PrajaDarbar: 88వ రోజూ ఆగని ప్రజాప్రవాహం... ప్రజాదర్బార్‌లో మంత్రి అభయహస్తం! Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు! Pulivendula: పులివెందులలో గంజాయి, అక్రమ మద్యం ముఠా గుట్టురట్టు! 18 మంది అరెస్ట్! Chinta Mohan: అమరావతి కాదు.. అది చంద్రావతి.. రాజధానిపై చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు! Revanth Reddy: కీలక మలుపుగా రేవంత్ ఢిల్లీ టూర్.. జనాభా ఒక్కటే ప్రాతిపదిక కావ! Chandrababu: నేషనల్ క్వాంటమ్ మిషన్ భాగస్వామ్యంతో ఏపీ అడుగులు.. ఐఐటీ ప్రొఫెసర్ల ప్రశంసలు.. Ambedkar Jayanti: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు... రాష్ట్రవ్యాప్తంగా నివాళులర్పించిన మంత్రులు! Women Reservation Bill: మహిళా బిల్లుకు మద్దతుగా ఢిల్లీకి కూటమి నేతలు... నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ ! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు... మూడు నగరాల నుండి నేరుగా సర్వీసులు! Anna Canteens: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్... ఈ నెల 15 నుంచి మరో 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం! PrajaDarbar: 88వ రోజూ ఆగని ప్రజాప్రవాహం... ప్రజాదర్బార్‌లో మంత్రి అభయహస్తం! Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు! Pulivendula: పులివెందులలో గంజాయి, అక్రమ మద్యం ముఠా గుట్టురట్టు! 18 మంది అరెస్ట్! Chinta Mohan: అమరావతి కాదు.. అది చంద్రావతి.. రాజధానిపై చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు! Revanth Reddy: కీలక మలుపుగా రేవంత్ ఢిల్లీ టూర్.. జనాభా ఒక్కటే ప్రాతిపదిక కావ! Chandrababu: నేషనల్ క్వాంటమ్ మిషన్ భాగస్వామ్యంతో ఏపీ అడుగులు.. ఐఐటీ ప్రొఫెసర్ల ప్రశంసలు.. Ambedkar Jayanti: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు... రాష్ట్రవ్యాప్తంగా నివాళులర్పించిన మంత్రులు! Women Reservation Bill: మహిళా బిల్లుకు మద్దతుగా ఢిల్లీకి కూటమి నేతలు... నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ ! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు... మూడు నగరాల నుండి నేరుగా సర్వీసులు! Anna Canteens: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్... ఈ నెల 15 నుంచి మరో 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం!

AP Govrnt: ఏపీ నూతన సీఎస్‌గా జి. సాయి ప్రసాద్: నేడు సచివాలయంలో పదవీ బాధ్యతల స్వీకారం!

AP Government CS G. Saiprasad: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయి ప్రసాద్ శనివారం ఎపి సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

Published : 2026-02-27 12:45:00
  • ప్రభుత్వ పగ్గాలు చేపట్టనున్న 1991 బ్యాచ్ ఐఏఎస్: శనివారం ఉదయం 11.33 గంటలకు ముహూర్తం ఖరారు..
     
  • వరంగల్ అసిస్టెంట్ కలెక్టర్ నుంచి రాష్ట్ర సీఎస్ వరకు: సాయి ప్రసాద్‌ 33 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం..

AP Government CS G. Saiprasad: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయి ప్రసాద్ శనివారం ఎపి సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత నవంబరు 29వ తేదీన జిఓఆర్టి సంఖ్య 2230 ద్వారా ప్రస్తుత సిఎస్ విజయానంద్ పదవీ కాలాన్ని మూడు మాసాలు అనగా ఈనెల 28వ తేదీ వరకూ పొడిగిస్తూ తదుపరి సిఎస్ గా ప్రస్తుతం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా మరియు ఇఓ స్పెషల్ సిఎస్ టు సియంగా ఉన్నసాయి ప్రసాద్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమేరకు శనివారం ఉ.11.33 గం.లకు ఎపి సచివాలయంలో సాయి ప్రసాద్ నూతన సిఎస్ గా పదవీ బాధ్యతలు చేపడతారు.

1991 ఐఏఎస్ బ్యాచ్ ఎపి క్యాడర్ కు చెందిన సాయి ప్రసాద్ ఎంటెక్ పట్టభద్రులు కాగా 1991 సెప్టెంబరు 15న ఐఏఎస్ కు ఎంపికై 1992 జూన్ నుండి 1993 మే వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వరంగల్ అసిస్టెంట్ కలక్టర్ గా పని చేశారు. అనంతరం 1993 సెప్టెంబరు నుండి 1995 ఏప్రిల్ వరకు పాడేరు అసిస్టెంట్ కలక్టర్ గా,1995 ఆగస్టు నుండి 1997 మార్చి వరకు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ గా పని చేశారు. అనంతరం 1997 మే నుండి 1998 ఆగస్టు వరకు కడప జాయింట్ కలక్టర్ గా,2000 జూలై నుండి 2003 జూన్ వరకూ కర్నూల్ కలక్టర్ గా, 2003 జూన్ నుండి 2003 అక్టోబరు వరకు చిత్తూరు జిల్లా కలక్టర్ గాప పనిచేశారు. 2003 అక్టోబరు నుండి 2004 ఆగస్టు వరకు ఎపి ట్రాన్సుకో జెఎండిగా,2004 ఆగస్టు నుండి 2006 మే వరకు ఇపిడిపిసిఎల్ సిఎండిగా,2006 మే నుండి 2010 ఫిబ్రవరి వరకు ఎపి సిపిడిసిఎల్ సిఎండిగా పని చేశారు.

2010 ఫిబ్రవరి నుండి 2011 అక్టోబరు వరకు ఎపి హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా పని చేశారు.
అనంతరం 2011 అక్టోబరు నుండి 2014 జూన్ వరకు కేంద్ర ప్రభుత్వ ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. తదుపరి 2014 జూన్ నుండి 2016 ఫిబ్రవరి వరకు సియం కార్యదర్శిగా,2016 ఫిబ్రవరి నుండి 2019 మే వరకు సియం ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. తదుపరి 2020 జనవరి నుండి 2022 ఫిబ్రవరి వరకు ఎపి సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రవేట్ లిమిటెడ్ కు సిఎండి గాను మరియు ఇంధన శాఖ ఎక్స్ అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీగాను పని చేశారు.అనంతరం 2022 ఫిబ్రవరి నుండి 2024 జూన్ వరకు సిసిఎల్ఏగా పనిచేశారు. తదుపరి 2024 జూన్ నుండి 2025 జనవరి జలవరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ 2025 జనవరి నుండి అదే హోదాలో పనిచేస్తూ సిఎం ఎక్స్ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగాను పని చేస్తున్నసాయి ప్రసాద్ శనవారం నూతన సిఎస్ గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

Spotlight

Read More →