Fuel Stations: ఇకపై పెట్రోల్ బంకుల్లో కొత్త ఆప్షన్లు... ఆ ఇంధనం కూడా అందుబాటులోకి.. కేంద్రం ప్రణాళికలు! LEAP School: తొలి ‘లీప్’ స్కూల్ ప్రారంభం... దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా!! NEET-UG: నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్! Government Colleges: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 11 కొత్త కోర్సులు... చదువుతో పాటు నెలకు రూ.7 వేల స్టైపెండ్! AP Students: ఏపీ విద్యాశాఖ సంచలన నిర్ణయం... స్కూల్ విద్యార్థుల బదిలీలకు కొత్త విధానం! AP EAPCET: ఏపీ ఈఏపీసెట్ రాసిన విద్యార్థులకు అలర్ట్.. రేపే ప్రాథమిక కీ విడుదల! NEET UG: నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ కీలక చర్యలు! కెమిస్ట్రీ లెక్చరర్ అరెస్ట్! NEET UG 2026: నీట్ యూజీ అభ్యర్థులకు అలర్ట్... నీట్ రీ ఎగ్జామ్ తేదీ ఖరారు! NEET: దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దు.. ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలతో కలకలం! Anagani Satya Prasad: ముస్లీమ్ విద్యార్థులకు కూటమి ప్రభుత్వ సువర్ణ అవకాశం! పేద విద్యార్థులకు కార్పొరేట్ కాలేజీల్లో ఉచిత ఇంటర్ విద్య! Fuel Stations: ఇకపై పెట్రోల్ బంకుల్లో కొత్త ఆప్షన్లు... ఆ ఇంధనం కూడా అందుబాటులోకి.. కేంద్రం ప్రణాళికలు! LEAP School: తొలి ‘లీప్’ స్కూల్ ప్రారంభం... దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా!! NEET-UG: నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్! Government Colleges: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 11 కొత్త కోర్సులు... చదువుతో పాటు నెలకు రూ.7 వేల స్టైపెండ్! AP Students: ఏపీ విద్యాశాఖ సంచలన నిర్ణయం... స్కూల్ విద్యార్థుల బదిలీలకు కొత్త విధానం! AP EAPCET: ఏపీ ఈఏపీసెట్ రాసిన విద్యార్థులకు అలర్ట్.. రేపే ప్రాథమిక కీ విడుదల! NEET UG: నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ కీలక చర్యలు! కెమిస్ట్రీ లెక్చరర్ అరెస్ట్! NEET UG 2026: నీట్ యూజీ అభ్యర్థులకు అలర్ట్... నీట్ రీ ఎగ్జామ్ తేదీ ఖరారు! NEET: దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దు.. ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలతో కలకలం! Anagani Satya Prasad: ముస్లీమ్ విద్యార్థులకు కూటమి ప్రభుత్వ సువర్ణ అవకాశం! పేద విద్యార్థులకు కార్పొరేట్ కాలేజీల్లో ఉచిత ఇంటర్ విద్య!

CBSE 10th Result 2026: సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు.. వచ్చే వారమే విడుదల?ఈసారి ముందే ఫలితాలు.. కారణం అదేనా..!

CBSE 10th Result 2026: CBSE 10వ తరగతి 2026 ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. మే మొదటి వారంలో ఫలితాలు వచ్చే అవకాశం ఉండటంతో, సుమారు 25 లక్షల మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మీ మార్కులను cbse.gov.in లో ఎలా చూసుకోవాలో

Published : 2026-04-11 19:25:00

CBSE 10th Result 2026: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సీబీఎస్ఈ (CBSE) 10వ తరగతి ఫలితాల సందడి మొదలైంది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి పరీక్షల ఫలితాలను బోర్డు వచ్చే వారమే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రతి ఏటా మే నెల మధ్యలో ఈ ఫలితాలు వస్తుంటాయి, కానీ ఈసారి అంతకంటే ముందే వెల్లడించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం, ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టిన 'సెషన్-2' పరీక్షలు. మే నెలలో ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు ఉండటంతో, విద్యార్థులకు తగిన సమయం ఇచ్చేందుకు బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈ ఏడాది సీబీఎస్ఈ పరీక్షలకు భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 43 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాయగా, అందులో కేవలం 10వ తరగతి నుంచే సుమారు 25 లక్షల మంది ఉన్నారు. ఫిబ్రవరి 17న ప్రారంభమైన ఈ పరీక్షలు మార్చి 11వ తేదీతో ముగిశాయి. పరీక్షలు రాసినప్పటి నుంచి విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లో కూడా ఫలితాల పట్ల ఉత్కంఠ నెలకొంది. బోర్డు నుంచి ఇంకా అధికారిక తేదీ ఖరారు కానప్పటికీ, ఏ క్షణమైనా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ మార్కులను బోర్డు అధికారిక వెబ్‌సైట్లలో చూసుకోవచ్చు. cbse.gov.in లేదా results.nic.in వంటి వెబ్‌సైట్లలో మీ రోల్ నంబర్, స్కూల్ నంబర్  పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి మార్క్స్ మెమో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా డిజీలాకర్  ఉమాంగ్  యాప్‌లలో కూడా డిజిటల్ మార్క్ షీట్లు అందుబాటులో ఉంటాయి. ఈ డిజిటల్ సర్టిఫికెట్లు అన్ని రకాల పైచదువుల ప్రవేశాలకు చెల్లుబాటు అవుతాయని బోర్డు స్పష్టం చేసింది.

ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధన విద్యార్థులకు పెద్ద ఊరటనిస్తోంది. పదిలో తక్కువ మార్కులు వచ్చిన వారు లేదా ఫెయిల్ అయిన వారు తమ స్కోరును మెరుగుపరుచుకోవడానికి గరిష్టంగా మూడు సబ్జెక్టులలో సెషన్-2 పరీక్షలు రాసుకోవచ్చు. దీనివల్ల విద్యార్థులు ఒక ఏడాది నష్టపోకుండా అదే సంవత్సరంలో తమ ఫలితాలను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. ఈ మార్పు వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతానికి 12వ తరగతి పరీక్షలు నిన్ననే  ముగిశాయి. వాటి ఫలితాలు కూడా త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఫలితాల కోసం చూస్తున్న విద్యార్థులు ఎప్పటికప్పుడు బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండాలి. 

Spotlight

Read More →