బ్రకోలీ కాలిఫ్లవర్, క్యాబేజ్ వంటి కూరగాయల తరగతికి చెందినది. ఇది విటమిన్లు, మినరల్స్, ఫైబర్‌తో నిండి ఉంటుంది. ప్రతి రోజు బ్రకోలీ తినడం వల్ల శరీరానికి అనేక రకాల లాభాలు ఉంటాయని ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది చాలా ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు..
బ్రకోలీ ఎముకలకు బలాన్ని ఇస్తుంది బ్రకోలీ లో విటమిన్ కె, కాల్షియం, మెగ్నీషియం వంటి పదార్థాలు ఉండడం వలన ఎముకలు బలంగా ఉంటాయి. అలాగే క్యాన్సర్ నుంచి రక్షణకీ, రక్తంలో చక్కెర నియంత్రణకీ, గుండె ఆరోగ్యానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి వారంలో ఏదో ఒక సందర్భంలో బ్రకోలీని తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
బ్రకోలీలో విటమిన్ సి, జింక్, బీటా-కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉంటాయి. ఇవి శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. అదేవిధంగా ఇన్ఫెక్షన్‌లతో పోరాడటానికి సహాయమవుతుంది. బ్రకోలీలోని సల్ఫోరాఫేన్ అనే పదార్థం వలన క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుందని పలు అధ్యయనాలు తెలిపారు.
బ్రకోలీ గుండె ఆరోగ్యానికి ఎంతో మంచి. ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి విటమిన్ కె, ఫోలేట్ వంటి పదార్థాలు రక్తనాళాల్లో ప్లాక్ ఏర్పడకుండా సహాయపడతాయి.
మెదడుకు బ్రకోలీ చాలా ఉపయోగకరం. ఇందులో విటమిన్ సి, ఇ, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి మెదడు కణాలను రక్షించి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. కోలిన్, విటమిన్ కె వంటి పదార్థాలు ఏకాగ్రత, శ్రద్ధ, మానసిక స్పష్టత కోసం మద్దతు ఇస్తాయి.
జీర్ణక్రియకు బ్రకోలీ ఎంతో సహాయపడుతుంది. ఇందులోని ఫైబర్ పేగులో మలబద్ధక సమస్యలను నివారిస్తుంది. బ్రకోలీలోని ప్రీబయోటిక్స్ మంచి బాక్టీరియాలను పెంచి మొత్తం జీర్ణవ్యవస్థను బలపరుస్తాయి. కాలేయం పని సరిగా ఉండటానికి కూడా ఇది సహాయపడుతుంది.
మీరు తెలుసుకున్న ఆరోగ్య విషయాలు, సలహాలు కేవలం మీ అవగాహన కోసమే. వీటిని పాటించే ముందు తప్పకుండా మీ సొంత వైద్యుడిని సంప్రదించండి.