నిన్న (18 జనవరి, 2026 న) రాత్రి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ నగరానికి చేరుకున్నారు. జ్యూరిక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు తెలుగు ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. పూలు, జాతీయ జెండాలతో పాటు ఆత్మీయ వాతావరణంలో మంత్రి లోకేష్‌ను వారు ఆహ్వానించారు.
జ్యూరిక్ నుంచి మంత్రి నారా లోకేష్ దావోస్‌కు ప్రయాణం చేయనున్నారు. అక్కడ జరుగుతున్న నాలుగు రోజుల వరల్డ్ ఎకనమిక్ ఫోరం (WEF) సదస్సులో ఆయన పాల్గొననున్నారు. అలాగే ఈ రోజు (19 జనవరి, 2026) తెలుగు డియాస్పోరా మీట్ లో పాల్గొననున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, వివిధ దేశాల నాయకులు పాల్గొననున్నారు.
పెట్టుబడుల సాధనే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తో మంత్రి నారా లోకేష్ ఈ దావోస్ పర్యటనను చేపట్టారు. సదస్సు సందర్భంగా అంతర్జాతీయ కంపెనీలతో సమావేశాలు నిర్వహించి, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పెట్టుబడి అవకాశాలు, పరిశ్రమలకు అనుకూలమైన ప్రభుత్వ విధానాలను వివరించనున్నారు. ఐటీ, తయారీ, గ్రీన్ ఎనర్జీ, స్టార్టప్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో మంత్రి పాల్గొనడం ద్వారా రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభిస్తుందని, భవిష్యత్తులో అభివృద్ధి వేగం మరింత పెరుగుతుందని ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు మంత్రి లోకేష్ ను విమానాశ్రయంలో కలిసి స్వాగతం పలికారు అలాగే మంత్రి లోకేష్ వారందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ ఫోటోలు కూడా దిగారు. దానికి సంబంధించిన ఫొటోలు ఈ లింక్ ద్వారా చూడవచ్చు.
https://photos.app.goo.gl/gFFx4PwnxJZCjzcG8