టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన కాంబినేషన్ రూపుదిద్దుకుంటోంది. వరుస హిట్స్‌తో సక్సెస్ ట్రాక్‌లో ఉన్న నేచురల్ స్టార్ నాని ఓజి దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో కొత్త సినిమా చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ గురించి గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో ఊహాగానాలు నడుస్తుండగా తాజాగా హీరోయిన్‌గా పూజా హెగ్డే ను ఎంపిక చేసినట్టు సమాచారం వెలువడింది. దీంతో ఈ కొత్త జంటపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
ఓజీ సినిమాతో మంచి విజయం సాధించిన సుజిత్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం పూర్తిగా వేరే జానర్‌ను ఎంచుకున్నాడట. భారీ యాక్షన్, రొమాన్స్, ఎమోషన్ కలగలిపిన ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కబోతోందని ఇండస్ట్రీ టాక్. దసరా సమయంలో పూజా కార్యక్రమం పూర్తి కాగా దీపావళి తర్వాత రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
హీరోయిన్ ఎంపిక దశలో పలు పేర్లు చర్చలో ఉన్నా చివరికి పూజా హెగ్డేనే ఎంచుకున్నారట. నాని–పూజా కాంబినేషన్ ఇదే మొదటిసారి కావడంతో ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తెరపై ఈ జంట కెమిస్ట్రీ ఎలా ఉంటుందన్నది హాట్ టాపిక్‌గా మారింది.
పూజా హెగ్డే ప్రస్తుతం దుల్కర్ సల్మాన్‌తో మరో తెలుగు సినిమాలో నటిస్తోంది. ఆ ప్రాజెక్ట్ ముగిసిన వెంటనే ఈ చిత్ర సెట్స్‌పైకి రానుందని సమాచారం. ఈ సినిమాలో ఆమె పాత్ర ప్రత్యేకంగా డిజైన్ చేశారట. అలాగే చిత్రానికి బ్లడీ రోమియో అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం నాని ప్యారడైజ్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యాక ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. 2026 చివర్లో థియేటర్లలో విడుదల చేసే ఆలోచనలో టీమ్ ఉన్నట్లు సమాచారం.