Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్.. మరో కేసు నమోదు! ఈసారి పక్కాగా జైలుకేనా..? Qatar: ఖతార్‌లో మిన్నంటిన బాబు జన్మదిన వేడుకలు.. భారీగా తరలివచ్చిన ఎన్‌ఆర్‌ఐలు! Chandrababu Campaign: తమిళనాడులో రెండో రోజు చంద్రబాబు ప్రచారం.. నేడు విరుధునగర్ జిల్లాలో పర్యటన! AP Government: గ్రామీణ పేదలకు వరంగా మారిన ఉపాధి హామీ.. భారీగా నిధులు విడుదల! AP Employees: ఏపీలో ఉద్యోగుల స్థానికతపై కీలక నిర్ణయం.. అమల్లోకి కొత్త నిబంధనలు! Praja Vedika: నేడు (21/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Green Field Highway: తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ హైవే షురూ.... దశాబ్దాల కల! 4 గంటల సమయం ఆదా.... Chandrababu: పుట్టినరోజు నాడు కీలకమైన ఫైలుపై చంద్రబాబు సంతకం! రూ.56.39 కోట్ల - 7,074 మంది లబ్ధిదారులకు! Praja Vedika: వైసీపీ నాయకుల కనుసన్నల్లో రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం.. జేసీబీలతో ఇంటి పునాదుల ధ్వంసం! Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్.. మరో కేసు నమోదు! ఈసారి పక్కాగా జైలుకేనా..? Qatar: ఖతార్‌లో మిన్నంటిన బాబు జన్మదిన వేడుకలు.. భారీగా తరలివచ్చిన ఎన్‌ఆర్‌ఐలు! Chandrababu Campaign: తమిళనాడులో రెండో రోజు చంద్రబాబు ప్రచారం.. నేడు విరుధునగర్ జిల్లాలో పర్యటన! AP Government: గ్రామీణ పేదలకు వరంగా మారిన ఉపాధి హామీ.. భారీగా నిధులు విడుదల! AP Employees: ఏపీలో ఉద్యోగుల స్థానికతపై కీలక నిర్ణయం.. అమల్లోకి కొత్త నిబంధనలు! Praja Vedika: నేడు (21/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Green Field Highway: తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ హైవే షురూ.... దశాబ్దాల కల! 4 గంటల సమయం ఆదా.... Chandrababu: పుట్టినరోజు నాడు కీలకమైన ఫైలుపై చంద్రబాబు సంతకం! రూ.56.39 కోట్ల - 7,074 మంది లబ్ధిదారులకు! Praja Vedika: వైసీపీ నాయకుల కనుసన్నల్లో రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం.. జేసీబీలతో ఇంటి పునాదుల ధ్వంసం!

Nara Lokesh Speech: ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 943 సేవలు.. త్వరలో 2.0 ప్రారంభిస్తాం!

Nara Lokesh Speech About Whats UP: ప్రస్తుతం రాష్ట్రంలో మనమిత్ర ద్వారా 943 సేవలు అందిస్తున్నాం. ఇప్పటివరకు ఈ యాప్ ద్వారా 1.48కోట్ల సేవలు అందించాం. వాట్సాప్ సర్సీసులపై వినియోగదారుల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటున్నాం.

Published : 2026-02-27 12:30:00
  • శాసనసభలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్..
     
  • ఈరోజు అన్ని సేవలు సెల్ ఫోన్ లో..
     

Nara Lokesh Speech About Whats UP: ప్రస్తుతం రాష్ట్రంలో మనమిత్ర ద్వారా 943 సేవలు అందిస్తున్నాం. ఇప్పటివరకు ఈ యాప్ ద్వారా 1.48కోట్ల సేవలు అందించాం. వాట్సాప్ సర్సీసులపై వినియోగదారుల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటున్నాం. ఏఐ ఇంటిగ్రేషన్ చేసి ఈ యాప్ ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మనమిత్ర వాట్సాప్ సేవలపై శాసనసభలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ... వాట్సాప్ సేవలవల్ల సమయం ఆదా అవుతోంది.  ఎటువంటి ఫీజు లేకుండా సేవలందించడం హర్షణీయం. అయితే యాప్ బాగా స్లోగా ఉండటం వల్ల అందరూ ఉపయోగించుకోలేక పోతున్నారు. 

ఇతర యాప్ ల మాదిరి ఒకసారి వివరాలు నమోదుచేశాక మళ్లీ చేసే అవసరం లేకుండా చూడాలి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కూడా ఉపయోగించుకునేలా మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దాలని కోరారు. మంత్రి లోకేష్ సమాధానమిస్తూ... మనమిత్ర ప్లాట్ ఫాంపై మేం ఎలాంటి డేటా స్టోర్ చేయడం లేదు. వాట్సాప్ అనేది ఒక హైవే. డేటా డిపార్ట్ మెంట్ వద్ద ఉంటుంది. దీనివల్ల ప్రతిసారి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం వివిధ విభాగాల్లో ప్రాసెస్ ను డిజిటలైజ్ మాత్రమే చేయడం జరిగింది. ఇప్పుడు ప్రాసెస్ రీ ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. 

ఈరోజు అన్ని సేవలు సెల్ ఫోన్ లో ఒక్క బటన్ నొక్కడం ద్వారా ఇంటి ముంగిటకు వస్తున్నాయి. అదే బటన్ ద్వారా ప్రజలకు అవసరమైన పౌరసేవలు, సర్టిఫికెట్లు అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన నాకు యువగళం పాదయాత్ర సమయంలో వచ్చింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సింగిల్ ఫోన్ నెంబర్ ద్వారా పెద్దఎత్తున వాట్సాప్ సేవలు అందిస్తున్నాం. ఇంకా స్పీడ్ పెంచాలి, వెనువెంటనే రిసీట్ రావాలి, క్యూ ఆర్ కోడ్ సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు. సభ్యులు మినమిత్ర యాప్ కు సంబంధించి ఫీడ్ బ్యాక్ ఇవ్వండి. 90రోజుల యాక్షన్ ప్లాన్ తీసుకొని మనమిత్ర 2.0 ప్రారంభిస్తాం. దీనిపై డోర్ టు డోర్ టు క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉందని మంత్రి లోకేష్ చెప్పారు.

Spotlight

Read More →