ‘అనగనగా ఒక రాజు’తో మరోసారి వన్ మ్యాన్ షో.!!

శెట్టిపల్లి రెవెన్యూ పరిధిలోని వివాదాస్పద భూమిని గతంలో 22A జాబితాలో చేర్చడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. అయితే ఇప్పుడు లాటరీ పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు, పట్టాల మంజూరుతో ఈ సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం లభించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ భూ వివాదం ముగింపు దశకు చేరుకోవడంతో, శెట్టిపల్లి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Movie Review 2026: కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న ‘నారి నారి నడుమ మురారి’ ఎలా ఉంది అంటే?
మూడు రోజులు, మూడు రహస్యాలు… అసలు కథ!
Transport News: ఆ ప్రాంత ప్రజలకు శుభవార్త – కేవలం రెండున్నర గంటల్లోనే తిరుపతికి ప్రయాణం..!!
మందుబాబులకు గుడ్న్యూస్.. ఆ పాలసీలో కీలక మార్పులు.. ఇక ఎక్కడ లిక్కర్ కొన్నా ఒకటే రేటు..!
హాలిడే ప్లాన్ చేస్తున్నారా? ఇండిగో అదిరిపోయే ఆఫర్, వారికి రూపాయికే విమానం టికెట్.! పూర్తి వివరాలు మీకోసం..

Spotlight

Read More →