Minister Savitha: ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం.. భావితరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందిద్దాం.. మంత్రి సవిత! Motorola: భారత్‌లో సరికొత్త 'రేజర్ ఫోల్డ్' మొబైల్ లాంచ్! అదిరిపోయే ఫీచర్లు... ధర ఎంతో తెలుసా! Amit Shah: రూ.182 కోట్ల క్యాప్టగాన్ డ్రగ్‌ స్వాధీనం.. “ఆపరేషన్ రేజ్‌పిల్”లో భారీ విజయం! Health Tips: ఆరోగ్యమే మహాభాగ్యం... ఈ ఆహారాలతో రక్తహీనతకు సులభంగా చెక్ పెట్టవచ్చు! Hardik Pandya: ఒకపక్క వెన్నునొప్పి, మరోపక్క రెండో పెళ్లి వార్తలు.. సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యా హల్‌చల్! MangoCity Of India: మ్యాంగో సిటీ ఆఫ్ ఇండియా... ఇక్కడ పండే మామిడి రుచే వేరబ్బ!! Tollywood Heronie: బ్రేకప్ పెయిన్ నుంచి బయటపడి.. యువతకు ప్రేమ పాఠాలు చెప్తున్న హీరోయిన్! ప్రేమ అనేది ఒక్కసారే కాదు.. Donald Trump: జలసంధి తెరిచి ఉంచాల్సిందే..మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతున్న ట్రంప్‌.. వచ్చే వారంలో ఇరాన్‌పై భీకర దాడులు? Swatch Andhra: గ్రామాల పరిశుభ్రతకు ప్రజల భాగస్వామ్యం అవసరం.. మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి! APSRTC: తిరుపతి భక్తులకు గుడ్ న్యూస్... త్వరలో అందుబాటులోకి ఆర్టీసీ టూరిజం! Minister Savitha: ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం.. భావితరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందిద్దాం.. మంత్రి సవిత! Motorola: భారత్‌లో సరికొత్త 'రేజర్ ఫోల్డ్' మొబైల్ లాంచ్! అదిరిపోయే ఫీచర్లు... ధర ఎంతో తెలుసా! Amit Shah: రూ.182 కోట్ల క్యాప్టగాన్ డ్రగ్‌ స్వాధీనం.. “ఆపరేషన్ రేజ్‌పిల్”లో భారీ విజయం! Health Tips: ఆరోగ్యమే మహాభాగ్యం... ఈ ఆహారాలతో రక్తహీనతకు సులభంగా చెక్ పెట్టవచ్చు! Hardik Pandya: ఒకపక్క వెన్నునొప్పి, మరోపక్క రెండో పెళ్లి వార్తలు.. సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యా హల్‌చల్! MangoCity Of India: మ్యాంగో సిటీ ఆఫ్ ఇండియా... ఇక్కడ పండే మామిడి రుచే వేరబ్బ!! Tollywood Heronie: బ్రేకప్ పెయిన్ నుంచి బయటపడి.. యువతకు ప్రేమ పాఠాలు చెప్తున్న హీరోయిన్! ప్రేమ అనేది ఒక్కసారే కాదు.. Donald Trump: జలసంధి తెరిచి ఉంచాల్సిందే..మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతున్న ట్రంప్‌.. వచ్చే వారంలో ఇరాన్‌పై భీకర దాడులు? Swatch Andhra: గ్రామాల పరిశుభ్రతకు ప్రజల భాగస్వామ్యం అవసరం.. మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి! APSRTC: తిరుపతి భక్తులకు గుడ్ న్యూస్... త్వరలో అందుబాటులోకి ఆర్టీసీ టూరిజం!

Amit Shah: రూ.182 కోట్ల క్యాప్టగాన్ డ్రగ్‌ స్వాధీనం.. “ఆపరేషన్ రేజ్‌పిల్”లో భారీ విజయం!

Amit Shah: భారత్‌లో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో భారత దర్యాప్తు సంస్థలు “ఆపరేషన్ రేజ్‌పిల్” పేరుతో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో రూ.182 కోట్ల విలువైన క్యాప్టగాన్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నాయి.

Published : 2026-05-16 18:58:00

“డ్రగ్ ఫ్రీ ఇండియా” లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు..

మిడిల్ ఈస్ట్ దేశాలకు తరలించేందుకు సిద్ధం చేసిన భారీ డ్రగ్‌ సరుకు..

భారత్‌లో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో భారత దర్యాప్తు సంస్థలు “ఆపరేషన్ రేజ్‌పిల్” పేరుతో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో రూ.182 కోట్ల విలువైన క్యాప్టగాన్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. “డ్రగ్ ఫ్రీ ఇండియా” లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు. మిడిల్ ఈస్ట్ దేశాలకు తరలించేందుకు సిద్ధం చేసిన భారీ డ్రగ్‌ సరుకును స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఈ కేసులో ఓ విదేశీ వ్యక్తిని అరెస్టు చేయడం భారత భద్రతా సంస్థల అప్రమత్తతకు నిదర్శనమని పేర్కొన్నారు.

భారత భూభాగాన్ని ఉపయోగించి ఒక్క గ్రాము మాదకద్రవ్యమూ దేశంలోకి రాకూడదని, బయటకు వెళ్లకూడదని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులను ఆయన అభినందించారు.

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, క్యాప్టగాన్ అనేది “ఫెనెథైలిన్” అనే సింథటిక్ స్టిమ్యులెంట్ డ్రగ్‌కు ప్రాచుర్యంలో ఉన్న పేరు. దీన్ని మొదట 1960లలో నిద్ర సమస్యలు, ఏకాగ్రత లోపం వంటి వైద్య చికిత్సల కోసం తయారు చేశారు. అయితే, దీనికి తీవ్రమైన వ్యసన లక్షణాలు ఉండటంతో పాటు దుర్వినియోగం పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా నిషేధించారు.

ఇటీవల సంవత్సరాల్లో ఈ డ్రగ్ పేరు అంతర్జాతీయ మీడియాలో తరచుగా వినిపిస్తోంది. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతాల్లో తీవ్రవాద నెట్‌వర్క్‌లు, యుద్ధ ప్రభావిత ప్రాంతాలతో క్యాప్టగాన్ అక్రమ రవాణాకు సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే దీనిని కొంతమంది “జిహాదీ డ్రగ్” అని కూడా పిలుస్తున్నారు.

భారత్‌లో ఇలాంటి మాదకద్రవ్యాల రాకపోకలను అడ్డుకునేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు మరింత అప్రమత్తంగా పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు.

Spotlight

Read More →