ఇరాన్–అమెరికా సంబంధాల్లో ఒక ముఖ్యమైన పరిణామం..
ఇరాన్‌కు చెందిన ఫ్రీజ్ చేసిన ఆస్తులను విడుదల..
ఇస్లామాబాద్‌లో జరుగుతున్న కీలక చర్చల మధ్య ఇరాన్–అమెరికా సంబంధాల్లో ఒక ముఖ్యమైన పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఒక సీనియర్ ఇరాన్ వర్గం వెల్లడించిన వివరాల ప్రకారం, అమెరికా ప్రభుత్వం ఖతార్ సహా ఇతర విదేశీ బ్యాంకుల్లో నిల్వలో ఉన్న ఇరాన్‌కు చెందిన ఫ్రీజ్ చేసిన ఆస్తులను విడుదల చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఈ విషయంపై ఇరాన్ అధికార వర్గాలు సానుకూలంగా స్పందించాయి. ఇది వాషింగ్టన్‌తో జరుగుతున్న చర్చల్లో భాగంగా తీసుకున్న నిర్ణయం అని భావిస్తున్నట్లు ఆ వర్గం తెలిపింది. అయితే ఈ అంశంపై అమెరికా ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
సున్నితమైన విషయం కావడంతో తన పేరు వెల్లడించకూడదని కోరిన ఆ ఇరాన్ వర్గం, ఈ ఆస్తుల విడుదల నిర్ణయం ఒక కీలక అంశానికి అనుసంధానమై ఉందని వెల్లడించింది. ముఖ్యంగా స్ట్రెయిట్ ఆఫ్ హొర్మూజ్ లో నౌకాయానానికి భద్రత కల్పించడం ఈ చర్చల్లో ప్రధాన అజెండాగా ఉన్నట్లు పేర్కొంది.
ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే ఈ సముద్ర మార్గం భద్రతపై ఎప్పటినుంచో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్తుల విడుదల, హోర్ముజ్ జలసంధిలో సురక్షిత ప్రయాణం మధ్య సంబంధం ఉందని వెల్లడించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇస్లామాబాద్ చర్చలు ఏ దిశగా సాగుతాయో అనే ఆసక్తి అంతర్జాతీయ వర్గాల్లో పెరుగుతోంది. ఈ నిర్ణయం నిజంగా అమల్లోకి వస్తే, ఇరాన్‌కు ఆర్థికంగా కొంత ఊరట లభించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.