వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు, మాచర్ల మున్సిపల్ మాజీ ఛైర్మన్ తురకా కిశోర్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై ఇక ఎలాంటి ఎఫ్ఆర్ నమోదు చేయకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో కిశోర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పటి వరకు తనపై 9 కేసులు నమోదు చేశారని అందులో పేర్కొన్నారు. వీటితో పాటు... మరికొన్ని ఎఫ్ ఆర్ నమోదు చేయడానికి సిద్దం అయ్యారని కిషోర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. రిట్ పిటిషన్ విచారణకు స్వీకరించడానికి నిరాకరిస్తూ జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం డిస్మిస్ చేసింది.