AP Govt: ఆ జిల్లా అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. రూ. 14 వేల కోట్లతో రైల్వే, జాతీయ రహదారుల ప్రతిపాదనలు.! AP Govt: ₹185 కోట్లతో 130 కొత్త అంగన్‌వాడీ కేంద్రాలు.. 55,766 కేంద్రాల్లో.. అంగన్‌వాడీల రూపురేఖలు సమూల మార్పు! Nara Lokesh: పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం అనివార్యం! దీనిపై రాష్ట్రవ్యాప్తంగా.. Nimmala Ramanaidu: వైసీపీది విధ్వంస పాలన.. కూటమిది అభివృద్ధి బాట.. పెనుమదం సభలో మంత్రి! రూ. 4.49 కోట్లతో.. Vijay Tirunelveli Speech: వ్యక్తిగత జీవితంపై దాడిని సహించను.. విడాకుల వివాదంపై నోరు విప్పిన దళపతి విజయ్! Prajavedhika: రికార్డుల నుంచి 19 సెంట్లు మాయం.. రీ-సర్వేలో రైతుకు జరిగిన ఆ అన్యాయం! సామాన్యుడి ఆర్తనాదం ఎందుకు వినిపించడం లేదు? Chandrababu: మీ భూమిపై మీకే హక్కు.. సూరేపల్లి వేదికగా సీఎం చంద్రబాబు భరోసా! Chandrababu: పోలవరం, అమరావతిని పునర్నిర్మించే అదృష్టం నాదే.. రూ. 1,000 కోట్లు వదులుకున్నాం.. సీఎం కీలక వ్యాఖ్యలు.! Atchannaidu: జగన్ అసలు రంగు బయటపడిందన్న కూటమి... వైఎస్ మరణం వెనుక జగన్ హస్తం! మంత్రి సంచలన కామెంట్లు.. AP Politics: పదవి కోసం సొంత చెల్లిని, తల్లిని కూడా వదలలేదు జగన్‌పై విరుచుకుపడ్డ మంత్రి అచ్చెన్నాయుడు..! AP Govt: ఆ జిల్లా అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. రూ. 14 వేల కోట్లతో రైల్వే, జాతీయ రహదారుల ప్రతిపాదనలు.! AP Govt: ₹185 కోట్లతో 130 కొత్త అంగన్‌వాడీ కేంద్రాలు.. 55,766 కేంద్రాల్లో.. అంగన్‌వాడీల రూపురేఖలు సమూల మార్పు! Nara Lokesh: పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం అనివార్యం! దీనిపై రాష్ట్రవ్యాప్తంగా.. Nimmala Ramanaidu: వైసీపీది విధ్వంస పాలన.. కూటమిది అభివృద్ధి బాట.. పెనుమదం సభలో మంత్రి! రూ. 4.49 కోట్లతో.. Vijay Tirunelveli Speech: వ్యక్తిగత జీవితంపై దాడిని సహించను.. విడాకుల వివాదంపై నోరు విప్పిన దళపతి విజయ్! Prajavedhika: రికార్డుల నుంచి 19 సెంట్లు మాయం.. రీ-సర్వేలో రైతుకు జరిగిన ఆ అన్యాయం! సామాన్యుడి ఆర్తనాదం ఎందుకు వినిపించడం లేదు? Chandrababu: మీ భూమిపై మీకే హక్కు.. సూరేపల్లి వేదికగా సీఎం చంద్రబాబు భరోసా! Chandrababu: పోలవరం, అమరావతిని పునర్నిర్మించే అదృష్టం నాదే.. రూ. 1,000 కోట్లు వదులుకున్నాం.. సీఎం కీలక వ్యాఖ్యలు.! Atchannaidu: జగన్ అసలు రంగు బయటపడిందన్న కూటమి... వైఎస్ మరణం వెనుక జగన్ హస్తం! మంత్రి సంచలన కామెంట్లు.. AP Politics: పదవి కోసం సొంత చెల్లిని, తల్లిని కూడా వదలలేదు జగన్‌పై విరుచుకుపడ్డ మంత్రి అచ్చెన్నాయుడు..!

AP Govt: ₹185 కోట్లతో 130 కొత్త అంగన్‌వాడీ కేంద్రాలు.. 55,766 కేంద్రాల్లో.. అంగన్‌వాడీల రూపురేఖలు సమూల మార్పు!

AP Government: 9 ఏప్రిల్ నుండి 23వ తేదీ వరకు నిర్వహించే పోషణ పక్వాడ 2026 కార్యక్రమాన్ని పురస్కరించుకుని స్ధానిక ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ..

Published : 2026-04-09 22:07:00
  •  Politics: ఆటపాటల ద్వారా విద్యాబోధన.. అంగన్‌వాడీల్లో ఐక్యూ (IQ) పెంపునకు ప్రాధాన్యత.. 
     
  •  మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి..

AP Government: 9 ఏప్రిల్ నుండి 23వ తేదీ వరకు నిర్వహించే పోషణ పక్వాడ 2026 కార్యక్రమాన్ని పురస్కరించుకుని స్ధానిక ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీల నుండి రెండు సంవత్సరాల లోపు చిన్నారులకు సరైన పోషకాహారం, ఆరోగ్యం, విద్యా విషయాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గర్భధారణ సమయంలో తల్లి తీసుకునే పౌష్టికాహారం పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరమైన పెరుగుదలకు ఎంతగానో దోహదపడుతుందని, ఈ విషయంపై ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పిల్లలతో నేరుగా సంభాషించడం ద్వారా వారి తెలివితేటలను పెంపొందించడంపై తల్లిదండ్రులకు మార్గదర్శనం అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ఆధునీకరణ, ఆటపాటల ద్వారా  పిల్లల్లో నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఆటవస్తువులతో పాఠాలు బోధించడం, వారి ఐక్యూ స్థాయిని పర్యవేక్షించడం జరుగుతోందని తెలిపారు.

రాష్ట్రంలో మహిళలు మరియు చిన్నారుల ఆరోగ్యానికి పోషకాహారం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి గర్భిణీ, బాలింత, చిన్నారి వరకు సరైన పోషణ అందేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. పోషణ పక్వాడ ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించడం ప్రధాన లక్ష్యమని, ముఖ్యంగా గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల్లో పోషకాహారం పై చైతన్యం కల్పించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను మరింత బలోపేతం చేస్తున్నాం. అంతేకాకుండా, మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని, అందుకే మహిళల ఆరోగ్యం, శిశు సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని 55,766 అంగన్‌వాడీ కేంద్రాలలో టీవీలు,ఆటవస్తువులు, మరుగుదొడ్లు, తాగునీటి వంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వం ఇప్పటికే కల్పించిందని వెల్లడించారు. గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడుతూ పీఎం జనమన్ పథకం కింద ₹185 కోట్ల వ్యయంతో గిరిజన గ్రామాల్లో 130 కొత్త అంగన్‌వాడీ కేంద్రాలను నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. పిల్లలకు ఆకర్షణీయంగా కనిపించే జంక్ ఫుడ్స్‌కు బదులుగా ఇంట్లో తయారు చేసిన పోషకాహారం, పండ్లు, పాలు, కూరగాయలు ఇవ్వాలని సూచించారు.

పిల్లలు ఏడవగానే ఫోన్లు లేదా టీవీలు అలవాటు చేయకుండా, కుటుంబ సభ్యులు వారితో సమయం గడుపుతూ మంచి సంస్కారాలు నేర్పించాలని పిలుపునిచ్చారు. నిరంతర పర్యవేక్షణ అవసరమన్నారు.. పిల్లల ఎత్తు, బరువులను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ, పోషకాహార లోపం ఉన్న వారికి అవసరమైన విటమిన్ టాబ్లెట్లు, నాణ్యమైన ఆహారాన్ని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందజేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.

మహిళా శిశు సంక్షేమ శాఖ 
ముఖ్య కార్యదర్శి ఏ. సూర్య కుమారి మాట్లాడుతూ...పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదల కోసం సరైన పోషకాహారం మరియు తల్లిదండ్రుల శ్రద్ధ అత్యంత అవసరమన్నారు.  ప్రస్తుత జీవన శైలిలో మార్పులు పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని అన్నారు. గతంలో ఇంటి ఆహారం ఆరోగ్యానికి మేలు చేసేదని, ప్రస్తుతం జంక్ ఫుడ్ అలవాట్లు పెరగడం ఆందోళనకరమని పేర్కొన్నారు. చిన్న వయసులోనే సరైన పోషకాహారం అందించడం, ముఖ్యంగా మొదటి రెండు సంవత్సరాల్లో పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతో అవసరమని సూచించారు.

పోషణ పక్వాడ కు సంబంధించి అవగాహన కల్పించే ప్రచార పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూనిసెఫ్ ప్రతినిధి నరసింహ మూర్తి, జాయింట్ డైరెక్టర్ ఏ. ప్రవీణ, జేపీసీ పోషణ అభియాన్ సునంద, ఆర్డీవో టీవీ సతీష్, ఐసీడీఎస్ పీడీ రుక్సానా, టాటా ట్రస్టు జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ డి. శ్రీనివాస్, జిల్లాల సీడిపీవోలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, గర్భిణులు, తదితరులు పాల్గొన్నారు.

Spotlight

Read More →