Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం... కోర్టు తీర్పుతో తెలంగాణ రాజకీయాల్లో సంచలనం! వారిద్దరికీ బిగ్ రిలీఫ్! Andhra University: ఆంధ్ర యూనివర్సిటీ వైసీపీ కార్యాలయంలా మారింది..! అసెంబ్లీలో నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు! JSP Chief Office: మంగళగిరి జనసేన కార్యాలయంలో అజ్ఞాత వ్యక్తి వీరంగం..! ఎస్పీ విచారణలో కీలక అంశాలు! AP Development: అమరావతిలో శరవేగంగా సాగుతున్న అభివృద్ధి పనులు... ప్రాజెక్టు వారీగా జరుగుతున్న పనుల సమీక్ష! మారుతున్న రాజధాని రూపురేఖలు! AP Sports: క్రీడల పేరుతో గతంలో వందల కోట్ల దోపిడీ...! వైసీపీ తీరుపై శాప్ ఛైర్మన్ ఆగ్రహం! IPS Arrest: ఏపీలో ఐపీఎస్ అధికారుల వరుస సస్పెన్షన్లు...! వెనుక అసలు కథ ఇదే..! Boneless Biryani: హోటల్ స్టైల్ చికెన్ బోన్‌లెస్ బిర్యానీ.. ఇంట్లోనే ఇలా చిటికెలో చేసేయండి! Sujala Sravanthi: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి.. రూ.600 కోట్ల నిధులు! 30 లక్షల మందికి తాగునీరు.. మంత్రి నిమ్మల! Modi: అమెరికా నమ్మకద్రోహం.. మోదీ రక్షణ కోరుతున్న అరబ్ నాయకులు! IronDome: ఐరన్ డోమ్ టెక్నాలజీ ఇక భారత్ సొంతం...! రక్షణ రంగంలో సరికొత్త విప్లవం! Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం... కోర్టు తీర్పుతో తెలంగాణ రాజకీయాల్లో సంచలనం! వారిద్దరికీ బిగ్ రిలీఫ్! Andhra University: ఆంధ్ర యూనివర్సిటీ వైసీపీ కార్యాలయంలా మారింది..! అసెంబ్లీలో నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు! JSP Chief Office: మంగళగిరి జనసేన కార్యాలయంలో అజ్ఞాత వ్యక్తి వీరంగం..! ఎస్పీ విచారణలో కీలక అంశాలు! AP Development: అమరావతిలో శరవేగంగా సాగుతున్న అభివృద్ధి పనులు... ప్రాజెక్టు వారీగా జరుగుతున్న పనుల సమీక్ష! మారుతున్న రాజధాని రూపురేఖలు! AP Sports: క్రీడల పేరుతో గతంలో వందల కోట్ల దోపిడీ...! వైసీపీ తీరుపై శాప్ ఛైర్మన్ ఆగ్రహం! IPS Arrest: ఏపీలో ఐపీఎస్ అధికారుల వరుస సస్పెన్షన్లు...! వెనుక అసలు కథ ఇదే..! Boneless Biryani: హోటల్ స్టైల్ చికెన్ బోన్‌లెస్ బిర్యానీ.. ఇంట్లోనే ఇలా చిటికెలో చేసేయండి! Sujala Sravanthi: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి.. రూ.600 కోట్ల నిధులు! 30 లక్షల మందికి తాగునీరు.. మంత్రి నిమ్మల! Modi: అమెరికా నమ్మకద్రోహం.. మోదీ రక్షణ కోరుతున్న అరబ్ నాయకులు! IronDome: ఐరన్ డోమ్ టెక్నాలజీ ఇక భారత్ సొంతం...! రక్షణ రంగంలో సరికొత్త విప్లవం!

Boneless Biryani: హోటల్ స్టైల్ చికెన్ బోన్‌లెస్ బిర్యానీ.. ఇంట్లోనే ఇలా చిటికెలో చేసేయండి!

Restuarant style Boneless Biryani: బయట వందల రూపాయలు ఖర్చు పెట్టే బదులు, ఇంట్లోనే తాజా మసాలాలు మరియు నాణ్యమైన పదార్థాలతో రెస్టారెంట్ స్టైల్ బోన్‌లెస్ బిర్యానీని తయారు చేసుకోవచ్చు.

Published : 2026-02-27 10:43:00

రెస్టారెంట్ రుచులతో ఇంట్లోనే బోన్‌లెస్ బిర్యానీ….

చిన్న చిట్కాలతో వంట రానివారు కూడా వండేయొచ్చు ….

సీక్రెట్ మసాలాతో రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ తయారీ విధానం!

రెస్టారెంట్ స్టైల్  రుచిని మన వంటగదిలో కూడా తీసుకురావచ్చని మీకు తెలుసా? బయట వందల రూపాయలు పెట్టి కొనే బదులు, శుభ్రంగా మన చేతులతో మన ఇంట్లోని వారికి ఈ అమృతం లాంటి బిర్యానీని వడ్డించవచ్చు. ఈ బోన్‌లెస్ బిర్యానీ తయారీలో కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు, వంట రాని వారు కూడా అద్భుతంగా వండవచ్చు.

మొదటగా  బిర్యానీకి ప్రధాన బలం మనం వాడే మసాలాలు. అంగట్లో దొరికే ప్యాకెట్ పొడుల కంటే, ఇంట్లోనే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ముఖ్యంగా జాజికాయ, అనాస పువ్వును కలిపి అప్పటికప్పుడు దంచుకున్న మసాలా పొడిని వాడటం వల్ల బిర్యానీకి ఆ అసలైన  ఫ్లేవర్ వస్తుంది. బియ్యాన్ని కనీసం గంట సేపు నానబెట్టుకోవడం వల్ల అన్నం పొడుగ్గా, మెత్తగా వస్తుంది. బాస్మతీ బియ్యం కడిగేటప్పుడు కూడా విరగకుండా జాగ్రత్తగా కడగాలి.

ఇక చికెన్ విషయానికి వస్తే, బోన్‌లెస్ ముక్కలను చిన్న చిన్న క్యూబ్స్‌లా కోయించుకోవాలి. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పుతో పాటు మనం తయారు చేసుకున్న సీక్రెట్ మసాలా పొడిని కలిపి అరగంట సేపు నానబెట్టాలి. చికెన్ ముక్కలను నూనెలో రెండు సార్లు వేయించడం  అనేది ఇక్కడ అసలైన ట్రిక్. ఇలా చేయడం వల్ల ముక్క పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉంటుంది. ఆ తర్వాత టమోటా ప్యూరీ, ఫ్రెష్ క్రీమ్‌తో చేసే గ్రేవీలో ఈ వేయించిన ముక్కలను కలిపితే, ఆ చికెన్ కి పట్టే రుచి అంతా ఇంతా కాదు.

బిర్యానీకి అసలైన ఫినిషింగ్ 'దమ్' పట్టడం. అడుగున గ్రేవీ, దాని పైన 90 శాతం ఉడికించిన అన్నం, మధ్యలో కొద్దిగా కుంకుమపువ్వు నీళ్లు, నెయ్యి, పుదీనా, కొత్తిమీర వేసి ఆవిరి బయటకు పోకుండా మూత పెట్టి తక్కువ మంట మీద ఉడికించాలి. ఇక్కడ మనం గేదె పాలు వాడటం వల్ల బిర్యానీకి ఒక రకమైన రిచ్‌నెస్ వస్తుంది. కేవలం 10 నిమిషాల దమ్ తర్వాత మూత తీస్తే వచ్చే ఆ సువాసన ఇల్లంతా నిండిపోతుంది.

బిర్యానీ వండటం ఒక కళ అయితే, దాన్ని ప్రేమతో వడ్డించడం ఒక తృప్తి. ఆదివారం పూట ఆఫీసు పనులు పక్కన పెట్టి, హాయిగా ఇంట్లోనే  బిర్యానీ చేసుకుని తింటే ఆ కిక్కే వేరు. బయట ఫుడ్ వల్ల వచ్చే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు, పైగా మన చేత్తో వండామన్న గర్వం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? వచ్చే వారం మీ వంటగదిలో ఈ ఘుమఘుమలు ట్రై చేయండి!

Spotlight

Read More →