వైసీపీ నాయకులు యూరియా ధర ఎంత ఉంటుందో కూడా గ్రహించలేకపోతున్నారు. అసత్య ప్రచారంతో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నంలోనే ఉన్నారు. ఇది కేవలం ఒక వ్యక్తి సమస్య కాదు, మొత్తం పార్టీ నాయకుల ఆలోచనా విధానం. రైతుల సంక్షేమం గురించి మాట్లాడే ముందు, వారికి యూరియా ధర ఎంత ఉంటుందో, సబ్సిడీ ఎలా లభిస్తుందో తెలుసుకోవడం కనీస బాధ్యత. కేవలం రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలు వాదనలు చేస్తూ, వాస్తవాలను విస్మరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.
ప్రతిపక్ష నాయకులు డిబేట్‌లో పాల్గొనే ముందు యూరియా ధరల గురించి తెలుసుకొని వెళ్లడం మంచిదంటున్నారు రాష్ట్ర ప్రజలు. 45 కిలోల యూరియా బస్తా అసలు ధర దాదాపు రూ. 2234. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రూ. 1967 సబ్సిడీ ఇస్తుంది, దీనితో రైతులకు ఒక బస్తా సుమారు రూ. 266.50కి లభిస్తుంది. రైతు భరోసా కేంద్రాలు (RBK) మరియు సహకార సంఘాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ యూరియాను పంపిణీ చేస్తుంది.
ఇందులో భాగంగానే ప్రైమ్ 9 న్యూస్‌లో జరిగిన డిబేట్‌లో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ, ఒక బస్తా యూరియా ధర ఎంత అని ప్రశ్నించగా YSRCP నాయకుడు చిన్నపరెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతూ నవ్వుల పాలయ్యారు. యూరియా ధర గురించి మాట్లాడకుండా, వితండవాదంగా, వాదనకు తగిన ఆధారాలు లేకుండా వక్రీకరించి మాట్లాడుతున్నారు చిన్నపరెడ్డి. ప్రైమ్ 9 టీవీ యాంకర్ అడిగిన యూరియా ధర చెప్పలేకపోవడం ప్రతిపక్ష పార్టీపై వ్యతిరేకతను పెంచుతుందనడంలో సందేహం లేదు. ఒక్క చిన్నపరెడ్డి కాదు, ఆ పార్టీలోని నాయకులందరూ ఇలాగే విషయాన్ని వక్రీకరించి మాట్లాడటం విశేషం.
పక్క రాష్ట్రంలో కూడా ఇదే సమస్య ఉన్నప్పటికీ, కేవలం ప్రభుత్వంపై విష ప్రచారం చేసే అంశంతో వైసీపీ నాయకులు చేస్తున్న ఎత్తుగడలకు ఇదొక ఉదాహరణ. సాంప్రదాయ యూరియా బస్తాలకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా అందుబాటులో ఉంది. అర లీటరు నానో యూరియా సీసా ధర సుమారు రూ. 225 ఉంటుంది. ఇది ఒక బస్తా యూరియాకు సమానమైన పోషకాలను అందిస్తుంది. ఈ విషయాన్ని వైసీపీ నాయకులు ఎందుకు మర్చిపోతున్నారో వారి విజ్ఞతకే వదిలేయాలి.