అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రాంతంలో ఓవర్‌లోడ్ వాహనాలపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సీరియస్ అయ్యారు. ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న అనేక వాహనాలను స్వయంగా ఆపి, వాటి లోడు బరువు బిల్లులను స్వయంగా పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను పోలీసుల ఆధీనంలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాళ్లపాలెం వంతెన ఇప్పటికే శిథిలావస్థకు చేరిందని, అక్కడి నుంచి ఓవర్‌లోడ్ వాహనాలు వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ వంతెన కూలిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోందని, అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలకు ప్రమాదం తలెత్తొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
సొంత నియోజకవర్గంలో ప్రజల భద్రత కోసం చేపట్టిన స్పీకర్ చర్యలను స్థానికులు అభినందిస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడడంలో ఆయన చూపిన చొరవ ప్రశంసనీయమంటూ స్పందిస్తున్నారు.