హాలీవుడ్ (Hollywood) లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ రూపొందిస్తోన్న అద్భుత విజువల్ ఫ్రాంచైజీ ‘అవతార్’ సిరీస్ నుంచి కొత్త భాగమైన ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఈ ట్రైలర్ అంచనాలకు తగ్గట్టుగానే అద్భుత గ్రాఫిక్స్, థ్రిల్లింగ్ ఎఫెక్ట్స్, హార్ట్‌టచ్ మ్యూజిక్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇప్పటికే విడుదలైన ‘అవతార్’ (2009), ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ ( Avatar The Way of Water) (2022) ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించి, అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాలుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వచ్చిన ఈ మూడో భాగం ట్రైలర్ చూస్తే, ఈసారి కథ మరింత డార్క్, డెయింజరస్ మరియు ఎమోషనల్‌గా సాగనుందని తెలుస్తోంది.
పండోరా ప్రపంచంలోని కొత్త మూలకాలు, ముఖ్యంగా అగ్నితో సంబంధించిన అంశాలు ఇందులో ప్రధానంగా ఉండబోతున్నట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఈ భాగంలో పాత పాత్రలు తిరిగి కనిపించడమే కాక, కొత్త పాత్రలు కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. జేమ్స్ కామెరూన్ తన స్టోరీటెలింగ్ స్కిల్స్‌తో మరోసారి విజువల్ మాజిక్ సృష్టించనున్నట్లు స్పష్టమవుతోంది.
ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 19, 2025 న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. అత్యంత భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ చిత్రం కూడా బాక్సాఫీస్‌పై సంచలనం సృష్టించే అవకాశాలు ప్రబలంగా కనిపిస్తున్నాయి. ట్రైలర్ విడుదలైన కొద్ది సేపట్లోనే మిలియన్ల వ్యూస్‌ను క్రోసం చేస్తూ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.