TTD Updates: 6 అంతస్తుల భవనం.. అద్భుత వసతులు: టీటీడీ జేఈవో క్షేత్రస్థాయి పరిశీలన.! Telangana Politics: తేజస్వి సూర్య వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి వివరణ.. వివాదాస్పద మాటల ఉపసంహరణ! Parliament: 2029 లక్ష్యంగా కేంద్రం మాస్టర్ ప్లాన్.. జనగణనతో సంబంధం లేకుండా మహిళా కోటా అమలు! PM Modi: రాజ్యసభలో క్రమశిక్షణకు ఆయనొక పాఠం: హరివంశ్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్న ప్రధాని.. Constitution Amendment Bill: రాజ్యాంగ సవరణపై పార్లమెంట్‌లో రచ్చ.. బిల్లును వ్యతిరేకించిన విపక్షాలు! Earthquake: ఏపీలో భూ ప్రకంపనలు.. భయంతో వీధుల్లోకి పరుగులు తీసిన జనం! Automatic Mist Spraying: చంద్రబాబు చల్లని ఐడియా... ఏపీ రోడ్లపై 'ఆటోమేటిక్ మిస్ట్ స్ప్రేయింగ్'...! Chandrababu: చంద్రబాబు నేటి షెడ్యూల్... పార్టీ కార్యాలయానికి సీఎం, అనంతరం కీలక సమీక్ష! AP Investments: ఏపీలో మరో భారీ పరిశ్రమ... రూ.8,175 కోట్లతో..!! ఆ జిల్లాకు మహర్దశ! AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు శుభవార్త... మీ ఖాతాలో డబ్బులు పడ్డాయ్.! ఒక్కొక్కరికి రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు TTD Updates: 6 అంతస్తుల భవనం.. అద్భుత వసతులు: టీటీడీ జేఈవో క్షేత్రస్థాయి పరిశీలన.! Telangana Politics: తేజస్వి సూర్య వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి వివరణ.. వివాదాస్పద మాటల ఉపసంహరణ! Parliament: 2029 లక్ష్యంగా కేంద్రం మాస్టర్ ప్లాన్.. జనగణనతో సంబంధం లేకుండా మహిళా కోటా అమలు! PM Modi: రాజ్యసభలో క్రమశిక్షణకు ఆయనొక పాఠం: హరివంశ్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్న ప్రధాని.. Constitution Amendment Bill: రాజ్యాంగ సవరణపై పార్లమెంట్‌లో రచ్చ.. బిల్లును వ్యతిరేకించిన విపక్షాలు! Earthquake: ఏపీలో భూ ప్రకంపనలు.. భయంతో వీధుల్లోకి పరుగులు తీసిన జనం! Automatic Mist Spraying: చంద్రబాబు చల్లని ఐడియా... ఏపీ రోడ్లపై 'ఆటోమేటిక్ మిస్ట్ స్ప్రేయింగ్'...! Chandrababu: చంద్రబాబు నేటి షెడ్యూల్... పార్టీ కార్యాలయానికి సీఎం, అనంతరం కీలక సమీక్ష! AP Investments: ఏపీలో మరో భారీ పరిశ్రమ... రూ.8,175 కోట్లతో..!! ఆ జిల్లాకు మహర్దశ! AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు శుభవార్త... మీ ఖాతాలో డబ్బులు పడ్డాయ్.! ఒక్కొక్కరికి రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు

Nara Lokesh: విజిలెన్స్ నివేదిక వచ్చాక మాజీ వీసీ ప్రసాదరెడ్డిపై కఠినచర్యలు! శతాబ్ది ఉత్సవాలను ఘనంగా..

Nara Lokesh Comments On YCP: గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్ర యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చేశారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

Published : 2026-02-27 13:01:00
  • గత ప్రభుత్వంలో ఏయూని వైసీపీ కార్యాలయంగా మార్చేశారు!
     
  • 30 రోజుల్లో ఆడిట్ పూర్తిచేసి అనర్హులపై కఠిన చర్యలు..
     

Nara Lokesh Comments On YCP: గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్ర యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చేశారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖ సిటీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ... ఆంధ్రా యూనివర్సిటీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై చర్యలు చేపట్టాలని, వర్సిటీలోని వివిధ వసతి గృహాలు, విభాగాల్లో పనిచేస్తున్న రోజువారీ వేతన సిబ్బంది, ఎన్ఎంఆర్, 28రోజుల వేతన ఉద్యోగులను కనీస వేతన శ్రేణి ఉద్యోగులుగా (ఎంటిఎస్) పరిగణించడం, దీర్ఘకాలంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని విజ్జప్తి చేశారు. 

దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ... ఏపీలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో గత ఐదేళ్లలో వైసీపీ కార్యకర్తలను విచ్చలవిడిగా వివిధ పోస్టుల్లో నియమించుకున్నారు. దానిపై ఇప్పుడు ప్రత్యేకంగా మ్యాన్ పవర్ ఆడిట్ నిర్వహిస్తున్నాం. రాబోయే 30 రోజుల్లో ఆడిట్ పూర్తిచేసి అనర్హులపై కఠిన చర్యలు తీసుకుంటాం. కాంట్రాక్ట్, ఎంటిఎస్ సిబ్బంది రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నారు. మ్యాన్ పవర్ ఆడిట్ తర్వాత ఫైనాన్స్ తో సంప్రదించి తగు చర్యలు తీసుకుంటాం. 

మాజీ వీసీ ప్రసాదరెడ్డి అవతవకలపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఆ నివేదిక రాబోయే 45రోజుల్లో వస్తుంది, ఆ రిపోర్టు వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రావర్సిటీ 2019లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో 29వ ర్యాంక్ లో ఉండగా, 2023నాటికి 76వ ర్యాంక్ కు పడిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక 41వ ర్యాంకుకు తెచ్చాం. ఇప్పుడు టాప్ -10లోకి తేవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. యూనివర్సిటీ కేటగిరిలో 2019లో 16వ ర్యాంకులో ఉండగా, 2023నాటికి 43వ ర్యాంకుకు పడిపోయింది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2025లో 23వ ర్యాంకుకు తెచ్చాం. వందేళ్ల ఉత్సవాలను ఘనంగా జరపాలని గౌరవ సభ్యులు కోరారు. రేపు విశాఖ పర్యటనలో వీసీని కలిసి కార్యక్రమ నిర్వహణపై సమీక్షిస్తా. సభ్యులు కూడా తమ అభిప్రాయాలను తెలియజేస్తే ఘనంగా శతాబ్ది ఉత్సావాల నిర్వహణకు చర్యలు చేపడతామని మంత్రి లోకేష్ చెప్పారు.

Spotlight

Read More →