అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌ను తీవ్రంగా హెచ్చరించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తే భారత్‌పై భారీ సుంకాలు విధించాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. రష్యాపై ఆంక్షలు విధించిన అమెరికా, యూరోపియన్ దేశాలు రష్యా ఇంధన వ్యాపారాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నాల్లో భాగంగా, ఆ దేశంతో వ్యాపారం చేసే దేశాలపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి.
ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్, “భారత ప్రధాని నరేంద్ర మోదీతో నేను మాట్లాడాను. ఆయన రష్యా నుంచి చమురు కొనుగోలు చేయబోమని చెప్పాడు” అని తెలిపారు. అయితే, గతవారం ట్రంప్ చేసిన ఇదే వ్యాఖ్యను భారత విదేశాంగ శాఖ స్పష్టంగా ఖండించింది. ఆ రోజు ఇద్దరు నేతల మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని పేర్కొంది. ఈ అంశంపై విలేకరులు ప్రశ్నించగా, ట్రంప్ మాత్రం “వారు అలా చెప్పాలనుకుంటే చెప్పుకోనివ్వండి. కానీ అప్పుడు వారు భారీ సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది. అలా చేయడానికి వారు ఇష్టపడరు” అంటూ పరోక్షంగా భారత్‌పై ఒత్తిడి తీసుకువచ్చారు.
ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభమైన తర్వాత పశ్చిమ దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించాయి. దీతో రష్యా తన చమురును తక్కువ ధరకే విక్రయించడం ప్రారంభించింది. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ భారత్ రష్యా చమురును విస్తృతంగా కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం సముద్ర మార్గం ద్వారా రష్యా చమురును దిగుమతి చేసుకునే ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది. భారత ప్రభుత్వం మాత్రం ప్రజల ప్రయోజనాల దృష్ట్యా తక్కువ ధరకే చమురు కొనుగోలు చేయడం అవసరమని స్పష్టం చేస్తోంది.
ఇప్పటికే అమెరికా భారత్ నుంచి దిగుమతి అయ్యే అనేక వస్తువులపై 50 శాతం వరకు సుంకాలు విధిస్తోంది. రష్యాతో జరిపే లావాదేవీల కారణంగా అదనంగా 25 శాతం జరిమానా కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు చమురు దిగుమతులు కొనసాగితే ఈ సుంకాలను మరింత పెంచుతామని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. మరోవైపు వైట్‌హౌస్ వర్గాలు మాత్రం భారత్ రష్యా చమురు కొనుగోళ్లు సగానికి తగ్గించిందని చెబుతున్నాయి. అయితే, భారత వర్గాలు ఈ వాదనను ఖండిస్తూ నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించిన చమురు ఆర్డర్లు ఇప్పటికే ఖరారయ్యాయని, అందువల్ల దిగుమతుల్లో తక్షణ తగ్గుదల ఉండదని స్పష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ కమోడిటీస్ డేటా సంస్థ ‘కెప్లర్’ అంచనాల ప్రకారం, ఈ నెలలో భారత్ చమురు దిగుమతులు మరో 20 శాతం పెరిగి రోజుకు 1.9 మిలియన్ బ్యారెళ్లకు చేరనున్నాయి.